Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా బజాజ్ ఆటో క్రూయిజర్ మోటార్‌సైకిల్?
భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో కొత్తగా "న్యూరాన్" అనే పేరును ట్రేడ్‌మార్క్ కోసం భారత మార్కెట్లో నమోదు చేసింది. బహుశా, ఇది భారత్ కోసం ప్లాన్ చేసిన కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. భవిష్యత్తులో ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి మోడళ్లకు పోటీగా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

బజాజ్ ఆటో నుండి రాబోయే కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లోని ఇంజన్‌ను బజాజ్ డొమినార్ 400 మోడల్ నుండి గ్రహించే అవకాశం ఉంది. అంటే దీని అర్థం బజాజ్ ఆటో భారత టూవీలర్ మార్కెట్లో 350సిసి విభాగంలో తమ కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ విభాగానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్ లీడర్‌గా ఉంది.

కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను బజాజ్ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించే అవెంజర్ లైనప్ మాదిరిగానే రూపొందించవచ్చని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం 160 సిసి మరియు 220 సిసి అనే రెండు ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్లలో లభిస్తోంది. కాగా, బజాజ్ నుండి రాబోయే కొత్త క్రూయిజర్ మోటారుసైకిల్ భారతదేశంలో విక్రయించబడుతున్న ప్రస్తుత టాప్-స్పెక్ అవెంజర్ 220 క్రూయిజర్ మోడల్ కంటే దాదాపు రెండు రెట్లు శక్తివంతమైనదిగా ఉంటుంది.
MOST READ:ట్రక్ దొంగలించిన కొంత సమయానికే పట్టుబడ్డ దొంగల ముఠా.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?

బజాజ్ ఆటో ఫైల్ చేసిన ట్రేడ్‌మార్క్ పేరు విషయంలో ఇప్పటికే అనేక ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇది సరికొత్త మోటార్‌సైకిల్ అయి ఉండొచ్చు లేదా అనుసంధాన సాంకేతిక పరిజ్ఞానం (కనెక్టింగ్ టెక్నాలజీ) అయి ఉండొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సరికొత్త మోటారుసైకిల్ ఆలోచనకు ప్రత్యామ్నాయంగా, న్యూరాన్ పేరును సంస్థ నుండి రాబోయే సాంకేతిక ఉత్పత్తి కోసం రిజర్వు చేశారని కూడా చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలపై అనుసంధానించబడిన సాంకేతికత (కనెక్టింగ్ టెక్నాలజీ) అత్యంత ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో చాలా బ్రాండ్లు బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ ఎనేబల్డ్ మరియు మొబైల్ అప్లికేషన్‌లతో కనెక్ట్ చేసే టెక్నాలజీని అందిస్తున్నాయి.
MOST READ:రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?

ఈ సాంకేతిక పరిజ్ఞానాలతో, రైడర్ లేదా వినియోగదారుడు తన మోటార్‌సైకిల్‌కు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకోవటంతో పాటుగా తన వాహనంతో కమ్యూనికేట్ కూడా చేయవచ్చు. రైడ్ గణాంకాలు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ మరియు ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్ వంటి ఎన్నో విషయాలను ఈ కనెక్టెడ్ టెక్నాలజీ సాయంతో తెలుసుకోవచ్చు.

బజాజ్ ఆటో అందిస్తున్న చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మినహా వేరే ఏ ఇతర బజాజ్ మోటార్‌సైకిళ్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ అందుబాటులో లేదు. కాబట్టి, ఒకవేళ బజాజ్ ఆటో ఫైల్ చేసిన పేరు కనెక్టింగ్ టెక్నాలజీకి సంబంధించినది అయితే, భవిష్యత్తులో రాబోయే బజాజ్ మోటార్‌సైకిళ్లలో కొత్తగా కనెక్ట్ చేయబడిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
MOST READ:యంగ్ కార్ట్ రేసర్‌పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలుసా ?

ఒకవేళ బజాజ్ ఆటో ఈ కొత్త కనెక్టెడ్ టెక్నాలజీని అభవృద్ధి చేస్తే, ముందుగా ఇది బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ డొమినార్‌లో కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పాపులర్ పల్సర్ సిరీస్ మోటార్‌సైకిళ్ళలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే, కంపెనీ వీటిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

బజాజ్ ఆటో న్యూరాన్ పేరును ట్రేడ్‌మార్క్ చేయటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బజాజ్ న్యూరాన్ పేరు భారత మార్కెట్లో ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేయబడింది మరియు ఇది దేశంలోని బ్రాండ్ నుండి రానున్న కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్ కావచ్చని తెలుస్తోంది. అలాకాకుండా, ఇది కొత్త అనుసంధాన సాంకేతిక పరిజ్ఞానం కూడా అయి ఉండే అవకాశం ఉంది.
MOST READ:పరుగులు పెడుతున్న మహీంద్రా థార్ బుకింగ్స్.. ఇప్పటికే దీని బుకింగ్స్ ఎంతంటే ?