18 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్. ఇప్పుడు విపణిలోకి ప్రవేశపెట్టనున్న బిఎస్ 6 వాహనాలు ఏవంటే..?

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటారుసైకిల్ శ్రేణిలో పల్సర్ ఇప్పుడే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశంలో అత్యధిక ప్రజాధారణ పొందిన సంస్థలలో బజాజ్ ఒకటి. అత్యధికంగా మోటార్ సైకిల్స్ అమ్మిన ఘనత కూడా బజాజ్ సంస్థకే దక్కుతుంది. ప్రస్తుతం బజాజ్ 18వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్బంగా మార్కెట్లోకి మరో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఈ వాహనం గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!

18 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్. ఇప్పుడు విపణిలోకి ప్రవేశపెట్టనున్న బిఎస్ 6 వాహనాలు ఏవంటే...?

18 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్ టీవీసీ వీడియోను విడుదల చేసింది. ఈ వార్షికోత్సవాన్ని జరువుకున్న సందర్బంగా ఈ నెలలో బిఎస్-6 మోటార్ సైకిల్స్ ని కూడా విడుదల చేయడానికి సిద్ధమౌతోంది. ఈ విధంగా విడుదల చేయబోయే వాటిలో మొదతి ద్విచక్ర వాహనం పల్సర్ ఎన్‌ఎస్ 200 అని భావిస్తున్నారు.

18 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్. ఇప్పుడు విపణిలోకి ప్రవేశపెట్టనున్న బిఎస్ 6 వాహనాలు ఏవంటే...?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 అనేది 200 సిసి విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటారు సైకిళ్ళలో ఒకటి. వీటికి దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఉన్నారు. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 తన ప్లాట్‌ఫామ్‌ పూణేలోని చకాన్‌లోఉంది. ఇది స్పోర్ట్స్ బైక్ గా కూడా ఉపయోగపడమే కాకుండా, రైడర్లను బాగా ఆకర్షించే విధంగా ఉంటుంది.

18 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్. ఇప్పుడు విపణిలోకి ప్రవేశపెట్టనున్న బిఎస్ 6 వాహనాలు ఏవంటే...?

ఎన్ఎస్ 200 బైక్ స్టైలింగ్ మరియు ఇంటర్నల్స్ అన్నీ కూడా కొంత నవీకరణలతో 2012 నుండి మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు అది బిఎస్-6 వెర్షన్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇది దాదాపు 2020 ఏప్రిల్ కి ముందే మార్కెట్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి.

18 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్. ఇప్పుడు విపణిలోకి ప్రవేశపెట్టనున్న బిఎస్ 6 వాహనాలు ఏవంటే...?

ప్రస్తుతం ఉన్న బిఎస్-4 ఎన్ఎస్ 200 మరియు దాని స్థానంలో రాబోయే బిఎస్-6 లు కొంత వ్యత్యాసంగా ఉంటాయి. ఇందులో F1 వ్యవస్థ అదనంగా ఉంటుంది. బజాజ్200 బిఎస్-6 వెర్షన్ ఉద్గారాలను మరింత తగ్గించడానికి నవీనీకరించబడి ఉంటుంది. ఇది కఠినమైన రోడ్లలో ప్రయాణించడానికి కూడా అనుగుణంగా తయారు చేయబడి ఉంటుంది.

18 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్. ఇప్పుడు విపణిలోకి ప్రవేశపెట్టనున్న బిఎస్ 6 వాహనాలు ఏవంటే...?

ప్రస్తుత బిఎస్ 4 ఫార్మాట్‌లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, 199.5 సిసి లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 23 బిహెచ్‌పి మరియు 18.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు పల్సర్ ఆర్ఎస్200 - ఎన్ఎస్200 రెండూ కూడా ఒకే వెర్షన్ ని కలిగి 24బిహెచ్‌పి మరియు 18.6 ఎన్ఎమ్ టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు మోటార్ సైకిళ్ళు 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటాయి.

18 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్. ఇప్పుడు విపణిలోకి ప్రవేశపెట్టనున్న బిఎస్ 6 వాహనాలు ఏవంటే...?

కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రాబోయే ఎన్ఎస్200 తో పాటు పల్సర్ ఆర్ఎస్200 రెండు నవీకరించబడుతున్నాయి. బజాజ్ లో పనిచేస్తున్న ప్రధాన తయారీదారులు ఇప్పటికే తమ ఉత్పత్తులను బిఎస్ 6-కంప్లైంట్ వెర్షన్లలో విడుదల చేయడం ప్రారంభించారు.

Read More:లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్!

18 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బజాజ్. ఇప్పుడు విపణిలోకి ప్రవేశపెట్టనున్న బిఎస్ 6 వాహనాలు ఏవంటే...?

పల్సర్ ఎన్ఎస్ 200 మరియు ఆర్ఎస్ 200 యొక్క బిఎస్ 6 శ్రేణి ధరలు వారి బిఎస్ 4 కన్నా ఎక్కువ ధరలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆంటే దాదాపుగా రూ. 5,000 లేదా అంతకంటే ఎక్కువ ధర పెరిగే అవకాశం ఉంది.

Read More:ఇప్పుడే చూడండి...స్పాట్ టెస్ట్ లో కనిపించిన ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ప్రస్తుత ధర 1.15 లక్షల ఉంది. అదే విధంగా ఆర్ఎస్ 200 ధర 1.40 లక్షల రూపాయలు. కొత్తగా విడుదలయ్యే రెండు మోటార్ సైకిళ్ళు దాదాపు ఒకే యూనిట్ తో వస్తాయి. కొత్త బిఎస్ 6 మోడల్స్ అయిన పల్సర్ ఎన్ఎస్ 200 మరియు ఆర్ఎస్ 200 కెటిఎమ్ డ్యూక్ 200, టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 200 వి 4 మరియు యమహా ఎఫ్జెడ్ 25 లకు ప్రత్యర్థులుగా ఉండబోతున్నాయి.

Read More:భారతదేశంలో రాజకీయ నాయకులు ఉపయోగించే విలాసవంతమైన కార్లు చూడాలనుకుంటున్నారా...? అయితే ఇప్పుడే చూడండి!

Most Read Articles

English summary
Bajaj Pulsar celebrates 18th anniversary video – NS200 BS6 launch soon-Read in Telugu
Story first published: Monday, January 6, 2020, 14:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X