ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

ముంబైకి చెందిన ప్రముఖ ఎనర్జీ కంపెనీ సంస్థ ఆర్ఆర్ గ్లోబల్ భారత ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇందులో భాగంగా ఆర్ఆర్ గ్లోబల్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ బ్రాండ్ 'బిగాస్' (BGauss) ఇప్పుడు భారత్ కోసం రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది.

ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

బిగాస్ ఇండియా మార్కెట్ కోసం తన మొదటి రెండు ఉత్పత్తులను ఐదు వేరియంట్లలో ఆవిష్కరించింది. ఇవి లో-స్పీడ్ మరియు హై-స్పీడ్ విభాగాలలో ఆగస్టు మొదటి వారం నుండి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.

ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

ఈ రెండు ప్రీమియం రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను బిగాస్ ఏ2 (BGauss A2) మరియు బిగాస్ బి8 (BGauss B8) అని పిలవనున్నారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని, అక్కడి ప్రజల జీవనశైలిని పెంచడానికి మరియు పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలుగా ఈ స్కూటర్లను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్లూయిడిక్ డిజైన్‌తో నడపటానికి సులువుగా, సౌకర్యంగా ఉండేలా, తక్కువ నిర్వహణ వ్యయంతో, అలాగే గొప్ప పవర్ మరియు క్విక్ ఛార్జింగ్, ఐఓటి వంటి అధునాత టెక్నాలజీతో రానున్నాయి.

MOST READ: బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

భారత మార్కెట్ కోసం రెండు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా బిగాస్ డైరెక్టర్, ఆర్ఆర్ గ్లోబల్ ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కబ్రా మాట్లాడుతూ, "భారత మార్కెట్ అభివృద్ధి చెందింది మరియు వినియోగదారులు లేటెస్ట్ టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లతో కూడిన కొత్త ఆవిష్కరణల కోసం ఎదురుచూస్తున్నారు. బిగాస్ బ్రాండ్ కింద మా మొదటి శ్రేణి ఉత్పత్తులను పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో మేము చాలా సానుకూలంగా ఉన్నాము. మేము కస్టమర్ అంచనాలను చేరుకోవటమే కాకుండా అన్ని వర్గాల కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఒకేసారి అమ్మకాలు మరియు సర్వీస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంపై కూడా దృష్టి పెట్టామ"ని అన్నారు.

ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

తొలగించదగిన బ్యాటరీ, యాంటీ-తెఫ్ట్ అలారం, యాంటీ-తెఫ్ట్ మోటర్ లాకింగ్, ఎల్‌ఇడి ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, మల్టీ-కలర్ డిజిటల్ డిస్‌ప్లే, డిఆర్‌ఎల్, కీలెస్ స్టార్ట్, ఫైండ్ యువర్ స్కూటర్, సెంట్రలైజ్డ్ సీట్ లాక్, యుఎస్‌బి ఛార్జింగ్, రివర్స్ అసిస్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, 3 రైడింగ్ మోడ్స్ (లో, మీడియం, హై) వంటి ఫీచర్లతో బిగాస్ స్కూటర్ల లభ్యం కానున్నాయి. ఈ స్కూటర్లలోని ఐఓటి ఫీచర్ టెక్నాలజీ‌తో ప్రతి స్కూటర్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్‌తో లభిస్తాయి.

MOST READ: దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్

ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

బిగాస్ బి8 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఐ టెక్నాలజీతో వస్తుంది. ఇది లిథియం-అయాన్ మరియు లీడ్-యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులోని అన్ని వేరియంట్లు కూడా లో, మీడియం, హై అనే మూడు రైడింగ్ మోడ్‌లను సపోర్ట్ చేయనున్నాయి. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో నడుస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై లీడ్-యాసిడ్ వేరియంట్ 78 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది, లిథియం-అయాన్ మరియు ఎల్ఐ టెక్నాలజీ వేరియంట్లు 70 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తాయి.

ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

లీడ్-యాసిడ్ వేరియంట్ బ్యాటరీని 0-100 శాతం చార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఇందులోని లిథియం-అయాన్ మరియు ఎల్ఐ టెక్నాలజీ వేరియంట్లు తొలగించగల బ్యాటరీతో వస్తాయి. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఈ బ్యాటరీలను గరిష్టంగా మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. బిగాస్ బి8 లిథియం-అయాన్ బ్లూటూత్ ఫీచర్‌లో లభ్యం కానుంది, ఇది బ్లూ, వైట్, రెడ్, గ్రే కలర్లలో లభిస్తుంది.

MOST READ: భారత్ & చైనా వివాదం : ఆలస్యమైన హైమా బర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్

ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

ఇకపోతే బిగాస్ ఏ2 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది కూడా లీడ్-యాసిడ్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీలతో లభ్యం కానుంది. ఈ రెండు వేరియంట్లలో కూడా మూడు రైడింగ్ మోడ్స్ (లో, మీడియం హై) ఉంటాయి. ఈ మోడ్స్‌లో స్కూటర్ కనిష్టంగా టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ నుండి గరిష్టంగా 110 కిమీ వరకూ ఉంటుంది. లీడ్-యాసిడ్ బ్యాటరీని 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 7-8 గంటలు పడుతుంది, లిథియం-అయాన్ తొలగించగల బ్యాటరీతో వస్తుంది మరియు దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇది బ్లూ, వైట్, గ్రే కలర్లలో లభిస్తుంది.

ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత్‌లో క్రమక్రంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రత్యేకించి బిగాస్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా స్వదేశీయ కంపెనీ. ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశీయ వస్తువులు కొనడం కూడా అవసరం కాబట్టి ఈ బ్రాండ్ సరసమైన ధరకే తమ ఉత్పత్తులను ఆఫర్ చేయగలిగినట్లయితే, మార్కెట్లో అతి తక్కువ సమయంలో మంచి విజయాలను నమోదు చేసుకునే ఆస్కారం ఉంటుంది. బిగాస్ ఆవిష్కరించిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

Most Read Articles

English summary
BGauss is a new brand of RR Global has unveiled its first two products for the India market. However, all the five variants straddling across low speed and high-speed segments will start sales from the first week of August. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more