Just In
Don't Miss
- News
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త మైలురాయిని చేరుకున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ఈ ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్' ఇప్పుడు ఓ కొత్త మైలురాయని చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి 1000 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

దేశీయ మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'అర్బన్ ధర రూ.1 లక్షగా ఉంటే టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'ప్రీమియం' ధర రూ.1.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంపిక చేసిన నగరాల్లో బజాజ్ కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

ఈ సంవత్సరం జనవరి విడుదలైన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతానికి పూణే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే లభిస్తోంది. వాస్తవానికి కంపెనీ ఈ స్కూటర్‌ను దశల వారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేసినప్పటికీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా కొత్త నగరాల్లో దీని విడుదల మరింత ఆలస్యమైంది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ తర్వాతి కాలంలో దీని అమ్మకాలు క్రమంగా పుంజుకుని, నెలవారీ వృద్ధిని కనబరచాయి.

ఇక చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది బజాజ్‌కు తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐపి67 గుర్తింపు పొందిన 3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి.
MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

మోడ్రన్ రెట్రో డిజైన్‌ల కలయికతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పాత కాలపు బజాజ్ చేతక్‌ను తలపించేలా మోడ్రన్ స్టయిల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ మైల్‌స్టోన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ మోడల్. ప్రీమియం ఇ-స్కూటర్ విభాగంలో విడుదలైన బజాజ్ చేతక్, ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్ మరియు టివిఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.