బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 110 హెచ్ గేర్ : ధర & ఇతర వివరాలు
బజాజ్ ఆటో తన బ్రాండ్ అయిన ప్లాటినా హెచ్ గేర్ 110 బిఎస్ 6 మోటార్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బజాజ్ ప్లాటినా హెచ్ గేర్ బిఎస్ 6 బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లో రూ. 59,802 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) ధరతో అందించబడుతుంది.

బిఎస్ 6 బజాజ్ ప్లాటినా హెచ్ గేర్ 110 ను ఒకే వేరియంట్‌లో అందిస్తున్నారు.ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది. బజాజ్ ప్లాటినా హెచ్ గేర్ బిఎస్ 6 ఇప్పుడు అదే 115.45 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌తో శక్తిని పొందుతోంది.

ఈ కొత్త మోటార్ సైకిల్స్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఐదు స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ప్లాటినా హెచ్ గేర్ బిఎస్ 6 లోని ఇంజిన్ ఇప్పుడు ఫ్యూయెల్ఇం జెక్షన్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది మునుపటి మోడల్‌తో పోలిస్తే మెరుగైన అప్డేట్స్ మరియు మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది.

vఈ కొత్త బిఎస్ 6 బైక్ లో అప్డేట్ చేయబడిన ఒకా ఇంజిన్ కాకుండా, మోటారుసైకిల్ యొక్క ఇతర అంశాలు దాదాపు మునుపటి మోడల్ లాగానే ఉంటుంది.
బజాజ్ ప్లాటినా హెచ్ గేర్ 110 యొక్క కొలతలను గమనించినట్లయితే దీని పొడవు 2006 మిమీ, 713 మిమీ వెడల్పు మరియు 1100 మీ ఎత్తు ఉంటుంది. ఈ మోటారుసైకిల్ యొక్క బరువు కేవలం 122 కిలోలు ఉంటుంది. మరియు సీటు మాత్రం 804 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది.

బిఎస్ 6 బజాజ్ ప్లాటినా హెచ్ గేర్ 110 దాని మునుపటి బిఎస్ 4 లోని ఫీచర్స్ తో ముందుకు తీసుకువెళుతుంది. ఇందులో ఒకే బాడీ గ్రాఫిక్స్, బ్లాక్-అవుట్ ఇంజిన్ మరియు ఎగ్జాస్ట్, లాంగ్ ఫ్రంట్ మరియు రియర్ ఫెండర్లు, అల్లాయ్ వీల్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లతో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయి.

ఈ కొత్త బిఎస్ 6 మోటారుసైకిల్ సింగిల్-పీస్ కంపర్టబుల్ సీటుతో పాటు 11-లీటర్ ఇంధన ట్యాంకుతో వస్తుంది. కొత్త బజాజ్ ప్లాటినా హెచ్ గేర్ 110 బిఎస్ 6 అదే రెండు కలర్ స్కీమ్‌లలో కూడా అందిస్తోంది. అవి రెడ్ మరియు బ్లాక్ కలర్ వేరియంట్స్.

బజాజ్ ప్లాటినా హెచ్ గేర్ బిఎస్ 6 లోని సస్పెన్షన్ సెటప్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్ సెటప్‌ను ఉపయోగిస్తోంది. ముందు భాగంలో 240 ఎంఎం డిస్క్ మరియు వెనుకవైపు 110 ఎంఎం డ్రమ్ బ్రేక్ ద్వారా బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది.


Click it and Unblock the Notifications








