వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలయొక్క అమ్మకాలు భారీగా ఉన్నాయి. ద్విచక్ర వాహన విభాగంలో మరీ ఎక్కువగా ఉన్నాయి. దీని ఫలితంగా రోజు రోజుకి ఇండియా మార్కెట్లోకి కొత్త వాహనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన వాహనాలలో బజాజ్ చేతక్ కూడా ఉంది. ఇప్పుడు చేతక్ గురించి మరిన్నివిషయాలను తెలుసుకుందాం!

వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

బజాజ్ నుండి విడుదలైన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. బజాజ్ ఆటో ఇండియా తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లో పరిచయం చేయడానికి సిద్దమైంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2020 జనవరి 14 నుండి భారత మార్కెట్లో విక్రయించబడుతుందని నిర్ధారించబడింది.

వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని దశల వారీగా ఇండియన్ మార్కెట్లో ప్రారంభించనున్నారు. ఇది దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరించే ముందు కేవలం ఐదు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఐదు నగరాలు బెంగళూరు, పూణే, ముంబై,ఢిల్లీ మరియు చెన్నై నగరాలు మాత్రమే.

వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

ఆల్ ఎలక్ట్రిక్ బజాజ్ చేతక్ కోసం బుకింగ్ రాబోయే రోజుల్లో ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. స్కూటర్ డెలివరీలు మొదట్లో పూణే మరియు బెంగళూరులలో మాత్రమే ప్రారంభమవుతాయి.

వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

మిగిలిన మూడు నగరాల్లో అందుబాటులో ఉంచడానికి ముందు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని కెటిఎమ్ డీలర్‌షిప్‌లలో ప్రత్యేకంగా లభిస్తుందని బజాజ్ గతంలో ధృవీకరించారు. అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలలో కెటిఎమ్ డీలర్‌షిప్‌లలో ఈ వాహనాలను పొందే అవకాశం ఉంది.

వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

2019 చివరిలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ చేతక్ ని ఆవిష్కరించడం జరిగింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.10 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. బజాజ్ చేతక్ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఏథర్ 450 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది. ఏథర్ 450 ఎక్స్ కూడా ఇటీవల కాలంలోనే ప్రకటించడం జరిగింది.

వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్‌లు మరియు ఎలక్ట్రిక్ మోటారుల గురించి బజాజ్ ఇంకా ఖచ్చితమైన వివరాలను ప్రకటించలేదు. అయినప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుందని వారు ప్రకటించారు. ఇది ఒకే ఛార్జీపై గరిష్టంగా 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందన్నారు.

వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

బజాజ్ చేతక్ ఆధునిక లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా రెట్రో-థీమ్‌ ఎక్విప్మెంట్స్ ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు మరియు టైల్లైట్‌ల కోసం ఎల్‌ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్-టచ్ యాక్టివేటెడ్ స్విచ్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, హెడ్‌ల్యాంప్‌ల కోసం క్రోమ్ సరౌండ్స్ మరియు ప్రీమియం ఫినిషింగ్‌లు ఉన్నాయి.

వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో లాంచ్ చేయడంపై ఆలోచనలు:

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వాహనం. చేతక్ ఆధునిక డిజైన్లను కలిగి ఉండటంతో పాటు, నిర్దిష్టమైన ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వినియోగదారులకు అనుగుణంగా ఉంటుంది. బజాజ్ చేతక్ ఇంక కొన్ని రోజులలోనే మార్కెట్లోకి విడుదలవనుంది. కాబట్టి అతి తొందరలో చేతక్ ఎలా నడుస్తుంది అని తెలుసుకోవడానికి వేచి చూద్దాం!

More from DriveSpark

Article Published On: Wednesday, January 8, 2020, 11:29 [IST]
English summary
Bajaj Chetak Electric Scooter India-Launch Date Confirmed: Here Are All The Details-Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+