దేశీయ మార్కెట్లో 70,000 లోపు లభించే 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

భారత ప్రభుత్వం ఇటీవల లాక్‌డౌన్‌ను సడలించడం ప్రారంభించడం వల్ల వాహన తయారీదారులు తమ తయారీ కర్మాగారాలతో పాటు డీలర్‌షిప్‌ల వద్ద కూడా తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు. ఈ లాక్ డౌన్ సడలింపులలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పని సరిగా సామాజిక దూరాన్ని పాటించాలని ఆదేశించారు. ఈ కారణంగా ప్రజలు బస్సులు వంటి వాటిలో ప్రయాణించడానికి కొంత సందేహిస్తున్నారు. అంతే కాకుండా చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాడానికి ఆసక్తి కనపరుస్తున్నారు.

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

దేశీయ మార్కెట్లో 70,000 రూపాయలకంటే తక్కువ ధరకాలైగిన వాహనాలను గురించి మనం ఇది వరకే తెలుసుకున్నాం. ఇప్పుడు 70,000 రూపాయల కంటే తక్కువ ధర కలిగిన టాప్ 5 స్కూటర్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.. రండి

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

1. హీరో ప్లెసర్ (ప్లస్) :

దేశీయ మార్కెట్లో హీరో ప్లెసర్ (ప్లస్) స్కూటర్ ధర రూ. 55,600 (ఎక్స్-షోరూమ్). ఇది రెట్రో డిజైన్ మరియు శక్తివంతమైన పనితీరును కలిగి ఉంటుంది. హీరో ప్లెసర్ (ప్లస్) బైక్ 110 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి శక్తి ఉత్పత్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:కవాసకి నింజా 650 బైక్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

హీరో ప్లెసర్ (ప్లస్) లో యుఎస్‌బి ఛార్జర్, ఎల్‌ఇడి బూట్ లాంప్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్‌తో కొత్త బ్యాక్‌లిట్ స్పీడోమీటర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

2. టివిఎస్ ఎన్‌టార్క్ 125 :

టివిఎస్ ఎన్‌టార్క్ 125 ధర రూ. 66,885 (ఎక్స్-షోరూమ్). టివిఎస్ ఎన్‌టార్క్ 125 అత్యంత ప్రాచుర్యం పొందిన సమర్పణలలో ఇది కూడా ఒకటి. ఈ స్కూటర్ 124.8-సిసి ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 9.1 బిహెచ్‌పి శక్తిని మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ప్రేక్షకులు లేకుండా జరగనున్న ఫార్ములా 1 రేస్, ఎందుకో తెలుసా ?

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

టివిఎస్ ఎన్‌టార్క్ 125 నావిగేషన్, కాల్స్ మరియు ఇతర ఫంక్షన్ల కోసం ఉపయోగించగల మొబైల్ ఫోన్‌ల కోసం అండర్-సీట్ యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

3. మాస్ట్రో ఎడ్జ్ :

భారత మార్కెట్లో మాస్ట్రో ఎడ్జ్ ధర రూ. 69,250 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). మాస్ట్రో ఎడ్జ్ 125 బిఎస్-6 125 సిసి బిఎస్-వి కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో ‘ఎక్స్‌సెన్స్ టెక్నాలజీ' తో వస్తుంది. ఇది 7000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి శక్తి ఉత్పత్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద టార్క్ 10.4 ఎన్‌ఎమ్‌ను అందిస్తుంది.

MOST READ:మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

4. టివిఎస్ జుపిటర్ :

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో చెప్పుకోదగినది ఈ టివిఎస్ జుపిటర్. దీని ధర రూ. 61,449 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

ఈ స్కూటర్ 109.7 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్ ద్వారా 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.4 హెచ్‌పి మరియు 8.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లో ఉన్న కొత్త ఫీచర్స్ విషయానికి వస్తే, దీనికి USB ఛార్జర్, ముందు భాగంలో స్టోరేజ్ ప్లేస్ మరియు లేతరంగు గల విజర్ వంటివి ఇందులో ఉంటాయి.

MOST READ:లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చీప్ అండ్ బెస్ట్ స్కూటర్స్

5. హోండా యాక్టివా 6 జి :

హోండా యాక్టివా 6 జి భారతదేశంలో స్కూటర్ విభాగంలో గొప్ప విజయం సాధించిన స్కూటర్. ఈ మోటారుసైకిల్ ప్రతి నెలా దాదాపు 2 లక్షల యూనిట్ల అమ్మకాలను కలిగి ఉంది. ఈ హోండా యాక్టివా 6 జి ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 64,464. హోండా యాక్టివా 6 జి స్కూటర్ 110-సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్యూయెల్ ఇంజెక్షన్‌తో వస్తుంది.

Most Read Articles

English summary
Top 5 Scooters to Buy Under Rs 70,000 in India: Honda Activa, TVS Ntorq and More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X