Just In
Don't Miss
- Movies
పూరి తనయుడి రొమాంటిక్ సినిమా ఆగిపోలేదు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేశారు
- News
IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?
- Finance
ఏప్రిల్ 1 నుండి రూ.1 కోటి ప్రమాద బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ప్రయోజనాలెన్నో
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బజాజ్ ప్లాటినా 100 డిస్క్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు
బజాజ్ ప్లాటినాలో ఓ కొత్త వేరియంట్ సైలంట్‌గా మార్కెట్లోకి రానున్నట్లు మేము నిన్నటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. నేడు బజాజ్ ఆటో తమ పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ బజాజ్ ప్లాటినాలో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ మోడల్ ధర రూ.59,373 ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. కొత్తగా విడుదల చేసిన ఈ ప్లాటినా మోడల్ లైనప్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్‌గా ఉంటుంది.

కొత్తగా ప్రారంభించిన బజాజ్ ప్లాటినా డిస్క్ వేరియంట్‌తో పాటుగా ఈ మోడల్ ప్లాటినా కెఎస్ మరియు ప్లాటినా ఇఎస్ అనే రెండు ఇతర వేరియంట్లలో కూడా లభిస్తుంది. కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.49,261 గా ఉంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.55,546 గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ కొత్త బిఎస్6 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌లో మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే సరికొత్త ఇంజన్‌తో పాటుగా మరిన్ని అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో 102 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఇ-కార్బురేటెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 7.77 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.34 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫోర్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
MOST READ: అందుబాటులోకి రానున్న టెస్లా స్మాల్ షార్ట్స్ ; చూసారా ?

అప్‌డేట్ చేసిన ఇంజన్‌తో పాటు, కొత్త బజాజ్ ప్లాటినా 100 బిఎస్6 డిస్క్ వేరియంట్ మునుపటి మోడల్ మాదిరి కాకుండా ఇందులో కొన్ని డిజైన్ ట్వీక్స్ ఉన్నాయి. ఇది బిఎస్4 మోడల్‌లో కలర్ మ్యాచ్డ్ కౌల్‌తో పోలిస్తే కొత్త లేతరంగు విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లైట్లను హెడ్‌ల్యాంప్‌కు దగ్గరగా అమర్చబడి ఉంటాయి. ఈ మార్పులతో కొత్త ప్లాటినా మరింత క్లియర్ ఫ్రంట్ డిజైన్ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈ మార్పులతో పాటుగా కొత్త ప్లాటినా 100 బిఎస్6 మోటార్‌సైకిల్‌లో ఈ బ్రాండ్‌లోని హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ అయిన ప్లాటినా 110 హెచ్-గేర్ నుండి గ్రహించిన కొత్త రిబ్బెడ్ ప్యాటర్న్ సీటును ఉపయోగించారు. ఇందులో అప్‌డేట్ చేసిన సస్పెన్షన్ సెటప్ కూడా ఉంటుంది. ఈ సస్పెన్షన్ ముందు వైపు భాగంలో 28 శాతం అధిక ట్రావెల్ మరియు వెనుక వైపు 22 శాతం అధిక ట్రావెల్‌ను కలిగి ఉంటుంది.
MOST READ: పొగమంచులో డ్రైవింగ్ చేయడానికి కొత్త టెక్నాలజీ, ఏంటో తెలుసా ?

మోటారుసైకిల్‌లోని ఇతర సైకిల్ భాగాలలో 135 మిమీ ట్రావెల్‌తో ముందు భాగంలో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు 110 మి.మీ. ట్రావెల్‌తో వెనుక వైపున బ్రాండ్ యొక్క ‘ఎస్ఎన్ఎస్' సస్పెన్షన్ ఉన్నాయి. మోటారుసైకిల్‌పై బ్రేకింగ్ డ్యూటీలను ముందు భాగంలో డిస్క్ / డ్రమ్ బ్రేక్‌ల ద్వారా జరుగుతుంది మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. అదనపు భద్రత కోసం ఇందులో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌ను జోడించారు.

ప్లాటినా 100 మోటార్‌సైకిల్ ఈ సెగ్మెంట్లో కెల్లా అద్భుతమైన మైలేజీని ఆఫర్ చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ మోటారుసైకిల్ లీటరుకు 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మోటారుసైకిల్‌లో 11 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్‌తో 990 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.
MOST READ: గోరఖ్‌పూర్ పోలీస్ శాఖకు 100 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్, ఎందుకో తెలుసా ?

బజాజ్ ప్లాటినా 100 డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బజాజ్ ప్లాటినా 100 భారత టూవీలర్ మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్. బిఎస్6 అప్‌డేట్ కారణంగా ఈ మోడల్ ధర భారీగా పెరిగింది. అయినప్పటికీ, ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న అత్యంత సరసమైన మోటారుసైకిళ్లలో ఒకటిగా ఉంటుంది.