విఫణిలోకి బజాజ్ డామినార్ యొక్క మరో కొత్త బైక్

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి కొత్త బజాజ్ డామినార్ 250 బైక్ ని విడుదల చేయనున్నట్లు ధ్రువీకరించింది. బజాజ్ విడుదల చేయనున్న కొత్త బజాజ్ మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

విఫణిలోకి బజాజ్ డామినార్ యొక్క మరో కొత్త బైక్

బజాజ్ ఆటో తన కొత్త డామినార్ 250 బైక్ ని ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేయనుంది. ఏ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

విఫణిలోకి బజాజ్ డామినార్ యొక్క మరో కొత్త బైక్

బజాజ్ సంస్థ కొంతకాలంగా డామినార్ 250 బైక్ ని పరీక్షిస్తుంది. ఈ మోటార్ సైకిల్ అనేక సందర్బాలలో పరీక్షలకు గురి చేశారు. డొమినార్ 250 లో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు బాక్స్-సెక్షన్ స్వింగార్మ్ వంటి అమర్చబడ్డాయి, అంతే కాకుండా ఈ మోటారుసైకిల్ చిన్న డిస్క్ బ్రేక్‌లతో కూడా వచ్చే అవకాశం ఉంది.

విఫణిలోకి బజాజ్ డామినార్ యొక్క మరో కొత్త బైక్

ఈ కొత్త డామినార్ 250 మోటారుసైకిల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, డ్యూయల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, చిన్న రియర్ టైర్, మరియు డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ ప్రామాణికంగా ఉంటాయి.

విఫణిలోకి బజాజ్ డామినార్ యొక్క మరో కొత్త బైక్

కొత్త డొమినార్‌ 250 లో 249 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 30 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 24 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. రాబోయే బజాజ్ డొమినార్ 250 బైక్ ధర సుమారు రూ. 1.45 లక్షల నుండి రూ. 1.55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య నిర్ణయించబడుతుంది.

విఫణిలోకి బజాజ్ డామినార్ యొక్క మరో కొత్త బైక్

బజాజ్ కి సంబంధిన వార్తల ప్రకారం, బజాజ్ కంపెనీ ఇటీవల మార్కెట్లో బిఎస్-6 పల్సర్ 150 మోడల్ మోటార్ సైకిల్ ను 94,956 రూపాయలకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభించింది. ఈ పల్సర్ బైక్ మార్కెట్లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోటార్ సైకిల్ కొత్త ఫ్యూయెల్ ఇంజిన్ సిస్టం ని కలిగి ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వాహనదారునికి అనుకూలంగా ఉండడంతో పాటు మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

విఫణిలోకి బజాజ్ డామినార్ యొక్క మరో కొత్త బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి అరంగేట్రం చేయనుంది. కొత్తగా రాబోయే బజాజ్ బైక్ కొంత తక్కువ బరువును కలిగి ఉంటుందని చెప్పవచ్చు. బజాజ్ డామినేట్ర్ 250 మోటార్ సైకిల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్త్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏది ఏమైనా బజాజ్ యొక్క కొత్త బైక్ కోసం ఇంకా కొంత కాలం ఎదురు చూడక తప్పదు.

Most Read Articles

English summary
Bajaj Dominar 250 To Make Indian Debut In March: Launch Expected In April. Read in Telugu.
Story first published: Saturday, February 29, 2020, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X