పెరిగిన డొమినార్ 400, 250 మోటార్‌సైకిళ్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత?
భారత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న డొమినార్ 400 మరియు డొమినార్ 250 మోటార్‌సైకిళ్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గడచిన నెలలోనే కంపెనీ ఈ రెండు మోడళ్లను ధరలను పెంచగా, తాజాగా మరోసారి వీటి ధరలను పెంచడం గమనార్హం.

బజాజ్ డొమినార్ 400 ఈ ఏడాది బిఎస్6 అప్‌డేట్ అందుకున్న వరుసగా ధరలు పెరగడం ఇది మూడవసారి. కాగా, బజాజ్ డొమినార్ 250 భారత మార్కెట్లో ప్రారంభమైన తర్వత ధరలు పెరగడం ఇది రెండవసారి.

బజాజ్ డొమినార్ 400 మోడల్‌పై రూ.1,500 ధరను పెంచగా, ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ.1,97,758 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కి చేరుకుంది. బజాజ్ ఆటో ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ అయిన డొమినార్ 400 సెప్టెంబర్‌లో కూడా ఇదే రేంజ్‌లో పెరిగాయి.

మరోవైపు, బజాజ్ డొమినార్ 250 ధరలను రూ.1,625 మేర పెంచగా, ప్రస్తుతం దీని ధర రూ.1,65,715 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కి చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో ఈ మోటార్‌సైకిల్ ప్రారంభించబడింది. గడచిన సెప్టెంబర్ 2020లో డొమినార్ 250 ధరలను రూ.4,090 మేర పెంచారు.

భారత మార్కెట్లో డొమినార్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచడానికి గల కారణాన్ని బజాజ్ ఆటో ఇంకా వెల్లడించలేదు. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా సప్లయ్ చైన్‌లో ఏర్పడిన అంతరాయాలు మరియు ఉత్పాదక వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

బజాజ్ డొమినార్ 400 మోటార్‌సైకిల్‌లో బిఎస్6 373సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 39.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డొమినార్ 250 కి వస్తున్న ఇది 248 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో గరిష్టంగా 25 బిహెచ్‌పి మరియు 23.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడుతుంది.

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో సస్పెన్షన్ వంటి మెకానికల్ హార్డ్‌వేర్ మరియు హెడ్‌ల్యాంప్ వంటి డిజైన్ అంశాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయి. ఆల్ ఎల్‌ఈడి లైటింగ్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్-బారెల్ ఎగ్జాస్ట్, సింగిల్-పీస్ హ్యాండిల్ బార్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 13-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, సెకండరీ డిస్‌ప్లే, స్ప్లిట్ సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్‌ను గమనిస్తే, ముందు మరియు వెనుక వైపున వరుసగా 320 మిమీ మరియు 230 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

బజాజ్ డొమినార్ మోటార్‌సైకిళ్ల ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బజాజ్ ఆటో తమ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డొమినార్ ధరలను ఒక్క నెల వ్యవధిలోనే మరోసారి పెంచింది. ధరల పెరుగుదల వెనుక గల కారణాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఏదేమైనప్పటికీ, ఈ పెరుగుదల స్వల్పంగా ఉంది కాబట్టి, ఈ మోడల్ అమ్మకాలు పెద్దగా ప్రభావితం కావని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications