15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

బజాజ్ ఆటో సరికొత్త చేతక్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం దేశీయ మార్కెట్ నుండి నిష్క్రమించిన చేతక్ స్కూటర్ ఇప్పుడు అత్యాధునిక శైలిలో ఎలక్ట్రిక్ శైలిలలో మళ్లీ మార్కెట్లోకి వచ్చింది.

పెట్రోల్ లేకుండా కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తో మాత్రమే నడిచే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ ధర అక్షరాలా లక్ష రూపాయలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. భారీ అంచనాలతో మరెన్నో ఆశలతో వచ్చిన చేతక్ ఎలక్ట్రిక్ గురించి పూర్తి వివరాలు...

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో చేతక్ ఎలక్ట్రిక్ ప్రీమియం టాప్ ఎండ్ వేరియంట్, దీని ధర రూ. 1.15 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ప్రస్తుతానికి ఇది పూనే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

బజాజ్ చేతక్ కంపెనీ యొక్క తొలి ఎలక్ట్రిక్ బ్రాండ్ స్కూటర్, దీనిని కేవలం కెటిఎమ్ షోరూముల ద్వారానే విక్రయిస్తారు. పూనేలో ప్రత్యేకంగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. తొలుత బెంగళూరులో 14 , పూనేలో 4 షోరూముల ద్వారా దీనిని విక్రయిస్తున్నారు.

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో IP67 గుర్తింపు పొందిన 3kWh బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే 4kW ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇది గరిష్టంగా 16ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు దీని గరిష్టం వేగం గంటకు 95కిలోమీటర్లుగా ఉంది. చేతక్ ఎలక్ట్రిక్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీ స్టాండర్డ్ ఛార్జింగ్ మరియు ఫాస్ట్-ఛార్జింగ్ టెక్నాలజీతో లభిస్తోంది. ఒక గంట ఛార్జింగ్‌తో ఏకంగా 25కిలోమీటర్లు నడుస్తుందని బజాజ్ పేర్కొంది. సాంకేతిక అంశాలతో పాటు రెట్రో స్టైల్ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ మరియు మరెన్నో ఫీచర్లను చేతక్‌లో పరిచయం చేశారు.

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

డిజైన్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ ఫస్ట్ టైమ్ రెట్రో థీమ్ పరిచయం చేసింది. వికారమైన ఆకారాలు కాకుండా చాలా సింపుల్‌ అండ్ స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. ఆకర్షణీయమైన బాడీ లైన్స్, స్మూత్ బాడీ ప్యానల్స్ మరియు ఎలాంటి బాడీ గ్రాఫిక్స్ లేకుండా సింగల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డిజైన్ చేశారు.

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌లో మోడ్రన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, గుండ్రటి ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డిస్క్ బ్రేక్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రీజనరేటివ్ బ్రేకింగ్ మరియు రివర్స్ గేర్ అసిస్ట్ వంటి ఫీచర్లు హైలెట్‌గా నిలిచాయి.

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మీద నేటి (జనవరి 15, 2020) నుండి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఫిబ్రవరి చివరి నుండి డెలివరీలు షురూ అవుతాయి. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీద రూ. 2000 చెల్లించ్ బుక్ చేసుకోవచ్చు.

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్లూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

 15 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన బజాజ్ చేతక్: ధర మరియు పూర్తి వివరాలు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క తొలి ఎలక్ట్రిక్ వెహికల్. సుమారుగా 14 ఏళ్ల క్రితం మార్కెట్ నుండి వైదొలగిన చేతక్ స్కూటర్ పూర్వవైభాన్ని చేతక్ ఎలక్ట్రిక్ మళ్లీ తీసుకొస్తుందని బజాజ్ భావిస్తోంది. ఇది మార్కెట్లో ఉన్న ఏథర్ 450 మరియు ఒకినవ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఇంకా కొన్ని మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Bajaj Chetak Electric Scooter Launched In India At Rs 1 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X