ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో విక్రయిస్తున్న పాపులర్ మోటార్‌సైకిల్ బ్రాండ్ పల్సర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. బజాజ్ తమ పల్సర్ బ్రాండ్‌ను తొలిసారిగా 2001లో 150సీసీ ఇంజన్‌తో ప్రవేశపెట్టింది.

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

ఆ సమయంలో బజాజ్ ఆటో తమ పల్సర్ బ్రాండ్‌తో ఓ కొత్త స్పోర్ట్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగాన్ని ప్రారంభించడానికి నాంది వేసింది. ప్రారంభ సమయంలో ఈ బ్రాండ్ కేవలం ఒకే వేరియంట్ మరియు ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమయ్యేది. అయితే, ఇప్పుడు పల్సర్ బ్రాండ్‌లో 125సీసీ మొదలుకొని 220సీసీ వరకూ వివిధ రకాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

ప్రస్తుతం దేశంలో ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో పల్సర్ ఒకటిగా ఉంది. భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ దేశీయ అమ్మకాలతో పాటుగా అంతర్జాతీయ ఎగుమతులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. గడచిన నవంబర్ నెలలో పల్సర్ దేశీయ అమ్మకాలు 53.66 శాతం వృద్ధి చెందగా, ఎగుమతులు 28.64 శాతం వృద్ధి చెందాయి.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

బజాజ్ పల్సర్‌లో ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా ఓ 125సీసీ ఇంజన్ కలిగిన వెర్షన్‌ను కంపెనీ గత సంవత్సరం మార్కెట్లో విడుదల చేసింది. ఐకానిక్ పల్సర్ బ్రాండ్ ఇమేజ్ మరియు ఆకర్షణీయమైన ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ బేస్ వేరియంట్ పల్సర్ 125 దాని సాటిలేని పనితీరు మరియు మెరుగైన మైలేజీతో కస్టమర్లను ఆకర్షిస్తోంది.

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

నవంబర్ 2020 నెలలో పల్సర్ 125సీసీ వేరియంట్ అమ్మకాలు అత్యధికంగా 56,549 యూనిట్లుగా నమోదయ్యాయి. నవంబర్ 2019లో దీని సంఖ్య కేవలం 20,193 యూనిట్లుగా మాత్రమే నమోదైంది. అప్పటితో పోల్చుకుంటే గడచిన నెలలో ఈ వేరియంట్ గరిష్టంగా 180 శాతం వృద్ధిని సాధించింది.

MOST READ:370 కి.మీ. కేవలం 4 గంటల్లో చేరుకున్న అంబులెన్స్ డ్రైవర్.. ఎందుకో తెలుసా ?

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

ఇక 150సీసీ విభాగంలో లభిస్తున్న బజాజ్ పల్సర్ 150 విషయానికి వస్తే, 125సీసీ వేరియంట్ రాకతో ఈ 150సీసీ వేరియంట్ అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నవంబర్ 2020 నెలలో మొత్తం 30,719 యూనిట్ల పల్సర్ 150 మోడళ్లు అమ్ముడుపోగా అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో వీటి సంఖ్య 33,933గా ఉండి 9 శాతం క్షీణతను నమోదు చేశాయి.

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

అలాగే, పల్సర్ 160, పల్సర్ 180 మరియు పల్సర్ 200 మోడళ్ల అమ్మకాలు అన్నీ కలిపి 10,522 యూనిట్లుగా నమోదై 24 శాతం వృద్ధిని సాధించాయి. ఇకపోతే, ఈ బ్రాండ్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ అమ్మకాలు గడచిన నవంబర్ నెలలో 7114 యూనిట్లుగా నమోదై 26 శాతం వృద్ధిని సాధించాయి.

MOST READ:ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

మొత్తంగా చూసుకుంటే, నవంబర్ 2020లో భారత మార్కెట్లో అన్ని రకాల ఇంజన్ ఆప్షన్లతో కూడిన పల్సర్ బ్రాండ్ అమ్మకాలు 1,04,904 యూనిట్లుగా నమోదై నవంబర్ 2019తో (68,268 యూనిట్లతో) పోలిస్తే 53.66 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

ఎగుమతుల విషయానికి వస్తే, బజాజ్ పల్సర్ 160, 180, 200 మోడళ్లకు అంతర్జాతీయ మార్కెట్ల నుండి మంచి డిమాండ్ లభించింది. గత నవంబర్‌లో కంపెనీ ఈ మూడు బ్రాండ్లను కలిపి 14,198 యూనిట్లను ఎగుమతి చేసింది. నవంబర్ 2019లో వీటి సంఖ్య 9,551 యూనిట్లుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఇవి 48 శాతం వృద్ధిని సాధించాయి.

MOST READ:భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

కాగా, పల్సర్ 150 ఎగుమతులు 11,112 యూనిట్లుగా నమోదై 22 శాతం వృద్ధిని సాధించగా, పల్సర్ 125 ఎగుమతులు 5,820 యూనిట్లుగా నమోదై 139 శాతం వృద్ధిని సాధించాయి. ఇకపోతే, బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ పల్సర్ 220ఎఫ్ ఎగుమతులు కేవలం 1,410 యూనిట్లుగా నమోదై 66 శాతం క్షీణతను నమోదు చేశాయి.

ఈస్ట్ ఆర్ వెస్ట్, పల్సర్ ఈజ్ బెస్ట్ : రికార్డు స్థాయిలో పల్సర్ సేల్స్

మొత్తంగా చూసుకుంటే, నవంబర్ 2020లో అన్ని బ్రాండ్ల పల్సర్ ఎగుమతులు 32,540 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) మొత్తం పల్సర్ ఎగుమతులు 25,296 యూనిట్లుగా నమోదయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే పల్సర్ ఎగుమతులు 28.64 శాతం వృద్ధి చెందాయి.

Most Read Articles

English summary
Bajaj Pulsar Domestic Sales And Exports Registered Record High In November 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X