బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన బజాజ్ ప్లాటినా 100 డిస్క్ బ్రేక్ వేరియంట్ ఈఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్) మోడల్ డెలివరీలను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో టాప్-ఆఫ్-ది లైన్ వేరియంట్‌గా వచ్చిన ఈ కొత్త మోడల్ ధర రూ.60,698 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

కొత్త బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ మోటారుసైకిల్ దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ డీలర్‌షిప్‌లకు చేరుకుంటోంది. గణేష్ బజాజ్ పోస్ట్ చేసిన చిత్రాల ప్రకారం, ఈ మోడల్ ఇప్పటికే కస్టమర్లకు డెలివరీ కూడా చేయబడుతోంది. ఈ కొత్త వేరియంట్ రెడ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

బజాజ్ ప్లాటినా డిస్క్ వేరియంట్‌తో పాటుగా ఈ మోడల్‌లో ప్లాటినా కెఎస్ మరియు ప్లాటినా ఈఎస్ అనే రెండు ఇతర వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో డ్రమ్ బ్రేక్ కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.50,464గా ఉంటే డ్రమ్ బ్రేక్, ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.58,477గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:గుడ్ న్యూస్.. ఆగస్టు 22 న ప్రారంభం కానున్న టయోటా అర్బన్ క్రూయిజర్

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

ఈ కొత్త బిఎస్6 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌లో మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే సరికొత్త ఇంజన్‌తో పాటుగా మరిన్ని అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో 102 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఈ-కార్బురేటెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 7.77 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.34 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫోర్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ల్యాండ్ రోవర్ ని కాపాడిన మహీంద్రా థార్, ఎలాగో వీడియో చూడండి

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

అప్‌డేట్ చేసిన ఇంజన్‌తో పాటు, కొత్త బజాజ్ ప్లాటినా 100 బిఎస్6 డిస్క్ వేరియంట్ మునుపటి మోడల్ మాదిరి కాకుండా ఇందులో కొన్ని డిజైన్ ట్వీక్స్ ఉన్నాయి. ఇది బిఎస్4 మోడల్‌లో కలర్ మ్యాచ్డ్ కౌల్‌తో పోలిస్తే కొత్త లేతరంగు విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లైట్లను హెడ్‌ల్యాంప్‌కు దగ్గరగా అమర్చబడి ఉంటాయి. ఈ మార్పులతో కొత్త ప్లాటినా మరింత క్లియర్ ఫ్రంట్ డిజైన్ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

ఈ మార్పులతో పాటుగా కొత్త ప్లాటినా 100 బిఎస్6 మోటార్‌సైకిల్‌లో ఈ బ్రాండ్‌లోని హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ అయిన ప్లాటినా 110 హెచ్-గేర్ నుండి గ్రహించిన కొత్త రిబ్బెడ్ ప్యాటర్న్ సీటును ఉపయోగించారు. ఇందులో అప్‌డేట్ చేసిన సస్పెన్షన్ సెటప్‌ కూడా ఉంటుంది. ఈ సస్పెన్షన్ ముందు వైపు భాగంలో 28 శాతం అధిక ట్రావెల్ మరియు వెనుక వైపు 22 శాతం అధిక ట్రావెల్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:కారులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లండి

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

మోటార్‌సైకిల్‌‌లోని ఇతర సైకిల్ భాగాలలో 135 మిమీ ట్రావెల్‌తో ముందు భాగంలో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు 110 మి.మీ. ట్రావెల్‌తో వెనుక వైపున బ్రాండ్ యొక్క ‘ఎస్ఎన్ఎస్' సస్పెన్షన్ ఉన్నాయి. మోటార్‌సైకిల్‌‌పై బ్రేకింగ్ డ్యూటీలను ముందు భాగంలో డిస్క్ / డ్రమ్ బ్రేక్‌ల ద్వారా జరుగుతుంది మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. అదనపు భద్రత కోసం ఇందులో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌ను జోడించారు.

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

ప్లాటినా 100 మోటార్‌సైకిల్ ఈ సెగ్మెంట్లో కెల్లా అద్భుతమైన మైలేజీని ఆఫర్ చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ మోటార్‌సైకిల్‌ లీటరుకు 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మోటార్‌సైకిల్‌‌లో 11 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్‌తో 990 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ:పవిత్రమైన కాబాపై విమానాలు ప్రయాణించవు, ఎందుకో తెలుసా ?

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ డెలివరీల ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బజాజ్ ప్లాటినా 100 భారత టూవీలర్ మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్. తక్కువ రన్నింగ్ కాస్ట్ మరియు తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్‌లతో ఇది ఈ విభాగంలోనే అత్యంత సరసమైన మోడల్‌గా నిలుస్తుంది. మోటార్‌సైకిల్‌పై ఎక్కువ దూరం ప్రయాణించే వారు, మైలేజ్ విషయాన్ని పరిగణలోకి తీసుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

Image Courtesy: Ganesh Bajaj

Most Read Articles

English summary
Bajaj Auto Limited recently launched the new Platina 100 disc brake with (ES) Electric Start in the Indian market. The new top-of-the-line variant of the commuter motorcycle retails at Rs 60,698, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X