త్వరలో విడుదల కానున్న బిఎస్ 6 పల్సర్ 180 ఎఫ్, 220 ఎఫ్ బైక్‌లు
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో బజాజ్ ఆటో ఒకటి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో బజాజ్ బిఎస్-6 పల్సర్ 220 ఎఫ్, పల్సర్ 180 ఎఫ్ మోడళ్ల యొక్క స్పెసిఫికేషన్‌ను వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

పూణేకు చెందిన బజాజ్ ఆటో బిఎస్ 6 పల్సర్ 220 ఎఫ్, పల్సర్ 180 ఎఫ్ మోడళ్ల స్పెసిఫికేషన్‌ను వెల్లడించింది. కొత్త బిఎస్ 6 కంప్లైంట్ మోటారు సైకిళ్ళు 220 ఎఫ్ మోడల్లో శక్తి మరియు పనితీరు గణాంకాలలో స్వల్ప మార్పుతో నవీనీకరించడం జరిగింది. కానీ బజాజ్ 180 ఎఫ్ మోడల్‌కు అటువంటి నవీనీకరణలు జరగలేదు.

బజాజ్ పల్సర్ 180 ఎఫ్‌లో బిఎస్ 6 కంప్లైంట్ 178.66 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 17 బిహెచ్‌పి పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తిని కొనసాగిస్తోంది. ఇంజిన్ 5- స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

బిఎస్-6 పల్సర్ 180 ఎఫ్ మోడల్‌కు బజాజ్ తెచ్చిన ఒక చిన్న మార్పు ఏమిటంటే ఇందులో ఉన్న వీల్‌బేస్ పొడవులో 5 మిమీ పెంచింది.

బజాజ్ పల్సర్ 220 ఎఫ్ మోటార్ సైకిల్లో బిఎస్ 6 కంప్లైంట్ 220 సిసి ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ని కలిగి ఉంటుంది. ఇది ఇప్పుడు అవుట్గోయింగ్ బిఎస్ 4 కంప్లైంట్ మోడల్స్ ఉత్పత్తి చేసిన 21 బిహెచ్‌పి శక్తితో పోలిస్తే 20.39 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

టార్క్ విలువలు 18.55 ఎన్ఎమ్ మాత్రం అలాగే ఉంటుంది. కొత్త బిఎస్ 6 కంప్లైంట్ 220 ఎఫ్ వెహికల్ లో ఇంజన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. పల్సర్ 220 ఎఫ్ మోటార్‌సైకిల్‌లో ఇతర మార్పులు ఏమి జరగలేదు.

కొత్త బిఎస్-6 బజాజ్ పల్సర్ 180 ఎఫ్ ధర ఇప్పుడు రూ. 1.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది బిఎస్-4 మోడల్ కంటే రూ. 11,437 ఎక్కువ ఉంటుంది. మరియు బిఎస్ 6 కంప్లైంట్ బజాజ్ పల్సర్ 220 ఎఫ్ మోడల్ ధర రూ. 1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది కూడా మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

బజాజ్ కి సంబంధిత వారతలా ప్రకారం కంపెనీ ఇటీవల తన బిఎస్ 6 కంప్లైంట్ ఎన్ఎస్ 200 మోడల్‌ను రూ. 1.24 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఇండియాలో విడుదల చేసింది. ప్రస్తుతం రూ. 5 వేలకు బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

మోటారుసైకిల్ బిఎస్ 6 కంప్లైంట్ చేయడానికి బజాజ్ కొత్త ఇంధన-ఇంజెక్షన్ వ్యవస్థను మరియు కొత్త క్యాటలిటిక్ కన్వర్టర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మోటారుసైకిల్ ఇప్పటికీ అదే 199.5 సిసి లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. కానీ శక్తి మరియు పనితీరు గణాంకాలు ప్రస్తుతానికి తెలియవు.


Click it and Unblock the Notifications








