బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

భారత ద్విచక్ర వాహన దిగ్గజం 'బజాజ్ ఆటో' ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) కోసం కంపెనీ ఇప్పుడు తిరిగి బుకింగ్‌లను స్వీకరిస్తోంది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ఈ మోడల్ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసిన బజాజ్, ఇప్పుడు తిరిగి బుకింగ్‌లను స్వీకరిస్తోంది.

బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. త్వరలోనే ఈ స్కూటర్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. జనవరి 2020లో బజాజ్ ఆటో తమ ఐకానిక్ చేతక్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ కేవలం బెంగుళూరు మరియు పూనే నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దశల వారీగా ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

కరోనా వైరస్ వ్యాప్తి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌లో గడచిన మే నెలలో ఆటోమొబైల్ కంపెనీలకు మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో బజాజ్ ఆటో దేశవ్యాప్తంగా తిరిగి తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని, బుకింగ్‌లను కూడా పునఃప్రారంభించింది. వాస్తవానికి ఈ స్కూటర్ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అందుబాటులోకి రావల్సి ఉంది, కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది.

బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'అర్బన్ ధర రూ.1 లక్షగా ఉంటే టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'ప్రీమియం' ధర రూ.1.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించనున్నారు.

బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

మోడ్రన్ రెట్రో డిజైన్‌ల కలయికతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పాత కాలపు బజాజ్ చేతక్‌ను తలపించేలా మోడ్రన్ స్టయిల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

ఇది బజాజ్‌కు తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐపి67 గుర్తింపు పొందిన 3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

ఇంకా ఇందులో ముందు వైపు సింగిల్ సైట్ ట్యూబ్యులర్ సస్పెషన్ మరియు వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. అలాగే బ్రేక్స్ విషయానికి వస్తే, ముందు వైపు డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇందులో పెద్ద 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.

బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్లూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ రీఓపెన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ సెగ్మెంట్లోని ఏథర్ 450 మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది. ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పాత ఐకానిక్ చేతక్‌ను తలపిస్తుంది. మరియు పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా పెట్రోల్ వెర్షన్ స్కూటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 16, 2020, 16:41 [IST]
English summary
Bajaj Auto has resumed the bookings for its electric scooter, the Chetak in the Indian market. The company is currently accepting booking for the Chetak electric via its online portal. The deliveries of the scooters are expected to resume soon. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+