కరోనా ఎఫెక్ట్: మరోసారి పెరిగిన అవెంజర్ స్ట్రీట్ 160 ధర!

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో భారత మార్కెట్లో విక్రయిస్తున్న అవెంజర్ స్ట్రీట్ 160 ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటారుసైకిల్ ధరను మరోసారి పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. బిఎస్6 అప్‌గ్రేడ్స్ తరువాత బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 మోటార్‌సైకిల్ ధరలు పెరగటం ఇది రెండవ సారి. ఈసారి బైక్ ధరలను రూ.1,000 మేర పెంచినట్లు కంపెనీ తెలిపింది.

భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

తాజా ధరల పెరుగుదల తర్వాత ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 ధర రూ.95,893 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. బజాజ్ గత నెలలో ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధరను పెచింది. ఏదేమైనప్పటికీ, రెండవ సారి ధరలను పెంచిన తర్వాత కూడా, ఈ మోటార్‌సైకిల్ దేశంలో అత్యంత సరసమైన క్రూయిజర్‌గా కొనసాగుతోంది.

భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

ధరల పెరుగుదల మినహా, ఇందులో ఇతర మార్పులు ఏవీ లేవు. బజాజ్ ఆటో 2020 ఏప్రిల్‌లో అవెంజర్ స్ట్రీట్ 160 బిఎస్6 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గత జూన్ నెలలో ఈ బైక్ ధరను రూ.2,216 మేర పెంచగా, తాజాగా మరోసారి రూ.1,000 మేర పెంచారు.

MOST READ:కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

ధరల పెంపును అందుకున్నది కేవలం బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 మాత్రమే కాదు, కంపెనీ ఇటీవలే తమ పాపులర్ పల్సర్ 150 మోటార్‌సైకిల్ ధరను కూడా పెంచింది. బజాజ్ పల్సర్ 150 శ్రేణిపై కంపెనీ కొన్ని రోజుల క్రితమే రెండవ సారి రూ.1,000 మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 మోటార్‌సైకిల్‌లో 160 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.8 బిహెచ్‌పి శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే

భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 మోటార్‌సైకిల్ ముందు భాగంలో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌ను అమర్చారు. ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 280 మి.మీ డిస్క్ మరియు వెనుక భాగంలో 130 మి.మీ డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది సింగిల్ ఛానల్ ఎబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 మోటార్‌సైకిల్ ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు మార్చి 2020లో కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ తర్వాతి నుంచి భారత మార్కెట్లో వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాలకు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది. అవెంజర్ స్ట్రీట్ 160 ధర పెంపుపై కంపెనీ అధికారికంగా ఎలాంటి కారణం ప్రకటించకపోయినప్పటికీ, పైన పేర్కొన్న పరిస్థితులే ఇందుకు కారణమై ఉండొచ్చని అంచనా. ఇకపోతే, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 ఈ సెగ్మెంట్లోని సుజుకి ఇంట్రూడర్ 155 ప్రత్యక్షంగా పోటీ ఇస్తుంది.

MOST READ:భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

Most Read Articles

English summary
bajaj increases avenger street 160 price details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X