కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

నేడు ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్న భయంకరమైన వైరస్ కరోనా. ఈ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచంలో చాలామంది ప్రాణాలను కోల్పోయారు. అంతే కాకుండా ఈ వైరస్ ప్రభావం ఆటో మొబైల్ పరిశ్రమలపై కూడా పడింది.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

ఈ కరోనా వైరస్ ప్రభావం భారతదేశంలో కూడా ఎక్కువగా ఉంది. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వైరస్ బాధితులను ఎట్టకేలకు కాపాడుగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో కరోనా తగ్గించడానికి భారతదేశం మొత్తం ఇప్పటికే 21 రోజుల లాక్ డౌన్ లో ఉంది. ఈ విధంగా లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశం ఆర్ధిక పరమైన సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి దేశ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సినీ పరిశ్రమలు మొదలైన వారు కొంత విరాళాలను కూడా ఇవ్వడం జరిగింది.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

కరోనా వైరస్ నియంత్రణ కోసం పాటు పడుతున్న మన దేశం కోసం బజాజ్ సంస్థ 100 కోట్లను విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకుంది.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

ప్రాణాంతకమైన కోవిడ్ -19 వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడటానికి దేశంలో వైద్య సహాయాల కోసం 100 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. ఇది భారతదేశంలో అవసరమైన అన్ని ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు తోడ్పడుతుందని తెలిపింది.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

బజాజ్ నుండి విరాళంగా అందుకున్నరూ. 100 కోట్ల సహాయ నిధిని ప్రభుత్వ మరియు కొన్ని ప్రైవేటు రంగ ఆసుపత్రులు తమ పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగిస్తాయి. ఇందులో మెరుగైన ఐసియులు, వైద్య సిబ్బంది రక్షణ, అదనపు వెంటిలేటర్లు మరియు ఇతర పరీక్షా విభాగాల కోసం ఉపయోగించబడుతుంది.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

బజాజ్ కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం పూణేలో కోవిడ్ -19 ను పరిష్కరించడానికి అవసరమైన కీలకమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు కంపెనీ మద్దతు ఇస్తుందని తెలిపింది.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

బజాజ్ ఆటో ఈ రిలీఫ్ ఫండ్ వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందని పేర్కొంది. ఆహారం మరియు ఆశ్రయం కల్పించడం కోసం మరియు గ్రామీణ కారుల మరియు జీవనోపాధి సహాయం కోసం కూడా ఉపయోగించబడుతుంది. రోజువారీ కూలీ కార్మికులు, నిరాశ్రయులకు మరియు వీధి పిల్లలకు తక్షణ మద్దతు ఇవ్వడానికి ఈ సంస్థ బహుళ సంస్థలతో కలిసి పనిచేస్తుందని నిర్దారించింది.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

ఆశ్రయం మరియు ప్రాథమిక పారిశుధ్యం మరియు ఆరోగ్య సంరక్షణను అందించే కార్యక్రమాలకు బజాజ్ సహకరిస్తుంది. అంతే సంస్థ గ్రామీణ ప్రాంతాలకు సహాయ నిధులను కూడా అందించనుంది.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ -19 పై మరింత అవగాహన కల్పించడంలో బజాజ్ అధికారులు మరియు భాగస్వాములతో కలిసి పని చేస్తారు. అదే సమయంలో వారి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తారు.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

కోవిడ్ -19 వైరస్ పోరాటం కోసం నగదు విరాళం ప్రకటించిన రెండవ ఆటో పరిశ్రమ బజాజ్. ఎంజీ మోటార్స్ ఇటీవల రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. చాలా పెద్ద ఆటోమోటివ్ కంపెనీలు కూడా వైరస్ నివారణలో భాగంగా తమ మద్దతును ప్రకటించాయి. చాలా కంపెనీలు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంస్థలకు సరఫరా చేయడానికి వెంటిలేటర్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి.

కరోనా ఎఫెక్ట్ : వైద్య సహాయం కోసం 100 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బజాజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

భారతదేశంలో చాల ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ నివారణకు చర్యలను తీసుకుంటున్న భారత ప్రభుత్వానికి మద్దతుగా చాలా మంది సినీ పరిశ్రమ వారు, కొన్ని ఆటో మొబైల్ సంస్థలు తమ మద్దతుని ప్రకటించడమే కాకుండా కొంత డబ్బుని విరాళంగా కూడా ఇచ్చారు. దేశ ప్రజల రక్షణ కోసం ఇంతమంది మద్దతు తెలుపుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు కూడా మద్దతు ప్రకటిస్తూ ఇంట్లోనే ఉంటూ ఈ వైరస్ మహమ్మారి నుంచీ దేశానికీ విముక్తి కగించాలి.

More from DriveSpark

Article Published On: Friday, March 27, 2020, 15:38 [IST]
English summary
Coronavirus Lockdown: Bajaj Auto Announces A Donation Of Rs 100 Crore To Provide Medical Aids. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+