బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ఇప్పుడు బిఎస్-6 వెర్షన్లో కూడా!

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహనాల తయారీ దారు బజాజ్. ఈ సంస్థ యొక్క చాలా వాహనాలు ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు బజాజ్ యొక్క బిఎస్-6 వెర్షన్ ని విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ఇకపై బిఎస్-6 వెర్షన్లో కూడా!

బజాజ్ సంస్థ బిఎస్-6 సిటి మరియు ప్లాటినా మోడళ్లను విడుదల చేసిన తరువాత ఇప్పుడు ఎన్ఎస్ 200 బిఎస్ 6 ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ఇకపై బిఎస్-6 వెర్షన్లో కూడా!

కొత్త బజాజ్ ఎన్ఎస్ 200 బిఎస్ 6 యొక్క ధర రూ. 1.24 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ పూణే) ఉంటుంది. ఇది మునుపటి వెర్షన్ కంటే కూడా 11,000 రూపాయల అధిక ప్రీమియంను కలిగి ఉంటాయి. బజాజ్ యొక్క బిఎస్-6 ఎన్ఎస్ 200 ఇప్పుడు ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ బుకింగ్స్ అనేవి డీలర్‌షిప్‌ల ఆధారంగా రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు ఉంటాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ఇకపై బిఎస్-6 వెర్షన్లో కూడా!

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బిఎస్ 6 లో కొత్త కాస్మెటిక్ అప్‌డేట్స్ ఏమి లేవు. ఇది మోటార్ సైకిల్ లాగే తెలుపు మరియు బూడిద రంగులలో లభిస్తాయి. కానీ బిఎస్-4 వెర్షన్లో అయితే పసుపు, ఎరుపు మరియు నలుపు రంగులలో లభిస్తాయి. ఇందులో ఉండే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఎటువంటి మార్పుకి లోనుకాలేదు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ఇకపై బిఎస్-6 వెర్షన్లో కూడా!

బజాజ్ ఎన్ఎస్ 200 బిఎస్-6 లో ఫ్యూయల్ ఇంజక్షన్ మరియు క్యాటలిటిక్ కన్వ్యర్టర్ తో అప్డేట్ చేసిన ఎగ్జాస్ట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. బజాజ్ కొత్త మోటారుసైకిల్ యొక్క స్పెక్స్‌ను ఇంకా వెల్లడించనప్పటికీ కానీ ఇది కొలంబియాలో ఎన్ఎస్ 200 యొక్క ఫ్యూయల్ ఇంజక్ట్ వెర్షన్లో విక్రయాలు జరుపుతుంది. ఇది 23.5 పిఎస్ మరియు 18.6 ఎన్ఎమ్ లను అందిస్తుంది. ఇది సాధారణంగా ఇండియా ఎన్ఎస్ 200 యొక్క అవుట్పుట్ 23.5 పిఎస్ మరియు 18.3 ఎన్ఎమ్ కంటే ఎక్కువ.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ఇకపై బిఎస్-6 వెర్షన్లో కూడా!

ఎన్ఎస్ 200 బిఎస్ లో అండర్ పిన్నింగ్స్ కూడా మారవు. ఇది టెలిస్కోప్ ఫోర్కులు మరియు గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్‌లతో ఒకే ట్విన్-స్పార్ చుట్టుకొలత గల ఫ్రెమ్ ని కలిగి ఉంటుంది. ఇది మునుపటి లాగే బ్రేకింగ్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌ల ద్వారా మరియు సింగిల్-ఛానల్ ABS తో ప్రామాణికంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ఇకపై బిఎస్-6 వెర్షన్లో కూడా!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త బజాజ్ బిఎస్-6 ఎన్ఎస్ 200 ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఉంది. ఇది మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి కి మరియు బిఎస్-6 యమహా ఎఫ్‌జెడ్ 25 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతుంది.

Source: Zigwheels

Most Read Articles

English summary
Exclusive Bajaj Pulsar NS200 BS6 Spotted At Dealership Price Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X