బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 నియాన్ : ధర & ఇతర వివరాలు

బజాజ్ ఆటో బిఎస్ 6 కంప్లైంట్ పల్సర్ 125 మోటార్ సైకిల్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బజాజ్ పల్సర్ 125 బిఎస్ 6 ధర ఇండియన్ మార్కెట్లో రూ. 69.997 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త పల్సర్ ఎంట్రీ లెవల్ మోటారుసైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ మరియు రెండవది డిస్క్ వేరియంట్లు.

బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 నియాన్ : ధర & ఇతర వివరాలు

పల్సర్ 125 యొక్క ‘డ్రమ్' వేరియంట్ ధరలో దాదాపు 6,300 రూపాయల పెరుగుదల కనిపిస్తుంది. అదే విధంగా ‘డిస్క్' వేరియంట్ 7500 రూపాయల అధిక ధరతో అందించబడుతుంది. అంటే దీని ధర దాదాపు 74,118 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రూపాయలు.

బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 నియాన్ : ధర & ఇతర వివరాలు

బజాజ్ పల్సర్ 125 నియాన్ అదే 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది ఇప్పుడు బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడింది. ఇది మునుపటి బిఎస్ 4 వెర్షన్‌కు సమానమైన 12 బిహెచ్‌పి మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

MOST READ: చివరి కోరిక ప్రకారం బెంజ్ కారులో ఖననం చేసిన రాజకీయనాయకుని మృతదేహం, ఎక్కడో తెలుసా..?

బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 నియాన్ : ధర & ఇతర వివరాలు

ఈ కొత్త బజాజ్ మోటార్ సైకిల్ బిఎస్ 6 అప్‌డేట్ కాకుండా మరే ఇతర మార్పులేవి జరగలేదు. ఇది చూడటానికి మునుపటిలాగే ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ బరువు బరువు 140 కే.జీ ల వరకు ఉంటుంది.

బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 నియాన్ : ధర & ఇతర వివరాలు

బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 మళ్ళీ అదే స్టైలింగ్‌తో ముందుకు వెళ్తుంది. ఇందులో వెనుక కౌల్‌పై 3 డి వేరియంట్ లోగో, నియాన్ స్ట్రీక్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు నియాన్‌లో ‘పల్సర్' లోగో వంటివి ఉంటాయి. కొత్త (2020) బజాజ్ పల్సర్ 125 నియాన్ బిఎస్ 6 కలర్స్ తో అందించబడుతుంది. ఇందులో నియాన్ బ్లూ, సోలార్ రెడ్ మరియు ప్లాటినం సిల్వర్ ఉన్నాయి.

MOST READ: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 నియాన్ : ధర & ఇతర వివరాలు

బజాజ్ కంపెనీ ఇటీవలే బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన ఉత్పత్తులన్నింటినీ అప్‌డేట్ చేస్తోంది. బజాజ్ పల్సర్ 125 నవీకరించబడిన చివరి మోడళ్లలో ఒకటి, డామినార్ 400, పల్సర్ ఎన్ఎస్ 200, పల్సర్ 220 ఎఫ్, ఆర్ఎస్ 200 మరియు 150 క్లాసిక్ వంటి మోటార్ సైకిల్స్ ఇప్పటికే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించబడ్డాయి.

బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 నియాన్ : ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం..!

బజాజ్ పల్సర్ 125 మోటార్ సైకిల్ ఎంట్రీ లెవల్ మోడల్, ఇందులో 200 సిసి సెగ్మెంట్ మోటార్ సైకిళ్ళు కూడా ఉంటాయి. భారతదేశంలో బజాజ్ పల్సర్ 125, కెటిఎమ్ డ్యూక్ మరియు ఆర్‌సి 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ: హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే..?

Most Read Articles

English summary
BS6 Bajaj Pulsar 125 Neon Launched In India: Prices Start At Rs 69,997
Story first published: Thursday, April 16, 2020, 19:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X