ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ పొడిగించిన బజాజ్

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర తయారీదారు బజాజ్. బజాజ్ ఇండియన్ మార్కెట్లో చాలా వాహనాలను విడుదల చేసింది. అంతే కాకుండా బజాజ్ మోటార్ సైకిల్స్ కి మంచి డిమాండ్ మరియు మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు బజాజ్ యొక్క వాహనాలకు ఫ్రీ సర్వీస్ చేయడమే కాకుండా మరియు వారంటీ సమయాన్ని కూడా పొడిగించింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..!

ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ పొడిగించిన బజాజ్

పూణే ఆధారిత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ద్విచక్ర వాహనాలకు మరియు వాణిజ్య వాహనాలకు ఉచిత సేవ మరియు వారంటీ వ్యవధిని పొడిగించినట్లు ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల ఈ ప్రకటన చేసింది.

ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ పొడిగించిన బజాజ్

సాధారణంగా మార్చి 20 మరియు ఏప్రిల్ 30 మధ్య మొత్తం మోటార్ సైకిల్స్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ ముగియనుంది. కానీ ఈ వ్యవధిని మే 31 వరకు పొడిగించనున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు ఉచిత సేవలు మరియు వారంటీ ఉన్న ఏదైనా త్రీ వీలర్ మరియు బజాజ్ క్యూట్ మోడళ్లకు జూన్ 30 వరకు రెండు నెలల పొడిగింపు లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది సంస్థ యొక్క మొత్తం కమర్షియల్ వెహికల్ శ్రేణికి వర్తిస్తుంది.

ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ పొడిగించిన బజాజ్

బజాజ్ ఆటో లిమిటెడ్‌లోని మోటార్‌సైకిల్స్ డివిజన్ హెడ్ రాకేశ్ శర్మ మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా తప్పనిసరి లాక్ డౌన్ యొక్క ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, బజాజ్ ఆటో మా వాహనాల యొక్క సేవ మరియు వారంటీ వ్యవధిని పొడిగించాలని నిర్ణయించిందని తెలిపారు.

ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ పొడిగించిన బజాజ్

ఇటువంటి సమయాల్లో సామాజిక దూరం అందరి యొక్క సామూహిక బాధ్యత కాబట్టి ఈ సమయంలో మా సేవలను పొందలేనందున మా కస్టమర్లు ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము, అందుకే ఈ సమయాన్ని పొడిగించడం జరిగిందని ఆయన చెప్పారు.

ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ పొడిగించిన బజాజ్

బజాజ్ కి సంబందించిన ఇతర వార్తల ప్రకారం బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ బిఎస్ 4 కంప్లైంట్ వాహనాల అమ్మకాలకు పొడిగింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని అంగీకరించలేదు. కంపెనీలు ఏప్రిల్ 1 న అనవసరమైన బిఎస్ 4 స్టాక్‌ల కోసం డీలర్లను తిరిగి చెల్లించాలని ఆయన అన్నారు. గడువుకు వారం రోజుల ముందే తయారీదారులు బిఎస్ 4 స్టాక్‌లను డీలర్లకు పంపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ పొడిగించిన బజాజ్

కరోనా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఆటో ఇండస్ట్రీలు ప్రభుత్వానికి చాల వరకు తమ మద్దతు తెలుపుతున్నారు. అంతే కాకుండా విరాళాలు ఇవ్వడం, వైద్య సదుపాయాలకు కావలసిన పరికరాలను తయారు చేయడంలో ఇప్పుడు కొన్ని కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. కరొనతో పోరాడుతున్న ప్రభుత్వానికి ప్రజలు కూడా మద్దతు తెలియజేయాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 1, 2020, 19:04 [IST]
English summary
Bajaj Announces Extension Of Free Service & Warranty Periods For Two And Three Wheelers. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+