ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

ఇండియన్ మార్కెట్లో బజాజ్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బజాజ్ నుండి వస్తున్న మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వాహనమే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ బజాజ్ చేతక్ యొక్క డీలర్షిప్ లు, ధర మొదలైన మరిన్ని విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం!

 ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

బజాజ్ ఆటో ఇటీవల భారతీయ మార్కెట్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ & ప్రీమియం అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రారంభ ధర రూ. 1 లక్ష రూపాయలతో (ఎక్స్-షోరూమ్) అందించబడుతుంది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభంలో కేవలం రెండు నగరాల్లో మాత్రమే లభిస్తుందని ధృవీకరించారు. అవి పూణే మరియు బెంగళూరు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఇప్పుడు రెండు నగరాల్లో 1,999 రూపాయలతో బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. ఫిబ్రవరిలో డెలివరీలు షెడ్యూల్ చేయబడతాయని చేతక్ ధృవీకరించింది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీల ప్రారంభానికి ముందు ఆటోకార్ ఇండియా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉన్న డీలర్‌షిప్‌ల స్థానాలను వెల్లడించింది. ఈ స్కూటర్ బెంగళూరు మరియు పూణే రెండింటిలోని ఎంపిక చేసిన కెటిఎం అవుట్లెట్లలో విక్రయించబడతాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూణేలో ఐదు డీలర్‌షిప్‌లలో మరియు బెంగళూరులోని పదమూడు కెటిఎం అవుట్‌లెట్లలో లభిస్తాయని తెలియజేసారు.

 ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

పూణే నుంచి ప్రారంభమయ్యే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వక్దేవాడి, ఖరాడి, చకన్, ఎఫ్‌సి రోడ్, బండ్ గార్డెన్‌లోని కెటిఎం వంటి డీలర్‌షిప్‌లలో లభిస్తాయి. బెంగుళూరులో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇందిరానగర్, హెచ్‌ఆర్‌బిఆర్ లేఅవుట్, మరాఠహల్లి, ఎలక్ట్రానిక్ సిటీ, వైట్‌ఫీల్డ్, యలహంక, మేఖ్రి సర్కిల్, బిటిఎం లేఅవుట్, బనశంకరి, లాన్‌ఫోర్డ్ రోడ్, బన్నర్‌ఘట్ట, చంద్ర లేఅవుట్, రాజరా లేజౌట్‌లోని కేటీఎం డీలర్‌షిప్‌లలో లభిస్తాయి.

 ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడిన 3 కిలోవాట్ల లిథియం-అయాన్-బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. ఇది 16ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 95 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రామాణిక మరియు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల ఫాస్ట్ ఛార్జింగ్ ను ఉపయోగించి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం ఒక గంట ఛార్జింగ్ తో 25 కిలోమీటర్ల పరిధిని అందించగలదని బజాజ్ పేర్కొన్నారు.

 ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను వివిధ కలర్ ఆప్షన్స్‌తో అందించనున్నారు. బేస్-స్పెక్ మోడల్స్ రెండు కలర్స్ తో వస్తాయి. అవి ఒకటి సిట్రస్ రష్ మరియు రెండు సైబర్ వైట్. అయితే టాప్-స్పెక్ ప్రీమియం మాత్రం ఐదు వేర్వేరు కలర్స్ తో అందించే అవకాశం ఉంది. అవి వరుసగా హాజెల్ నట్, సిట్రస్ రష్, వేలుట్టో రోసో, ఇండిగో మెటాలిక్ మరియు బ్రూక్లిన్ బ్లాక్ కలర్స్.

 ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్షిప్ స్థానాలను వెల్లడించిన బజాజ్ చేతక్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి వచ్చిన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్. చేతక్ మార్కెట్లో వివిధ రంగులలో లభించనుంది. ఇది వినియోగదారులకు చాలా అనుగుణంగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 మరియు ఒకినవా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉండబోతోంది.

Most Read Articles

English summary
Bajaj Chetak Electric Scooter Dealership Locations Revealed For Pune & Bangalore. Read in Telugu.
Story first published: Friday, January 17, 2020, 15:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X