బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

భారతదేశంలో బిఎస్ 4 ఇంజన్ ఉన్న వాహనాలు అధిక స్థాయిలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ కారణంగా బిఎస్ 4 వాహనాల్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. బిఎస్-4 వాహనాలు నిలిపివేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు మార్చి 31. కాబట్టి బిఎస్ 4 వాహనాలను మర్చి 31 తరువాత నిలివేయబడతాయి.

 బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

ఇండియన్ మార్కెట్లోకి బిఎస్ 6 వాహనాలు ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో చాలామంది వాహనతయారీదారులు తమ బ్రాండ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు బిఎస్ 6 వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడం కూడా జరిగింది.

 బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

ఈ క్రమంలో బెనెల్లి తన బైక్‌ల శ్రేణిని కూడా బిఎస్ 6 ఇంజిన్‌తో అప్‌గ్రేడ్ చేస్తోంది. బెనెల్లి ఇంపీరియల్ 400 త్వరలో బిఎస్ 6 ఇంజిన్‌తో భారత్‌లో విడుదల కానుంది. నివేదికల ప్రకారం ఏప్రిల్‌లో ఇంపీరియల్ 400 బిఎస్ 6 బైక్‌ను విడుదల చేయనున్నారు.

 బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

బెనెల్లి ఇంపీరియల్ 400 ను గత ఏడాది అక్టోబర్‌లో దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ బైక్ ధర రూ. 1.69 లక్షలు. కానీ బీఎస్ 6 వెర్షన్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.

 బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది క్లాసిక్ లుక్ కోసం గుండ్రని హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది.అంతే కాకుండా ఈ బైక్ ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా శక్తిని పొందుతుంది.

 బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

బెనెల్లి బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జర్వర్ ఉంది. భద్రత కోసం ఈ బైక్‌లో ఎబిఎస్ డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.

 బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్‌లో బిఎస్ 6, 373 సిసి సింగిల్ సిలిండర్ అమర్చారు. ఈ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద 19 బిహెచ్‌పి శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

 బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

ఇంపీరియల్ 400 బైక్ వెనుక 19 అంగుళాల ఫ్రంట్ మరియు 18 అంగుళాల టైర్లను కలిగి ఉంది. ఈ బైక్ భారతదేశంలో తయారు చేయబడింది. ఈ బైక్ దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు జావా కంపెనీ బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Benelli Imperiale 400 BS6 scheduled to be launched in April. Read in Telugu.
Story first published: Saturday, March 21, 2020, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X