Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియాలో ప్రారంభించబోయే బెనెల్లి 302 ఎస్, టిఎన్టి 300 ని భర్తీ చేయనుందా....?
ఇటాలియన్ మోటారుసైకిల్ తయారీ సంస్థ అయిన బెనెల్లి భారతదేశంలో సరికొత్త 302 ఎస్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది కొత్త మోటారుసైకిల్ టిఎన్టి 300 కు ప్రత్యామ్నాయంగా రాబోతోంది. కంపెనీ వారు బెనెల్లి 302 ఎస్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాబోయే బెనెల్లి 302 ఎస్ సంస్థ యొక్క టిఎన్టి 300 మోడల్ కంటే ఎక్కువ అప్గ్రేడ్లను కలిగి ఉంది. 302 Sలో సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

బెనెల్లి యొక్క టిఎన్టి 300 మోడల్లో హాలోజన్ హెడ్‌ల్యాంప్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు ఉన్నాయి. టిఎన్టి 300 తో పోల్చితే 302 ఎస్ పెద్ద రేడియేటర్ని కలిగి ఉంటుంది.

ఈ వెహికల్ లో వెలుపల కొంత నవీనీకరణలు చేయబడ్డాయి. ఇందులో ఫ్యూయల్ ట్యాంక్, ఇంజిన్ కౌల్, స్ప్లిట్ సీట్లు మరియు వెనుక ప్యానెల్లు ఉంటాయి. కొత్తగా వస్తున్న మోటార్‌సైకిల్‌లో టిఎన్టి 300 లో కనిపించే ట్రేల్లిస్ ఫ్రేమ్ కూడా ఉంటుంది.

బెనెల్లి 302 ఎస్ ముందు భాగంలో 41 మిమీ ఇన్వెర్టడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీ లోడ్ & రీబౌండ్ అడ్జస్టబుల్ అసిమ్మెట్రీకల్ మోనో షాక్ కలిగి ఉంటుంది.

ముందు భాగంలో నాలుగు పిస్టన్ కాలిపర్లను కలిగి ఉంటుంది. ఇందులో 260 మిమీ డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో రెండు పిస్టన్ కాలిపర్లను కలిగి ఉన్నప్పటికీ 240ఎంఎం డిస్క్ ద్వారా బ్రేకింగ్ విధులు నిర్వహించబడతాయి. బెనెల్లి 302 ఎస్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది. ముందు భాగంలో 120/70 సెక్షన్ టైర్ మరియు వెనుక వైపున 160/60 సెక్షన్ టైర్‌తో ఉంటాయి.

302 ఎస్ లో 300సిసి బిఎస్-6 కంప్లైంట్, ప్యారలల్-ట్విన్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఫోర్-వాల్యూ డిఓహెచ్సి ఇంజన్ ద్వారా 37.5 బిహెచ్పి శక్తిని మరియు 25.62 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Most Read:నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది మరియు స్లిప్పర్-అసిస్ట్ క్లచ్ మరియు ఎబిఎస్లను ప్రామాణికంగా కలిగి ఉంటుంది. బెనెల్లి 302 ఎస్ ధర సుమారు రూ .3.25 లక్షలు ఉంటుంది.
Read More:జనవరి 15న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

బెనెల్లి 302 గురించి ఆలోచనలు:
మోటార్ సైకిల్ తరువాతి తరంలో వచ్చే బైక్‌లలో 302 ఎస్ ప్రధాన పాత్ర పోషించనుంది. బిఎస్ 6 అనుమతితో బెనెల్లి మోటార్ సైకిల్ చాలా అప్గ్రేడ్లను పొందింది. బెనెల్లి ధరలో మాత్రం పెద్ద పాత్ర పోషిస్తుంది. దీని మీద ఇంకా 12,000 రూపాయలు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా టిఎన్టి 300 కంటే 302 ఎస్ కొంత మెరుగైనదిగా ఉంటుంది. రైడర్లకు చాల అనుకూలంగా కూడా ఉంటుంది.
Read More:ఇప్పుడే చూడండి....గాలిలో ఎగిరే మోటార్ సైకిల్ వచ్చేసింది!