గుడ్ న్యూస్...బెన్లింగ్ ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు బెంగళూరులో

ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా లాంచ్ చేయబడుతున్నాయి. చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపడం వల్ల కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో ఎలక్ట్రిక్ యుగం ప్రారంభమైనది చెప్పవచ్చు.

గుడ్ న్యూస్...బెన్లింగ్ ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు బెంగళూరులో

చైనా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ అయిన బెన్లింగ్ ఇప్పుడు ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. బెన్లింగ్ ఓరా ధర బెంగళూరులో 99,000 వేల రూపాయలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

గుడ్ న్యూస్...బెన్లింగ్ ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు బెంగళూరులో

ఈ బెన్లింగ్ స్కూటర్‌లో 2500 బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారు మరియు డిటాచబుల్ 72 వి / 40 ఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్నాయి. ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పరిధి గురించి మిశ్రమ సమాచారం ఉంది. ఎందుకంటే ఒక డీలర్ 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధి ఇస్తుందని, ఇంకొక డీలర్ 90 నుంచి 100 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని పేర్కొంది. ఈ కారణంగా వీటి పరిధి గురించి ఖచ్చితమైన సమాచారం లేదు.

గుడ్ న్యూస్...బెన్లింగ్ ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు బెంగళూరులో

కానీ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇది దాదాపు 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని తెలిపింది. బెన్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీపై మూడు సంవత్సరాల వారంటీ ఉంటుంది. మరియు ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు.

గుడ్ న్యూస్...బెన్లింగ్ ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు బెంగళూరులో

బెన్లింగ్ ఓరాలో (బిఎస్ఎఎస్) బ్రేక్ డౌన్ స్మార్ట్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉంది. ఇది స్కూటర్ ని రీస్టార్ట్ చేయడానికి మరియు బ్రేక్ డౌన్ అయినప్పుడు ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది. ఈ సిస్టమ్ వల్ల స్కూటర్‌ రీస్టార్ట్ చేయగలుగుతుంది మరియు తక్కువ వేగంతో ప్రయాణించగలగటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్లో బ్యాటరీని వంద శాతం వరకు ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

గుడ్ న్యూస్...బెన్లింగ్ ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు బెంగళూరులో

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి వెస్పా లాగా కనిపిస్తుంది. ఇందులో డిజైన్ ఎలిమెంట్స్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ కౌల్‌కు అనుసంధానించబడిన టర్న్ సిగ్నల్ ఇండికేటర్లు, పెద్ద ఫ్లాట్ సీట్, పెద్ద పుట్ బోర్డ్ మరియు రెట్రో లుకింగ్ టెయిల్ లైట్లు ఉన్నాయి.

గుడ్ న్యూస్...బెన్లింగ్ ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు బెంగళూరులో

భారతదేశంలో బెన్లింగ్ ఇండియా గతంలో మూడు తక్కువ స్పీడ్ కలిగిన స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది. అవి కృతి, ఐకాన్ మరియు ఫాల్కన్ స్కూటర్లు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఓరా స్కూటర్ ని హై- స్పీడ్ విభాగంలో విక్రయిస్తున్నారు.

గుడ్ న్యూస్...బెన్లింగ్ ఓరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు బెంగళూరులో

బెన్లింగ్ ఆరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు రూ. 99,000 వద్ద ప్రారంభించబడ్డాయి. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో సరసమైన ధర అని చెప్పవచ్చు. మార్కెట్లో బెన్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌ స్కూటరుకి ప్రత్యర్థిగా ఉండబోతుంది.

Most Read Articles

English summary
Benling Aura electric scooter launch price Rs 99k – On road Bangalore. Read in Telugu.
Story first published: Friday, January 24, 2020, 16:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X