బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో విక్రయిస్తున్న పల్సర్ ఎన్ఎస్200 మోటార్‌సైకిల్‌లో కంపెనీ మరిన్ని కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త పెయింట్ స్కీమ్స్ కోసం బజాజ్ ఆటో ఇప్పటికే ఓ టెలివిజన్ కమర్షియల్‌ను సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా కంపెనీ రిలీజ్ చేసింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి సమయంలో, సోషల్ డిస్టెన్స్‌ను ప్రమోట్ చేస్తూ బజాజ్ ఆటో ఇటీవలే ‘చాక్ లైన్స్' పేరిట ఓ కొత్త టెలివిజన్ కమర్షియల్‌ను కూడా విడుదల చేసింది. ఈ ప్రకటనలో అనేక మంది రైడర్స్ పల్సర్ ఎన్ఎస్200తో పాటుగా వివిధ పల్సర్ మోడళ్లపై స్టంట్స్ చేయటాన్ని చూడొచ్చు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

ఈ ప్రకటనలో ఉపయోగించిన పల్సర్ ఎన్ఎస్200 మోటార్‌సైకిళ్ళు కొత్త రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉన్నాయి. ఈ కొత్త పెయింట్ స్కీమ్‌లో ఇంధన ట్యాంక్ మరియు హెడ్‌ల్యాంప్ కౌల్‌లు రెండూ ఎరుపు రంగులో ఉన్నాయి. అలాగే, పెరిమీటర్ ఫ్రేమ్ మరియు అల్లాయ్ వీల్స్ రెండూ తెలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉండటాన్ని మనం చూడొచ్చు.

MOST READ:పాత స్కూటర్‌తో తల్లిని తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కొడుక్కి KUV100 గిఫ్ట్ గా ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

ఇందులో మరికొన్ని వేరియంట్లు రెడ్, వైట్ మరియు బ్లాక్ కలర్ కాంబినేషన్లలో ఉన్నాయి. ఈ నేక్డ్ మోటార్‌సైకిల్‌కు కొత్త పెయింట్ స్కీమ్ సరికొత్త రూపాన్ని ఇస్తుంది మరియు మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఈ రెడ్ అండ్ వైట్ పల్సర్ మోటార్‌సైకిళ్లలో మరో చిన్న మార్పును గమనిస్తే, వెనుక గ్రాబ్-రైల్‌ను స్ప్లిట్ డిజైన్‌తో కాకుండా ట్రెడిషనల్‌గా మార్చబడి ఉండటాన్ని గమనించవచ్చు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

బజాజ్ ఆటో ప్రస్తుతం పల్సర్ ఎన్ఎస్200 మోటార్‌సైకిల్‌ను నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. అవి: గ్రాఫైట్ బ్లాక్, మిరాజ్ వైట్, ఫైరీ ఎల్లో మరియు వైల్డ్ రెడ్. ఇవన్నీ డ్యూయెల్ టోన్ థీమ్‌తో లభిస్తాయి.

MOST READ:దుమ్మురేపుతున్న ఫార్చ్యూనర్ లెజెండరీ ఎస్‌యూవీ ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ వీడియో

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 199.5 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9,750 ఆర్‌పిఎమ్ వద్ద 24.1 బిహెచ్‌పి శక్తిని మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

ఇందులో ఆఫర్ చేస్తున్న ప్రధాన ఫీచర్లను గమనిస్తే, పల్సర్ ఎన్ఎస్200లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది అనలాగ్ టాకోమీటర్‌ను కూడా కలిగి ఉంటుంది. క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, చిన్న విండ్‌స్క్రీన్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్, స్ప్లిట్-సీట్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానమైనవి.

MOST READ:మరో వాహనాన్ని కాఫీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ వాహనంలో తెలుసా ?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

పల్సర్ ఎన్ఎస్200 ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీ-లోడ్ డ్యాంపింగ్ కోసం సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్‌లు మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్‌లు ఉంటాయి. ఇందులో రెండు వైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎమ్ఆర్ఎఫ్ ట్యూబ్ లెస్ టైర్లు అమర్చబడి ఉంటాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఈ విభాగంలో కెటిఎమ్ డ్యూక్ 200, టివిఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మరియు ఇటీవలే భారత మార్కెట్లో విడుదలైన హోండా హార్నెట్ 2.0 మొదలైన మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ధర రూ.1.29 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

MOST READ:మీకు తెలుసా.. ఇప్పుడు సియట్ టైర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో కొత్త కలర్ ఆప్షన్స్ రానున్నాయా!?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 కొత్త కలర్ ఆప్షన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశీయ మార్కెట్లో 200సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అత్యంత సరసమైన మోడల్. ఇది భారతదేశంలో యువ కొనుగోలుదారులలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోటారుసైకిల్. ఇందులో కొత్త రెడ్ అండ్ వైట్ పెయింట్ చాలా ఆకర్షణీయంగా మరియు ప్రత్యేకంగా ఉంది. ఈ కలర్ ఆప్షన్ మార్కెట్లో విడుదలైతే ఈ మోడల్ అమ్మకాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
The Bajaj Pulsar NS200 is expected to receive a new paint scheme sometime in the coming months. The new paint scheme has been teased by the company in its latest TV commercial. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X