ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 మోటార్ సైకిల్స్ ప్రారంభించిన బజాజ్!

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన సంస్థలలో బజాజ్ ఆటో ఒకటి. బజాజ్ ఆటో ఇప్పటికే చాలా మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు బజాజ్ బిఎస్ 6 మోడల్ మోటార్ సైకిల్స్ ప్రారంభించింది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 మోటార్ సైకిల్స్ ప్రారంభించిన బజాజ్!

బజాజ్ ఇప్పుడు రెండు కొత్త బిఎస్ 6 మోడల్ మోటార్ సైకిల్స్ ని ప్రారంభించింది. అవి బిఎస్-6 బజాజ్ సిటి మరియు బిఎస్ 6 ప్లాటినా. ఇండియన్ మార్కెట్లో వీటి ధరలను గమనించినట్లయితే బజాజ్ సిటి ధర రూ. 40,794, మరియు బజాజ్ ప్లాటినా ధర రూ. 47,264 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇవి బజాజ్ యొక్క కంప్లైంట్ బిఎస్ 6 మోడల్స్.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 మోటార్ సైకిల్స్ ప్రారంభించిన బజాజ్!

బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే మాట్లాడుతూ ఈ మోటార్ సైకిల్స్ ప్రారంభంతోనే మిగిలిన ఉత్పత్తి శ్రేణి కూడా బిఎస్ 6 వెర్షన్ లో రావడానికి దారి తీస్తుంది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 మోటార్ సైకిల్స్ ప్రారంభించిన బజాజ్!

బజాజ్ సిటి మరియు బజాజ్ ప్లాటినా పరిచయంతో ప్రపంచ స్థాయిలో ఆర్ అండ్ డి బృందం మా ఉత్పత్తుల యొక్క సామర్థ్యాలను మెరుగుపరచింది. అదే విధంగా ఈ మోటార్ సైకిల్స్ బిఎస్ 6 ఉద్గార నిబంధనలను పాటించే విధంగా తయారు చేసాము. ఈ వాహనాల వల్ల వినియోగదారుడు తన డబ్బుకి అద్భుతమైన విలువను పొందుతారు, అని వెల్లడించారు.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 మోటార్ సైకిల్స్ ప్రారంభించిన బజాజ్!

బజాజ్ సిటి మరియు ప్లాటినా రెండు కూడా ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజక్షన్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఇది వాహనాన్ని సజావుగా నడపడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు మోటార్ సైకిల్స్ కంపెనీ యొక్క అత్యాధునిక పరిశోధన వల్ల అద్భుతమైన రూపకల్పన చేయబడ్డాయి.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 మోటార్ సైకిల్స్ ప్రారంభించిన బజాజ్!

బిఎస్ 6 బజాజ్ మోటార్ సైకిల్స్ రెండు ఇంజిన్ ఆప్సన్లతో లభిస్తాయి. అవి 100 సిసి మరియు 110 సిసి ఇంజిన్లు. బజాజ్ బిఎస్ 6 మోటార్ సైకిల్స్ యొక్క ధరలు రూ. 40,794 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. ఇది దేశంలోనే అతి తక్కువ ధర కలిగిన బిఎస్ 6 కమ్యూటర్ మోటార్ సైకిల్స్.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 మోటార్ సైకిల్స్ ప్రారంభించిన బజాజ్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

బిఎస్ 6 బజాజ్ సిటి మరియు బజాజ్ ప్లాటినా ఇండియన్ మార్కెట్లో ప్రారంభించబడ్డాయి. ఈ మోటార్ సైకిల్స్ ప్రారంభించడం వల్ల బజాజ్ ఆటో కూడా బిఎస్ 6 వెర్షన్ వెహికల్స్ ప్రారంభించడం మొదలుపెట్టిందని తెలుస్తుంది. బజాజ్ కంపెనీ మినిమమ్ ప్రీమియంను కలిగి ఉంది. ఇది దేశంలోనే అతి చౌకైన బిఎస్-6 వెర్షన్ మోటార్ సైకిల్స్ ని అందించగలిగింది.

Most Read Articles

English summary
Bajaj CT100 And Platina BS6 Models Launched In India At Rs 40,794: Specs & Features. Read in Telugu.
Story first published: Tuesday, January 28, 2020, 17:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X