స్పై టెస్ట్ లో కనిపించిన కొత్త బజాజ్ డామినార్ 250
ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన బజాజ్ ఆటో ఇటీవల కాలంలో తన బ్రాండ్ యొక్క మరో కొత్త బైక్ ని ధృవీకరించింది. బజాజ్ ఆటో ద్రువీకరించి ఈ కొత్త బైక్ పేరే బజాజ్ డామినార్ 250. ఈ కొత్త బజాజ్ డామినార్ 250 గురించి మరిన్ని వివరాలు మీకోసం..

ఇటీవల కాలంలో ధ్రువీకరించిన బజాజ్ డామినార్ 250 బైక్ ప్రయోగించడానికి ముందే మొదటి పరీక్షలకు గురిచేసింది. బజాజ్ యొక్క కొత్త డామినార్ 250 బైక్ డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంది. కొత్త బజాజ్ డామినార్ 250 చూడటానికి బజాజ్ డామినార్ 400 మోడల్స్ లాగానే ఉంటాయి. బజాజ్ డామినార్ ఇప్పుడు ఎరుపు రంగులో కూడా లభించనుంది.

కొత్త డామినార్ 250, 249 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ద్వారా శక్తినివ్వనుంది. అయినప్పటికీ ఇది కొంచెం తక్కువ శక్తి మరియు టార్క్ ఫిగర్స్ ని ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బజాజ్ డామినార్ 400 మరియు కొత్త బజాజ్ డామినార్ 250 బైక్ మధ్య తేడాలను గమనిస్తే ఇందులో తక్కువ ఖర్చుతో కూడిన స్వింగార్మ్ మరియు వేరే అల్లాయ్ వీల్ డిజైన్ కూడా ఉన్నాయి. టైర్ ప్రొఫైల్స్ కూడా భిన్నంగా ఉంటాయి. 250 సిసి మరియు అంతకంటే ఎక్కువ స్థానభ్రంశంతో బజాజ్ అన్ని మోటార్ సైకిళ్ళకు డామినార్ నేమ్ ప్లేట్ ను కలిగి ఉంటుంది.

ఈ కొత్త డామినార్ 250 మోటారుసైకిల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, డ్యూయల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, చిన్న రియర్ టైర్, మరియు డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ ప్రామాణికంగా ఉంటాయి.

బజాజ్ యొక్క కొత్త డామినార్ 250 ధర రూ. 1.50 లక్షల నుండి రూ. 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. కొత్త డొమినార్ 250 కోసం బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయి. అదే విధంగా డెలివరీలు కూడా తొందరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:
బజాజ్ కొన్ని సంవత్సరాల క్రితమే భారత మార్కెట్లో డామినార్ 400 ను లాంచ్ చేసింది. కానీ 373 సిసి మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లో ఆశించిన ప్రభావాన్ని తీసుకురాలేదు. అయితే ఇప్పుడు బజాజ్ 250 డామినార్ భారత మార్కెట్లో మెరుగైన ప్రదర్శన ఇస్తుందని బజాజ్ కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి.
Source: Rushlane


Click it and Unblock the Notifications








