పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

ప్రముఖ దేశీయ టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న డొమినార్ 400, డొమినార్ 250 మోటార్‌సైకిళ్ల ధరలను పెంచింది. వీటిలో డొమినార్ 400 ధరలు బిఎస్6 అప్‌డేట్ పొందిన తర్వాత పెరగటం రెండవసారి కాగా డొమినార్ 250 ధరలు మాత్రమే విడుదలైన తర్వాత మొదటిసారిగా పెరిగాయి.

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

డొమినార్ 400 ధర పెంపు

బజాజ్ డొమినార్ 400 మోడల్‌పై ధరలు రూ.1,507 పెరగగా, ప్రస్తుతం దీని ధర రూ.1.96 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. డొమినార్ 400 భారత మార్కెట్లో విడుదలై నాలుగేళ్లు గడుస్తోంది, అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ మోడల్ ధర సుమారు రూ.35,000 లకు పైగా పెరిగింది.

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

బజాజ్ డొమినార్ 400 మోటార్‌సైకిల్‌లో బిఎస్6 కంప్లైంట్ 373 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 39.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఖరీదైన మోడిఫైడ్ కార్ రిజిస్ట్రేషన్ సస్పెండ్, ఎదుకో తెలుసా ?

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

బజాజ్ డొమినార్ 400 మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి: వైన్ బ్లాక్ మరియు అరోరా గ్రీన్. డొమినార్ 400లో హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్‌ఎల్‌లు మరియు టెయిల్ లైట్స్ అన్నీ కూడా పూర్తి ఎల్ఈడిలతో లభిస్తాయి. ఇంకా ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్-బారెల్ ఎగ్జాస్ట్, సింగిల్-పీస్ హ్యాండిల్ బార్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 13-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

దీని సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపున వరుసగా 320 మిమీ మరియు 230 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:స్కోడా రాపిడ్ టిఎస్ఐ మోంటే కార్లో ఎడిషన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. వచ్చేసింది

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

డొమినార్ 250 ధర పెంపు

బజాజ్ డొమినార్ సిరీస్‌లో తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన వేరియంట్ అయిన డొమినార్ 250ను కంపెనీ ఈ ఏడాది ఆరంభంలోనే మార్కెట్లో విడుదల చేసింది. విడుదల సమయంలోనే ఇది బిఎస్6 కంప్లైంట్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ మోడల్ ధరను కంపెనీ రూ.4,090 మేర పెంచింది. తాజా పెంపు తర్వాత ఈ మోడల్ ధర రూ.1.64 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

కొత్త బజాజ్ డొమినార్ 250 మోటార్‌సైకిల్‌లో 248 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పి పవర్‌ను మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డొమినార్ 250 ఉపయోగించిన ఇంజన్‌ను కెటిఎమ్ 250 డ్యూక్ మోడల్ నుండి గ్రహించారు.

MOST READ:షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

డొమినార్ 250లో కేవలం ఇంజన్ మార్పు మినహా మిగిలిన అన్ని ఇతర ఫీచర్లు మరియు పరికరాలు దాని బిగ్ బ్రదర్ అయిన డొమినార్ 400 నుండి గ్రహించారు. డొమినార్ 250 కూడా డొమినార్ 400లో కనిపించే డిజైన్ మరియు స్టైలింగ్‌ను కలిగి ఉంది. ఈ రెండు మోడళ్లలో సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ హార్డ్‌వేర్ కూడా యధావిధిగా ఉంటుంది.

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

కొత్త బజాజ్ డొమినార్ 250 రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో కాన్యన్ రెడ్ మరియు వైన్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, డొమినార్ 250 ఒక స్పోర్ట్స్-టూరర్ మోటార్‌సైకిల్. దేశంలో 125 సిసి లేదా 150 సిసి మోటార్‌సైకిల్ నుండి అప్‌గ్రేడ్‌ను కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఈ మోడల్‌ను ప్రవేశపెట్టారు.

MOST READ:అదిరిపోయే ఫీచర్స్ తో మోడిఫైడ్ చేయబడిన ఫోర్స్ ట్రావెలర్, దీని ముందు లిమోలిన్ కూడా దిగదుడుపే

పెరిగిన బజాజ్ డొమినార్ 400, 250 మోడళ్ల ధరలు: ఏ మోడల్‌పై ఎంత?

బజాజ్ డొమినార్ మోటార్‌సైకిళ్ల ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బజాజ్ ఆటో ఈ రెండు మోటార్‌సైకిళ్ల ధరల పెంపుకు గల కారణాన్ని ఇంకా వివరించలేదు. బిఎస్6 అప్‌డేట్ తర్వాత డొమినార్ 400 ధరలు పెరగడం ఇది రెండవసారి. తాజా పెంపుతో ఈ మోడల్ ధర సుమారు రూ.2.0 లక్షలకు చేరువయ్యింది.

Most Read Articles

English summary
Indian two-wheeler manufacturer, Bajaj Auto, has announced a price hike on the Dominar 400 and the Dominar 250 motorcycles in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X