బజాజ్ ప్లాటినాలో సైలెంట్‌గా కొత్త వేరియంట్ విడుదల చేస్తారా!?
బజాజ్ ఆటో నుండి అత్యధికంగా అమ్ముడుపోతున్న కమ్యూటర్ మోటార్‌సైకిల్ బజాజ్ ప్లాటినాలో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బజాజ్ ప్లాటినా 100 డిస్క్ బ్రేక్ పేరిట కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ఇందుకు సంబంధించి బజాజ్ బ్రాండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ మోటారుసైకిల్ త్వరలో లాంచ్ అవుతుందని పరిశ్రమ వర్గాల సమాచారం. దీని ధర రూ.59,373 ఉండొచ్చని అంచనా.

ఈ మోడల్ ప్రస్తుతం బజాజ్ ప్లాటినా కెఎస్ మరియు ప్లాటినా ఇఎస్ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లలో లభిస్తుంది. కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.49,261 గా ఉంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.55,546 గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

బజాజ్ ప్లాటినా మోడళ్లలో 102 సిసి బిఎస్6 కంప్లైంట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.7 బిహెచ్‌పి శక్తిని మరియు 8.34 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఒకవేళ బజాజ్ డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను విడుదల చేస్తే అది కొత్త ప్లాటినా 100 ఇఎస్ డిస్క్ బ్రేక్ మోడల్‌గా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం లభిస్తున్న ప్లాటినా ఇఎస్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ కన్నా రూ.3,827 అధిక ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్లాటినా కెఎస్ వేరియంట్‌తో పోల్చుకుంటే దీని ధర రూ.10,112 ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా రానున్న ప్లాటినా డిస్క్ బ్రేక్ వేరియంట్ మోటారుసైకిల్ బజాజ్ ప్లాటినా శ్రేణి మోటార్‌సైకిళ్ళలో టాప్-ఆఫ్-ది-లైన్ ట్రిమ్‌గా ఆఫర్ చేయబడనుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బజాజ్ ప్లాటినా ఇఎస్ డిస్క్ బ్రేక్ మోడల్, ప్లాటినా 110 హెచ్-గేర్ కంటే రూ.3,526 తక్కువకు లభిస్తుంది. బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ రెగ్యులర్ వేరియంట్ల కన్నా మరింత శక్తివంతమైన, 115.5 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది, ఇది 8.3 బిహెచ్‌పి శక్తిని మరియు 9.81 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రూ.62,899 ఎక్స్-షోరూమ్ ధరతో లభ్యమయ్యే బజాజ్ ప్లాటినా హెచ్-గేర్ మోడల్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ముందు భాగంలో డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ప్లాటినా ఇఎస్ డిస్క్ బ్రేక్ మోడల్ కంటే మరింత ఆకర్షణీయమైన మోడల్.

బజాజ్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, బజాజ్ ప్లాంట్‌లో సుమారు 250 మంది ఉద్యోగులకు కోవిడ్-19 పాజిటివ్ రావటంతో వాజుల్ ఉత్పత్తి కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాలని బజాజ్వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.

అయితే కంపెనీ మాత్రం వారు ‘వైరస్‌తో జీవించడం' లక్ష్యంగా పెట్టుకున్నారని, ఉత్పత్తిని నిలిపివేయలేమని పేర్కొంది. ఉద్యోగానికి రాని వారికి వేతనం కూడా లభించదని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.

బజాజ్ ప్లాటినా 100 డిస్క్ బ్రేక్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఈ వేరియంట్ విడుదల గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, బహుశా ఇది ఎంట్రీ లెవల్ మోడల్ కావటంతో ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ బ్రాండ్ ఇప్పటికే మరింత శక్తివంతమైన ప్లాటినా మోడల్‌ను అందిస్తుంది, ఇది డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి ప్లాటినా 100 ఇఎస్ డిస్క్ బ్రేక్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం.


Click it and Unblock the Notifications








