Just In
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Movies
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్దేనా విజయం..?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బజాజ్-ట్రయంప్ నుండి రానున్న 200 సిసి బైక్స్ ధర 2 లక్షల్లోపే
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో బజాజ్ ఆటో ఒకటి. ఇప్పుడు బజాజ్ ఆటో - ట్రయంఫ్ నుండి మార్కెట్లోకి కొత్త బైకులు ప్రవేశపెట్టనుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

బజాజ్ ఆటో మిడ్-రేంజ్ బైక్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ట్రయంఫ్ ప్రీమియం బైక్ యుకెతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కూటమిలో తొలిసారిగా కొత్త బైక్ మోడళ్ల ప్రకటన గురించి ఈ రోజు పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించబడింది.

ఈ కార్యక్రమంలో ట్రయంఫ్ మోటార్సైకిల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ స్ట్రౌడ్ మాట్లాడుతూ, బజాజ్ ట్రయంఫ్స్ను భారతదేశంలో మరియు కొన్ని ఇతర మార్కెట్లలో పంపిణీ చేయనున్నట్లు ధృవీకరించారు.

ఈ భాగస్వామ్యంలో మీడియం వెయిట్ విభాగంతో ప్రీమియం బైక్ మోడళ్లను రూపొందించడానికి ట్రయంఫ్ బ్రాండ్ సిద్ధంగా ఉంది. ఏ విధంగా అంటే టీవీఎస్-బిఎమ్డబ్ల్యూ కూటమి మాదిరిగా, ఈ కూటమి కూడా మిడిల్ వెయిట్ సెగ్మెంట్ ను లక్ష్యంగా చేసుకుంటోంది.

బజాజ్-ట్రయంఫ్ నుండి వచ్చే ఈ బైక్స్ 2 లక్షల రూపాయలకంటే తక్కువ ధరను కలిగి ఉండవచ్చు. ఈ మోటార్ సైకిల్స్ 2022 కి షో రూంలకి వచ్చే అవకాశం ఉంది. వీటి గురించి మరింత సమాచారం కొన్ని రోజులలోనే విడుదల చేయనుంది.

అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్స్ కోసం కొత్త ఇంజిన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి 200 సిసి నుండి 750 సిసి వరకు సామర్థ్యం గల ఇంజన్లతో రానున్నాయి.

మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహన్ లోని బజాజ్ ఆటో ప్లాంట్లో ఈ కొత్త బైక్ మోడల్స్ తయారు చేయబడతాయి. ఇక్కడ తయారు చేసే బైకులు భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఈ కొత్త బైక్లను భారతదేశంలో బజాజ్ ఆటో డీలర్ల ద్వారా విక్రయించనున్నారు.

కొత్త నవీనీకరణలతో రాబోతున్న బజాజ్-ట్రయంప్ మోటార్ సైకిల్స్ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే కెటిఎమ్ డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి వాహనాలను ప్రత్యర్థిగా ఉండవలసి ఉంటుంది. బజాజ్-ట్రయంప్ 200 సిసి బైక్స్ కోసం ఇంకా కొంతకాలం ఎదురు చూడవలసి ఉంటుంది.