Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరింత ప్రియమైన బజాజ్ అవెంజర్ బైక్స్; రూ.1 లక్ష దాటిన స్ట్రీట్ 160 ధర
బజాజ్ ఆటో ధరల పెంపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే పల్సర్ 200ఎన్ఎస్, డొమినార్ రేంజ్ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన కంపెనీ తాజాగా అవెంజర్ స్ట్రీట్ 160 మరియు అవెంజర్ 220 క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

బజాజ్ ఆటో ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో తమ కొత్త బిఎస్6 వెర్షన్ అవెంజర్ రేంజ్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. అప్పటి నుండి ఈ మోడల్ ధరలు పెరగడం ఇది వరుసగా మూడోసారి.

తాజాగా బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 మోడల్‌పై రూ.5,203 ధర పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత, బ్రాండ్ ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటారుసైకిల్, అవెంజర్ స్ట్రీట్ 160 ధరలు ఇప్పుడు లక్ష రూపాయలను దాటిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్ ధర రూ.1,01,094 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
MOST READ:హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

మరోవైపు, పెద్ద ఇంజన్‌తో కూడిన బజాజ్ అవెంజర్ క్రూయిజ్ 220 మోడల్‌పై రూ.2,457 మేర ధర పెరిగింది. తాజా పెంపు తర్వాత ఈ మోటార్‌సైకిల్ ధర రూ.1,22,630 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ ఆటో దేశీయ విపణిలో తమ క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల ధరల పెంపు గురించి ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు కంపెనీ తమ ఉత్పత్తులను ఇటీవలే బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు మార్చడం వలన ధరల పెరిగి ఉండొచ్చని తెలుస్తోంది.
MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న హోండా హైనెస్ సిబి 350 బైక్ ఫస్ట్ లుక్

బజాజ్ అవెంజర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు సౌకర్యవంతమైన మరియు రిలాక్స్డ్ రైడింగ్ ఎర్గోనామిక్స్‌ను కలిగి ఉండి దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఇందులోని పొడవైన మెత్తటి సింగిల్ పీస్ సీట్, ఫార్వర్డ్-మౌంటెడ్ ఫుట్‌పెగ్స్ మరియు విస్తృతమైన హ్యాండిల్ బార్‌లు రైడ్ సౌకర్యాన్ని మరింత పెంచడంలో సహకరిస్తాయి.

బజాజ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అవెంజర్ క్రూయిజ్ మోటార్‌సైకిల్‌లో 220సిసి ఎయిర్ / ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 19 బిహెచ్‌పి పవర్‌ను మరియు 17.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది.
MOST READ:ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

మరోవైపు, అవెంజర్ స్ట్రీట్ 160 ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో 160సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 15 బిహెచ్‌పి పవర్‌ను మరియు 13.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది.

అవెంజర్ మోటార్‌సైకిళ్ల సస్పెన్షన్‌ను గమనిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. అలాగే బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లలో సింగిల్-ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంటుంది.
MOST READ:భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టాప్-ఎండ్ వేరియంట్ అవెంజర్ క్రూయిజ్ మోటార్‌సైకిల్ మంచి హైవే మైల్ మంచర్ డిజైన్‌తో పాటు పొడవైన విండ్‌స్క్రీన్, రైజ్డ్-హ్యాండిల్‌బార్లు, మంచి కుషన్డ్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులోని క్రోమ్ ఫినిషింగ్‌లు మోటార్‌సైకిల్‌కు మంచి ప్రీమియం లుక్‌ని తెచ్చిపెడతాయి.

అయితే, ఇందులోని ఎంట్రీ లెవల్ 160 సిసి మోటారుసైకిల్ అర్బన్-క్రూయిజర్ రూపాన్ని కలిగి ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్ మరియు ఇంధన ట్యాంక్ మరియు సైడ్ ప్యానెల్స్‌పై రెడ్ డీటేలింగ్స్‌తో బ్లాక్-అవుట్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది.

బజాజ్ అవెంజర్ మోటార్‌సైకిళ్ల ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో బజాజ్ అవెంజర్ మోటార్‌సైకిళ్లు బిఎస్6 అప్‌డేట్ పొందిన తర్వాత వీటి ధరలు పెరగడం ఇది వరుసగా మూడోసారి. ఈ మోడళ్ల ధరలు పెరిగినప్పటికీ, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న చౌకైన క్రూయిజర్ మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది.