భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే; నెంబర్ వన్ స్థానంలో 'హీరో స్ప్లెండర్'!

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అందిస్తున్న 'హీరో స్ప్లెండర్ ప్లస్' మరోసారి తన అగ్రస్థాన్ని నిలుపుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో (2019-2020)లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా నిలిచింది. ఈ జాబితాలోని టాప్-5 స్థానాల్లో హీరో మోటోకార్ప్‌కి చెందిన మూడు మోడళ్లు ఉన్నాయి.

భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే; నెంబర్ వన్ స్థానంలో 'హీరో స్ప్లెండర్'!

గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిళ్ల జాబితాలో మొదటి స్థానంలో హీరో స్ప్లెండర్ ప్లస్, రెండవ స్థానంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ నాల్గవ స్థానంలో హీరో గ్లామర్ మోడళ్లు నిలిచాయి.

భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే; నెంబర్ వన్ స్థానంలో 'హీరో స్ప్లెండర్'!

హీరో మోటోకార్ప్ అందిస్తున్న స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 20.63 లక్షల యూనిట్ల అత్యధిక అమ్మకాలను నమోదు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2018-19)తో పోల్చుకుంటే ఈ మోడల్ అమ్మకాలు 31 శాతం క్షీణించిన, స్ప్లెండర్ ప్లస్ మాత్రం తన అగ్ర స్థానాన్ని కోల్పోలేదు. ఆ సమయంలో కంపెనీ 30 లక్షల యూనిట్లకు పైగా స్ప్లెండర్ ప్లస్ వాహనాలను విక్రయిచింది.

MOST READ: లగ్జరీ బైక్‌పై కనిపించిన భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే; నెంబర్ వన్ స్థానంలో 'హీరో స్ప్లెండర్'!

హీరో స్ప్లెండర్ ప్లస్‌ తర్వాతి స్థానంలో మరో హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిల్ హెచ్‌ఎఫ్ డీలక్స్ ఉంది. హీరో నుంచి లభిస్తున్న మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మోటార్‌సైకిల్ ఇది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, అమ్మకాల పరంగా మాత్రం చాలా మెరుగ్గా ఉంది, ఇది 2020 ఆర్థిక సంవత్సరంలో కేవలం 5 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సమయంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 20.51 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, అంతకు ముందు ఇదే సమయంలో 21.60 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే; నెంబర్ వన్ స్థానంలో 'హీరో స్ప్లెండర్'!

ఈ జాబితాలో హోండా సిబి షైన్ మూడవ స్థానంలో ఉంది. హోండా అందిస్తున్న ప్రీమియం 125సీసీ బైక్ ఇది. సిబి షైన్ 2020 ఆర్థిక సంవత్సరంలో 9.48 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగలిగింది, అంతకు ముందు ఇదే సమయంతో పోల్చితే అమ్మకాలు 4 శాతం తగ్గాయి. హోండా 2019 ఆర్థిక సంవత్సరంలో 9.90 లక్షల సిబి షైన్ వాహనాలు అమ్ముడయ్యాయి.

MOST READ: బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

Rank Motorcycle FY 2020 FY 2019 Growth (%)
1 Hero Splendor Plus 20,63,148 30,05,620 -31.36
2 Hero HF Deluxe 20,50,974 21,68,740 -5.43
3 Honda CB Shine 9,48,384 9,90,315 -4.23
4 Hero Glamour 6,02,623 7,55,027 -20.19
5 Bajaj Platina 5,78,237 6,26,781 -7.74
భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే; నెంబర్ వన్ స్థానంలో 'హీరో స్ప్లెండర్'!

ఈ జాబితాలో నాల్గన, ఐదవ స్థానాల్లో వరుసగా హీరో గ్లామర్, బజాజ్ ప్లాటినా మోటార్‌సైకిళ్ళు ఉన్నాయి. హీరో గ్లామర్ 2019 ఆర్థిక సంవత్సరంలో 7.55 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, 2020 ఆర్థిక సంవత్సరంలో 6.02 లక్షల యూనిట్లను విక్రయించి 20 శాతం క్షీణతను నమోదు చేసింది.

భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే; నెంబర్ వన్ స్థానంలో 'హీరో స్ప్లెండర్'!

ఇకపోతే బజాజ్ ప్లాటినా 2020 ఆర్థిక సంవత్సరంలో 5.7 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.7 శాతం అమ్మకాలు తగ్గాయి. ఈ సమయంలో బజాజ్ ఆటో 6.26 లక్షల యూనిట్ల ప్లాటినా వాహనాలను విక్రయించింది.

Source: Rushlane.com

Most Read Articles

English summary
Hero Splendor Plus has registered the highest sales to become the best-selling bike in India in the previous financial year (FY 2019-2020). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X