Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ అభిమాన బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ ఇకపై లేనట్టే, ఎందుకో తెలుసా..?
భారతదేశంలో ద్విచక్ర వాహనతయారీదారులలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో బజాజ్ కంపెనీ ఒకటి. బజాజ్ నుంచి వచ్చిన చాలా ద్విచక్ర వాహనాలు భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణను పొందాయి. కానీ ఇప్పుడు మార్కెట్లో బజాజ్ తన బ్రాండ్ మోటార్ సైకిల్ అయిన అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ ని నిలిపివేసినట్లు ధ్రువీకరించింది. బజాజ్ ఈ మోటార్ సైకిల్ ని ఎందుకు నిలిపివేసింది అనేదాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

బజాజ్ ఆటో తన బ్రాండ్ మోటార్ సైకిల్ అయిన అవెంజర్ 220 స్ట్రీట్ బైక్‌ను భారత మార్కెట్లో నిలిపివేసింది. బజాజ్ తన అధికారిక వెబ్‌సైట్ నుండి బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ పేరును తొలగించారు.

బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ డీలర్లకు పంపిణీ చేయడం కూడా నిలిపివేయబడింది. బజాజ్ ఆటో అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ ఉత్పత్తిని నిలిపివేసింది. బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ ఊహించిన విధంగా అమ్ముడు కాలేదు. దీంతో బజాజ్ ఆటో తన అవెంజర్ 220 స్ట్రీట్ బైక్‌ను నిలిపివేయాల్సి పరిస్థితి ఏర్పడింది.
MOST READ:గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ బైక్ తక్కువ సామర్థ్యంతో మరియు సరసమైన ధరలకు విక్రయిస్తోంది. దీనివల్ల మార్కెట్లో అవెంజర్ 220 స్ట్రీట్ బైక్‌కు డిమాండ్ బాగా తగ్గింది. 220 సిసి అవెంజర్ సిరీస్ అవెంజర్ 220 క్రూయిస్ మోడల్ మాత్రమే భారత మార్కెట్లో విక్రయించబడుతుంది.

బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్‌లో ప్రయాణించడానికి సౌకర్యవంతమైన సీటు ఉంది. దీని డిజైన్ మరియు అల్లాయ్ వీల్స్ ఈ బైక్‌ను చూడటానికి చాలా ఆకర్షణీయంగా చేస్తాయి.
MOST READ:కోవిడ్-19 టెస్ట్ కోసం తిరంగ ప్రాజెక్టును ప్రారంభించిన కేరళ గవర్నమెంట్

అవెంజర్ 220 స్ట్రీట్ బైక్‌లో 220 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 19.3 బిహెచ్‌పి పవర్ మరియు 17.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ వెనుక భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు ట్విన్ అటార్బార్లతో సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ ఎబిఎస్ కూడా ఉంది.

బజాజ్ ఆటో తన సిరీస్‌లోని అన్ని బైక్‌లను బిఎస్ 6 ఇంజిన్‌తో అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ జాబితాలో బజాజ్ యొక్క అవెంజర్ స్ట్రీట్ 160 బిఎస్ 6 మరియు అవెంజర్ క్రూయిస్ 220 బిఎస్ 6 బైక్‌లు ఉన్నాయి. బజాజ్ ఇటీవల మార్కెట్లో ఈ రెండు బైక్‌లను విడుదల చేసింది. అవెంజర్ స్ట్రీట్ 160 బిఎస్ 6 ధర రూ. 1.16 లక్షలు(ఎక్స్-షోరూమ్).
MOST READ:యమహా లాంచ్ చేయనున్న రెండు కొత్త బైక్స్ : FZ 25 & FZS 25

బజాజ్ అవెంజర్ క్రూయిస్ 220 బైక్‌లో 220 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడింది. ఈ ఇంజిన్‌లో ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు.

ఈ మోటార్ సైకిల్లో ఇంజిన్ అప్ గ్రేడ్ పక్కన పెడితే, అవెంజర్ క్రూజ్ 220 బైక్‌లో ఇతర మార్పులు లేవు. డిజైన్ మునుపటిలాగే ఉంటుంది. ఈ బైక్‌లో విండ్‌స్క్రీన్ మరియు పొడవైన క్రోమ్ కూడా ఉంటుంది.