Just In
- 16 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ నిలిపివేత; కారణం ఏంటో తెలుసా?
బజాజ్ ఆటో ఈ ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్' కోసం కంపెనీ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. గడచిన మార్చ్ నెలలో దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి మరియు ఆ తర్వాత ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా మార్చి / ఏప్రిల్ నెలలో బజాజ్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ నిలిపివేసింది.

ఆ తర్వాత జూన్ నెలలో కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ ప్రక్రియ కారణంగా, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లను కంపెనీ పునఃప్రారంభించింది. కాగా.. ఇప్పుడు, సెప్టెంబర్ నెలలో కంపెనీ మరోసారి ఈ మోడల్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బజాజ్ చేతక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు నిలిపివేయబడ్డాయి.

ఏదేమైనప్పటికీ, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆసక్తి ఉన్న కస్టమర్లు మాత్రం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఒక ఫారమ్‌ను ఫిల్ చేసి, అందులో వారి వివరాలు నమోదు చేసుకోవచ్చని, తద్వారా తదుపరి దశ బుకింగ్‌లు తిరిగి ప్రారంభమైనప్పుడు, రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లకు తెలియజేస్తామని కంపెనీ ఆ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
MOST READ:పెరుగుతున్న ఆటో ప్రయాణికులు, తగ్గుముఖం పట్టిన క్యాబ్ సర్వీసులు ; ఎందుకో తెలుసా ?

ఈ ఏడాది జనవరి విడుదలైన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతానికి పూణే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే లభిస్తోంది. దశల వారీగా ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా కంపెనీ సప్లయ్ చైన్ దెబ్బతిని, ఈ మోడల్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉపయోగిస్తున్న అనేక విడిభాగాలను దేశీయంగానే సేకరిస్తున్నప్పటికీ, కొన్ని క్లిష్టమైన భాగాలను మాత్రం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతులపై ఆంక్షలు మరియు భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు తదితర కారణాలు కూడా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిపై ప్రభావితం చేసే అవకాశం ఉంది.
MOST READ:రూ. 5 లక్షల లోపు ధర కలిగిన మారుతి సుజుకి టాప్ 5 కార్లు ఇవే.. చూసారా

ఇక బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'అర్బన్ ధర రూ.1 లక్షగా ఉంటే టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'ప్రీమియం' ధర రూ.1.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించనున్నారు.

మోడ్రన్ రెట్రో డిజైన్‌ల కలయికతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పాత కాలపు బజాజ్ చేతక్‌ను తలపించేలా మోడ్రన్ స్టయిల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

ఇది బజాజ్‌కు తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐపి67 గుర్తింపు పొందిన 3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్లూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.
MOST READ:మమ్ముట్టి కార్ కలెక్షన్ : ఈ కార్లకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసా ?

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ నిలిపివేతపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రస్తుతం ఈ రెండు మార్కెట్ల (పూనే, బెంగుళూరు) నుండి వస్తున్న డిమాండ్‌ను పూర్తిచేయటానికే కంపెనీ గట్టిగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇతర మార్కెట్లకు విస్తరించే ప్రణాళికను కూడా కంపెనీ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి ఈ మోడల్ బుకింగ్‌లను ఎప్పుడు రీ-ఓపెన్ చేస్తారో వేచి చూడాల్సి ఉంది.