లాక్‌డౌన్ లో కూడా అమ్మకాలలో పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

భారతీయ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్. బజాజ్ ఆటో ఇప్పటికే చాలా వాహనాలను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టి మంచి ప్రజాదరణను పొందుతోంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రవేశపెట్టింది. దాని పేరే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలను సాగిస్తోంది. ప్రస్తుతం భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ మంచి అమ్మకాలను చేపట్టింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

లాక్‌డౌన్ లో కూడా అమ్మకాల పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

బజాజ్ ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ మార్కెట్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ మార్చి చివరిలో ప్రారంభమైంది.

లాక్‌డౌన్ లో కూడా అమ్మకాల పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించిన మొదటి నెలలోనే బజాజ్ 21 యూనిట్లను విక్రయించింది, ఇది ఫిబ్రవరిలో 100 యూనిట్లకు చేరింది. కరోనా ప్రభావం మార్చిలో ఉన్నప్పటికీ బజాజ్ చేతక్ దాదాపు 91 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

MOST READ:అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

లాక్‌డౌన్ లో కూడా అమ్మకాల పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

బజాజ్ చేతక్ స్కూటర్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ స్కూటర్ ధర రూ. 1 లక్ష కాగా, చేతక్ ఎలక్ట్రిక్ ప్రీమియం ధర రూ. 1.15 లక్షలు.

లాక్‌డౌన్ లో కూడా అమ్మకాల పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

చేతక్ ఎంట్రీ లెవల్ అర్బన్ స్కూటర్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ రంగులలో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ హాజెల్ నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వేలుట్టో రోసో మరియు ఇండిగో మెటాలిక్ రంగులలో లభిస్తుంది. చేటక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఇది ఎకో మోడ్‌లో ఛార్జీకి 95 కి.మీ పరిధిని మరియు స్పోర్ట్ మోడ్‌లో ఛార్జీకి 85 కి.మీ. పరిధిని అందిస్తుంది.

MOST READ:గుడ్ న్యూస్ చెప్పిన కర్ణాటక గవర్నమెంట్, ఏంటో తెలుసా..?

లాక్‌డౌన్ లో కూడా అమ్మకాల పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఈ స్కూటర్‌ వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ట్రాకింగ్, ట్రిప్ గణాంకాలు, వినియోగదారు సమాచారం మరియు అనేక భద్రత మరియు సౌలభ్య లక్షణాలు ఉన్నాయి.

లాక్‌డౌన్ లో కూడా అమ్మకాల పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఈ స్కూటర్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, షార్ప్ డిజైన్, రెట్రో స్టైల్ బాడీ డిజైన్, హార్న్ అండ్ ఇండికేటర్ స్విచ్, ఎల్‌ఈడీ ఇండికేటర్, పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మొబిలిటీ సాఫ్ట్‌వేర్, సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

లాక్‌డౌన్ లో కూడా అమ్మకాల పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

చేతక్ చూడటానికి వెస్పా స్కూటర్ లాగా కనిపిస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉపయోగించిన బ్యాటరీ 70 వేల కిలోమీటర్ల పనితీరును కలిగి ఉంది. బజాజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 50,000 కిమీ లేదా 3 సంవత్సరాల వారంటీని అందించనుంది. ఈ స్కూటర్‌లో రైడర్స్ భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లు, జియో ఫెన్సింగ్ మరియు వెహికల్ ట్రాకింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Bajaj Auto Sells Over 90 Units Of Chetak Electric Scooter In March 2020. Read in Telugu.
Story first published: Wednesday, April 29, 2020, 15:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X