భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన బజాజ్ ఆటో తన లైనప్‌లో మరికొన్ని మోడళ్ల ధరలను పెంచినట్లు ప్రకటించింది. ఈసారి ప్లాటినా 100 మరియు 110 బిఎస్ 6 మోడళ్లకు ధరలను పెంచడం జరిగింది. ఈ రెండు మోటార్‌సైకిళ్లకు వరుసగా రూ. 1,498, రూ. 2,349 ధరల పెరుగుదల లభించింది.

భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా

ధరల పెరుగుదల తరువాత, బజాజ్ ప్లాటినా 100 రిటైల్ ధర రూ. 49,261 కాగా, ప్లాటినా 110 ధర 62,899 రూపాయల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.ఈ రెండు మోటార్ సైకిళ్ళు ఒకే వేరియంట్లో మాత్రమే లభిస్తాయి. ఈ రెండు మోటార్ సైకిల్స్ కూడా బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ప్లాటినా 100 మునుపటికంటే కొంత ఎక్కువ నవీనీకరణలను అందుకుంది. కానీ 110 ఇంజిన్ నవీనీకరణ ఇంజిన్ లో మాత్రమే చేయబడింది. ఈ మోటార్ సైకిల్ లో మిగతా ఎటువంటి మార్పు జరగలేదు.

భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా

ప్లాటినా 100 ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఇ-కార్బురేటెడ్ 102 సిసి ఇంజిన్‌ ఉంటుంది. ఇది 7.5 బిహెచ్‌పి శక్తిని మరియు 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:3 కోట్ల విలువైన కార్లు దొంగలించిన దొంగల ముఠా, తర్వాత ఏం జరిగించే తెలుసా ?

భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా

ఈ మోటార్ సైకిల్ లో బిఎస్ 4 మోడల్ కౌల్‌తో పోలిస్తే కొత్త లేతరంగు విండ్‌స్క్రీన్ కలిగి ఉంటుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్,‌ రిబ్బెడ్-నమూనా సీటును కలిగి ఉంది మరియు మెరుగైన సస్పెన్షన్ సెటప్‌ కూడా కలిగి ఉంటుంది.

భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా

ఇవి మాత్రమే కాకుండా 100 సిసి మోటారుసైకిల్ తన బిఎస్ 4 మోటార్ సైకిల్ లో ఉన్న అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో బ్రాండ్ యొక్క ‘ఎస్ఎన్ఎస్' ట్విన్-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. మోటారుసైకిల్‌పై యాంకరింగ్ ముందు భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్‌, వెనుకవైపు 110 మిమీ డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. ఇవి వాహనదారునికి అధిక భద్రతను కల్పిస్తాయి.

MOST READ:భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా

బిఎస్ 6 ప్లాటినా 110 మోటారుసైకిల్ అదే 115.45 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 8 బిహెచ్‌పి శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది.

భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా

బిఎస్ 6 ప్లాటినా 110 మోటారుసైకిల్ లో అప్‌డేట్ చేసిన ఇంజిన్ బిఎస్ 4 కంప్లైంట్ కంటే మెరుగైన మైలేజ్ మరియు పనితీరును అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్లాటినా 110 హెచ్-గేర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్-స్ప్రింగ్ సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 240 మిమీ డిస్క్ మరియు వెనుక వైపున 110 మిమీ డ్రమ్ బ్రేక్ ద్వారా బ్రేకింగ్ నిర్వహించబడుతుంది.

MOST READ:హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా

డ్రైవ్‌స్పార్క్ తెలుగుఅభిప్రాయం :

బజాజ్ ప్లాటినా 100 మరియు ప్లాటినా 110 హెచ్-గేర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్లలో ఒకటిగా ఉన్నాయి. ఈ రెండు బజాజ్ మోటారు సైకిళ్ళు సరళమైన రూపకల్పనను కలిగి ఉంటాయి. అంతే కాకుండా అతి తక్కువ నిర్వహణకు ఇది ప్రసిద్ధి చెందింది. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది. ఇవి మునుపటికంటే కూడా ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తాయి.

Most Read Articles

English summary
Bajaj Platina 100 & 110 BS6 Price Increase Announced: Here Is The New Price List. Read in Telugu.
Story first published: Thursday, June 11, 2020, 14:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more