సుజుకి హయబుసాగా మారిన బజాజ్ పల్సర్

కారు లేదా మోటారుసైకిల్ కొనుగోలు చేసే వారిలో చాలా మంది, తామ వాహనం అందరిలో కెల్లా ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. ఇలాంటి వారు తమ ఫేవరేట్ వాహనాన్ని తమ అభిరుచికి అనుగుణంగా మోడిఫై చేసుకోవాలనుకుంటారు. ప్రత్యేకించి ఖరీదైన బ్రాండెడ్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయలేని కస్టమర్లు తమ సాధారణ బైక్‌నే ప్రీమియం లుకింగ్ బైక్‌గా మార్చేసుకుంటారు.

అలాంటి ఓ సంఘటనే ఈ కథనం. వాంప్‌వీడియో పోస్ట్ చేసిన వీడియోను గమనిస్తే, ఇందులో కనిపిస్తున్న మోటార్‌సైకిళ్లు చూడటానికి ఐకానిక్ సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌ల మాదిరిగా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఇవి బజాజ్ పల్సర్ 200సీసీ మోటార్‌సైకిళ్లు. ఇందులో నలుపు రంగులో ఉన్నది బజాజ్ ఎన్ఎస్200 మరియు పసుపు రంగులో ఉన్నది పల్సర్ ఆర్ఎస్ 200 మరియు రెండు మోటార్‌సైకిళ్ళు ఒకే రకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయి.

సుజుకి హయబుసాగా మారిన బజాజ్ పల్సర్

ఈ మోడిఫైడ్ పల్సర్ మోటార్‌సైకిళ్ల ముందు భాగంలో, హయాబుసాలో చూసినట్లుగా ఖచ్చితమైన రూపాన్ని కలిగి ఉండేలా కస్టమైజ్ చేశారు. లో బీమ్ ప్రొజెక్టర్ మరియు హై బీమ్ రెగ్యులర్ లైట్రలతో డిజైన్ చేసిన హెడ్‌లైట్ క్లస్టర్‌ను ఇందులో చూడొచ్చు. మోడిఫై చేసిన ఈ రెండు మోటార్‌సైకిళ్ళలో ఫ్రంట్ ఎయిర్ ఇన్‌టేక్ కోసం ఇండికేటర్ లైట్స్‌కు పక్కగా రెండు పెద్ద ఇన్‍టేక్స్ ఉంటాయి, కాకపోతే ఇవి ఫేక్ ఎయిర్ ఇన్‌టేక్ వెంట్స్. అలాగే, ఈ మోటార్‌సైకిళ్ళ కోసం లో ప్రొఫైల్ టైర్లతో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. ముందు వైపు అప్‌సైడ్ ఫోర్క్స్ కాకుండా ట్రెడిషనల్ ఫ్రంట్ ఫోర్క్‌లనే ఉపయోగించారు.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కార్ డ్రైవ్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

సుజుకి హయబుసాగా మారిన బజాజ్ పల్సర్

సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ఈ మోడిఫైడ్ హయాబుసాలో రియల్ హయబుసాలో ఉండే స్టిక్కరింగ్ మరియు అద్భుతమైన పెయింట్ స్కీమ్ ఉంటుంది (దీనికి ఆరు నెలల వారంటీ ఉంటుంది). అసలు సూపర్‌బైక్‌లో చూసినట్లుగానే ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. త్రీ పీస్ హ్యాండిల్‌బార్ పల్సర్ నుండి గ్రహించారు, దీని పైభాగంలో కస్టమ్ సుజుకి లోగో ఉంటుంది.

సుజుకి హయబుసాగా మారిన బజాజ్ పల్సర్

చిత్రాలలో చూసినట్లుగా, ఈ మోటార్‌సైకిల్‌కు ఒకే సీటు ఉంటుంది. వెనుక సీటు కావాలనుకునే వారికి తొలగించగల వెనుక కౌల్‌ కూడా ఉంటుంది. ఈ కస్టమైజ్డ్ పల్సర్‌లు జిఎక్స్ఎస్ 1300ఆర్ మోటార్‌సైకిలో చూసినట్లుగా ఒకే రకమైన డ్యూయెల్ ఎగ్జాస్ట్‌ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే, వాటిలో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. వెనుక టెయిల్ లైట్స్ అసలు సూపర్‌బైక్‌లో మాదిరిగానే ఉంటాయి.

MOST READ:గంటకు 300 కి.మీ వేగంతో రైడ్ చేసిన బెంగళూరు బైకర్ అరెస్ట్ ; 20 లక్షల బైక్ సీజ్

సుజుకి హయబుసాగా మారిన బజాజ్ పల్సర్

ఇంజన్ విషయానికి వస్తే, ఈ మోడిఫైడ్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మరియు ఆర్ఎస్200 మోటార్‌సైకిళ్లలో ఇంజన్‌ను మోడిఫై చేయలేదు. ఈ రెండు మోడళ్లలో 200 సిసి, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 23.5 బిహెచ్‌పి శక్తిని మరియు 18.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. రెగ్యులర్ బిఎస్6 కంప్లైంట్ పల్సర్ ఎన్ఎస్200 ధర రూ.1.28 లక్షలు, పల్సర్ ఆర్‌ఎస్200 ధర రూ.1.48 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

సుజుకి హయబుసాగా మారిన బజాజ్ పల్సర్

మోడిఫైడ్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్, ఆర్ఎస్ 200 మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ రెండు పల్సర్ బైక్‌లను అద్భుతమైన హయబుసా మోటార్‌సైకిళ్లుగా మార్చడంలో సదరు మోడిఫైయర్ పనితీరును మెచ్చుకోక తప్పదు. మొదటి చూపులో ఈ మోటార్‌సైకిళ్లు నకిలీనా లేదా నిజమైన హయాబుసానా అని చెప్పడం కష్టం.

MOST READ:గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

Most Read Articles

English summary
As seen in the video posted by Vampvideo, there are two motorcycles from Bajaj that have been modified in the iconic Suzuki Hayabusa. The black one is a Bajaj NS200 and the yellow one is an RS200 and both motorcycles feature the same engine. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X