రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారు అయిన బజాజ్ ఆటో ఇప్పుడు డామినర్ 250 ని విడుదల చేసింది. బజాజ్ ఆటో విడుదల చేసిన ఈ బజాజ్ డామినర్ 250 బైక్ ధర రూ. 1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బజాజ్ యొక్క కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మీ కోసం..

రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన బజాజ్ డామినార్ డి 250 బుకింగ్స్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు డామినార్ 250 భారతదేశంలో అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. బజాజ్ డామినార్ 250 మోటార్ సైకిల్స్ త్వరలో డెలివరీ కానున్నాయి.

రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

బజాజ్ డామినార్ 250 బైక్ డామినార్ 400 బైక్ లాంటి డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్-టోన్ ప్యానెల్స్‌, పుల్లీ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎహెచ్‌ఓ లైట్లతో కూడిన బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి.

రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

కొత్త బజాజ్ డొమినార్ 250 బైక్ 248 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 25 బిహెచ్‌పి మరియు 23.5 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇంజిన్ సరికొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారుచేయబడి ఉంటుంది.

రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ 'సారంగ్ కనడే' మాట్లాడుతూ, డామినార్ బ్రాండ్ తనకంటూ ఒక బలమైన ఫాలోయింగ్‌ను సృష్టించుకోగలిగింది. అంతే కాకుండా సుదూరప్రాంతాలకు వెళ్లే వారికి ఇది చాల బాగా ఉపయోగపడుతుంది. పర్యాటక ప్రపంచంలో ప్రవేశించాలనుకునే రైడింగ్ ఔత్సాహికులకి బజాజ్ డామినార్ ఒక సరికొత్త ఎంపిక అవుతుంది.

రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

కొత్త బజాజ్ డామినార్ 250 లో ఫీచర్స్ గమనించినట్లైయితే ఇది చాలా వరకు డామినార్ 400 బైక్ లాగ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 37 మిమీ అప్ సైడ్ డౌన్ ఫోర్కులు మరియు ట్విన్ బారెల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. ఈ బైక్ వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

బజాజ్ డామినార్ 250 లో పునఃరూపకల్పన చేసిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇది ఇప్పుడు గేర్ పొజిషన్, ట్రిప్ ఇన్పర్మేసన్ మరియు టైమ్ వంటి అదనపు సమాచారాన్ని కూడా అందిస్తుంది.

రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

డామినార్ యొక్క ముందు భాగంలో సస్పెన్షన్ 37 ఎంఎం యుఎస్డి ఫోర్కులు, వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే ఈ బైక్ ముందు భాగంలో 300 ఎంఎం డిస్క్ మరియు వెనుక వైపు 230 ఎంఎం డిస్క్ ఉంటుంది. బజాజ్ డామినార్ 250 స్లిప్పర్ క్లచ్ కూడా కలిగి ఉంటుంది. కొత్త బజాజ్ డామినార్ 250 రెండు రంగు ఎంపికలలో అందించబడుతుంది. అవి కాన్యన్ రెడ్ మరియు వైన్ బ్లాక్ కలర్స్.

రూ. 1.60 లక్షలతో ప్రారంభమైన బజాజ్ డామినర్ 250 బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో విడుదలైన బాజా డామినార్ 250 డామినార్ నేమ్‌ప్లేట్‌తో ముందుకు వెళుతున్న బజాజ్ యొక్క రెండవ మోడల్. ఇది మార్కెట్లో సుజుకి జిక్సెర్ 250, కెటిఎమ్ డ్యూక్ 250 మరియు యమహా ఎఫ్ జెడ్ 25 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Bajaj Dominar 250 Launched In India At Rs 1.60 Lakh: Rivals The KTM Duke 250. Read in Telugu.
Story first published: Wednesday, March 11, 2020, 16:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X