డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన బజాజ్ ఆటో ఇటీవలే తన డామినార్ 250 బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బజాజ్ ఆటో ఇప్పుడు ఆకర్షణీయమైన టివిసితో కొత్త డామినార్ 250 బైక్‌ను విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బజాజ్ డామినార్ 250 బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం..

డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో

కొత్త బజాజ్ డామినార్ 250 బైక్ దాని మునుపటి డామినార్ 400 బైక్ మాదిరిగానే ఉంటుంది. కానీ డామినార్ 250 బైక్‌లో కొన్ని మార్పులు గమనించవచ్చు. కొత్త డామినార్ 250 బైక్ 'డి 250' బ్యాడ్జ్‌తో ఎరుపు రంగులో ఉంటుంది. బజాజ్ డామినార్ 250 బైక్ స్పర్టియర్ డిజైన్‌తో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది.

డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో

కొత్త బజాజ్ డామినార్ 250 బైక్‌లో కెటిఎమ్ 250 డ్యూక్ లో ఉన్న 248 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 26.6 bhp మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో

డామినార్ 400 మరియు కొత్త డామినార్ 250 మధ్య కొన్ని తేడాలు గమనించినట్లైతే, ఇందులో లో కాస్ట్ స్వింగార్మ్, యుఎస్డి ఫోర్క్ మరియు డిఫరెంట్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను కలిగి ఉంది.

డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో

డామినార్ 400 బైక్‌లతో పోలిస్తే కొత్త బజాజ్ డొమినార్ 250 బైక్ యొక్క టైర్ ప్రొఫైల్స్ కూడా భిన్నంగా ఉంటాయి. ఈ బైక్ డామినార్ 400 మోడల్ కంటే తక్కువ బరువు కలిగి ఉంది. బజాజ్ 250 సిసి కంటే ఎక్కువ బైక్‌ల కోసం డామినార్ నేమ్‌ప్లేట్‌ను ఉపయోగిస్తుంది. కొత్త బజాజ్ డొమినార్ 250 ధర రూ. 1.60 లక్షలు.

బజాజ్ డామినార్ 400 బైక్‌లో 373.3 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజిన్ 8650 rpm వద్ద 40 bhp శక్తిని మరియు 7000 rpm వద్ద 35 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో

బజాజ్ డామినార్ 250 భారత మార్కెట్లో సుజుకి జిక్సర్ 250 మరియు యమహా ఎఫ్ జెడ్ 25 బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది. బజాజ్ డామినార్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది యువ రైడర్లను ఆకర్షించడానికి ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 1, 2020, 14:14 [IST]
English summary
Bajaj Dominar 250 TVC: Check it out. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+