Just In
- 15 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 43 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎస్ 6 వెర్షన్ లో విడుదల కానున్న బజాజ్ డిస్కవరీ మరియు వి మోడల్స్
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారులలో బజాజ్ ఆటో ఒకటి. బజాజ్ ఇప్పటికే చాల వాహనాలను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసి ఎక్కువ ప్రజాదరణను పొందాయి. ఇప్పుడు సంస్థ తమ బ్రాండ వాహనాలైన బజాజ్ డిస్కవర్ మరియు వి మోడల్స్ బైకులు బిఎస్ 6 రూపంలో తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ బైకుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వాహన సంస్థలు 2020 ఏప్రిల్ నాటికల్లా బైక్స్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయాలనీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు తమ బ్రాండ్ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బిఎస్ 6 వాహనాలు మార్కెట్లో అడుగుపెట్టాయి.

బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు కానీ వాహనాలను కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ నుండి తొలగించబడ్డాయి. కానీ ఇప్పుడు డిస్కవర్ మరియు వి శ్రేణులు బజాజ్ వెబ్‌సైట్‌లో లేవు. కానీ బైక్‌లు శాశ్వతంగా తొలగించబడవు. ఇవి కొన్ని త్వరలో బిఎస్ 6 వెర్షన్లో అడుగుపెట్టనున్నాయి.
MOST READ:కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

భారతదేశంలోని చాలా ద్విచక్ర వాహన సంస్థల మాదిరిగానే, బజాజ్ ఇప్పుడు తమ బ్రాండ్ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నవీకరించింది. కానీ ప్రస్తుతం బజాజ్ కంపెనీ డిస్కవర్ మరియు వి మోడల్ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించలేదు.

బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా ఈ రెండు బైకులను తయారుచేయలేదు కాబట్టి ఈ వాహనాలను అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించారు. కానీ ఇది త్వరలోనే బిఎస్ 6 కాలుష్య నిబంధనలకు అనుకూలంగా తయారు కానున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.
MOST READ:ఎలక్ట్రిక్ మాస్ట్రో స్కూటర్ విడుదల చేయనున్న హీరో మోటోకార్ప్

దేశీయ మార్కెట్లో హోండా, హీరో మరియు టివిఎస్ కంపెనీలు అత్యంత ప్రాచుర్యం పొందిన వాహనాలను బిఎస్ 6 నిబంధనలకు అనుకూలంగా నవీనీకరించడానికి ప్రాధాన్యతను కల్పించాయి. ఇప్పుడు బజాజ్ కూడా తమ డిస్కవర్ మరియు వి సిరీస్ శ్రేణి వాహనాలు తక్కువగా అమ్ముడవుతుంటే కూడా వాటిని కూడా బిఎస్ 6 నిబంధనలకు అనుకూలంగా తయారుచేయడానికి సంకల్పించాయి.

వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టే తేదీని గురించి కంపెనీ సరైన సమాచారం వెల్లడించలేదు. భారతదేశంలో కరోనా రోజు రోజుకి ఎక్కువవుతున్న కారణంగా ఈ బైకులు మార్కెట్లోకి రావడానికి కొంత ఆలస్యం జరగవచ్చు. కానీ ఖచ్చితంగా మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి.
MOST READ:లాక్‌డౌన్‌లో చిన్న బిడ్డ పుట్టిన రోజుకి పోలీస్ ఎస్కార్ట్, ఎక్కడో తెలుసా ?

బజాజ్ యొక్క డిస్కవర్ మరియు వి మోడల్ బైకులు రెండూ కూడా చాల కాలం నుంచి మంచి ప్రజాదరణను పొందాయి. 2019 ఫిబ్రవరిలో బజాజ్ డిస్కవర్ చివరి సారిగా నవీకరించబడింది. అంతే కాకుండా బజాజ్ వి 15 పవర్ అప్ అని పిలువబడే నవీకరించబడిన వేరియంట్ ప్రారంభించినప్పుడు, డిసెంబర్ 2018 లో దాని చివరి నవీకరణను తిరిగి పొందింది. రాబోయే కొత్త బిఎస్ 6 మోడల్స్ మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా ఉంటాయా లేదా అనేదానిని గురించి మనం త్వరలో తెలుసుకోవచ్చు.