బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

ముంబైకి కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎనర్జీ కంపెనీ ఆర్ఆర్ గ్లోబల్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగం బిగాస్, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ ఇప్పుడు ఆకర్షనీయమైన ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందు కోసం కంపెనీ మనీట్యాప్ అనే ఆర్థిక సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

ఈ ఒప్పందం ద్వారా జీరో పర్సెంట్ వడ్డీ రేటుకో పారదర్శక ఈఎమ్ఐ ఫైనాన్స్ స్కీమ్‌ను బిగాస్-మనీట్యాప్ కంపెనీలు అందిస్తున్నాయి. కంపెనీ విడుదల చేసిన బి8 ఎల్ఐ టెక్నాలజీ, లిథియం-అయాన్ మరియు లీడ్-యాసిడ్ వేరియంట్లు అలాగే ఏ2 లీడ్-యాసిడ్ మరియు లిథియం-అయాన్ వేరియంట్ల కొనుగోలు కోసం ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

బిగాస్ ఇప్పటికే ఈ మోడళ్ల కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్‌లు చేసుకోవాలనుకునే కస్టమర్లు ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.bgauss.com ను సందర్శించి, రూ.3,000 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

ఈ రెండు-ప్రీమియం శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను (బిగాస్ బి8, బిగాస్ ఎ2) ఆగస్ట్ నెలలోనే పూణే, నేవీ ముంబై, చెన్నై, హైదరాబాద్ మరియు బెంగళూరుల నగరాల్లో డెలివరీ చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్లూయిడిక్ డిజైన్‌తో నడపటానికి సులువుగా, సౌకర్యంగా ఉండేలా, తక్కువ నిర్వహణ వ్యయం, అద్భుతమైన పవర్ మరియు క్విక్ ఛార్జింగ్, ఐఓటి వంటి అధునాత టెక్నాలజీతో వీటిని తయారు చేశారు.

బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

తొలగించదగిన బ్యాటరీ, యాంటీ-తెఫ్ట్ అలారం, యాంటీ-తెఫ్ట్ మోటర్ లాకింగ్, ఎల్‌ఇడి ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, మల్టీ-కలర్ డిజిటల్ డిస్‌ప్లే, డిఆర్‌ఎల్, కీలెస్ స్టార్ట్, ఫైండ్ యువర్ స్కూటర్, సెంట్రలైజ్డ్ సీట్ లాక్, యుఎస్‌బి ఛార్జింగ్, రివర్స్ అసిస్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, 3 రైడింగ్ మోడ్స్ (లో, మీడియం, హై) వంటి ఫీచర్లతో బిగాస్ స్కూటర్ల లభ్యం కానున్నాయి. ఈ స్కూటర్లలోని ఐఓటి ఫీచర్ టెక్నాలజీ‌తో ప్రతి స్కూటర్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్‌తో లభిస్తాయి.

బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

బిగాస్ బి8 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఐ టెక్నాలజీతో వస్తుంది. ఇది లిథియం-అయాన్ మరియు లీడ్-యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులోని అన్ని వేరియంట్లు కూడా లో, మీడియం, హై అనే మూడు రైడింగ్ మోడ్‌లను సపోర్ట్ చేయనున్నాయి. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో నడుస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై లీడ్-యాసిడ్ వేరియంట్ 78 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది, లిథియం-అయాన్ మరియు ఎల్ఐ టెక్నాలజీ వేరియంట్లు 70 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తాయి.

బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

లీడ్-యాసిడ్ వేరియంట్ బ్యాటరీని 0-100 శాతం చార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఇందులోని లిథియం-అయాన్ మరియు ఎల్ఐ టెక్నాలజీ వేరియంట్లు తొలగించగల బ్యాటరీతో వస్తాయి. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఈ బ్యాటరీలను గరిష్టంగా మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. బిగాస్ బి8 లిథియం-అయాన్ బ్లూటూత్ ఫీచర్‌లో లభ్యం కానుంది, ఇది బ్లూ, వైట్, రెడ్, గ్రే కలర్లలో లభిస్తుంది.

బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

ఇకపోతే బిగాస్ ఏ2 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది కూడా లీడ్-యాసిడ్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీలతో లభ్యం కానుంది. ఈ రెండు వేరియంట్లలో కూడా మూడు రైడింగ్ మోడ్స్ (లో, మీడియం హై) ఉంటాయి. ఈ మోడ్స్‌లో స్కూటర్ కనిష్టంగా టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ నుండి గరిష్టంగా 110 కిమీ వరకూ ఉంటుంది. లీడ్-యాసిడ్ బ్యాటరీని 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 7-8 గంటలు పడుతుంది, లిథియం-అయాన్ తొలగించగల బ్యాటరీతో వస్తుంది మరియు దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇది బ్లూ, వైట్, గ్రే కలర్లలో లభిస్తుంది.

దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇలా ఉన్నాయి:

* బి8 - లీడ్-యాసిడ్ ధర - రూ.62,999

* బి8 - లిథియం-అయాన్ ధర - రూ.82,999

* బి8 - ఎల్ఐ-టెక్ ధర - రూ.88,999

* ఎ2 - లీడ్-యాసిడ్ ధర - రూ.52,499

* ఎ2 - లిథియం అయాన్ ధర - రూ.67,999

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

బిగాస్ స్కూటర్ల కోసం ఫైనాన్సింగ్ ఆఫర్స్; మనీట్యాప్‌తో ఒప్పందం

బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అందిస్తున్న జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ స్కీమ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇటీవలి కాలంలో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమక్రంగా పెరుగుతోంది. బిగాస్ విడుదల చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు అద్భుతంగా కనిపిస్తాయి, భవిష్యత్ రవాణాను ఉద్దేశించి తయారు చేసిన ఈ వాహనాలు మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. మనీటాప్ అందిస్తున్న ఆకర్షనీయమైన ఈఎమ్ఐ స్కీమ్‌తో కస్టమర్లకు ఇప్పుడు తమ అభిమాన బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయటం సులువుగా మారుతుంది.

Most Read Articles

English summary
BGauss - a new brand of RR Global has announced its partnership with MoneyTap. Through this collaboration, customers who are keen on purchasing a BGAUSS electric scooter will now be able to afford a transparent EMI finance scheme at 0 percent interest rate. Read in Telugu.
Story first published: Sunday, August 16, 2020, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X