కరోనా వైరస్ వ్యాప్తి భయంతో పెరిగిన టూవీలర్ డిమాండ్; సప్లయ్ కొరత!

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి భయంతో ఇప్పుడు ప్రజలంతా వ్యక్తిగత ప్రయాణాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న నేపథ్యంలో దేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరింగింది. గడచిన మే 2020లో కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో టూవీలర్ కంపెనీ తమ ఫ్యాక్టరీలలో తిరిగి వాహనాల ఉత్పత్తిని ప్రారంభించాయి.

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో పెరిగిన టూవీలర్ డిమాండ్; సప్లయ్ కొరత!

లాక్‌డౌన్‌కి ముందు సమయంతో పోల్చుకుంటే ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు గిరాకీ బాగా పెరిగింది. ప్రజా రవాణాలో వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుందనే భయం ప్రజల్లో ఎక్కువవుతున్న నేపథ్యంలో, తమ స్వంత వాహనాల్లో ప్రయాణించేందుకే వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా ఈ డిమాండ్ జోరందుకుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఈటి ఆటో ఓ కథనంలో పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో పెరిగిన టూవీలర్ డిమాండ్; సప్లయ్ కొరత!

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగానే వాహనాలను సరఫరా చేసేందుకు ద్విచక్ర వాహన తయారీదారులు కూడా తమ ప్లాంట్‌లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌కి ముందుతో పోల్చుకుంటే కొన్ని కంపెనీలు ఇప్పుడు 70 శాతం అదనంగా వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

MOST READ: సరికొత్త 2020 మహీంద్రా థార్ విడుదల ఖరారు; వివరాలు

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో పెరిగిన టూవీలర్ డిమాండ్; సప్లయ్ కొరత!

టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో వంటి దేశీయ కంపెనీల వాహనాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. వాహనాల ఉత్పత్తి పెంపుకు తగినట్లు విడిభాగాల సరఫరా జరిగేందుకు గాను ఆయా కంపెనీలు ఇప్పుడు విడిభాగాల భాగస్వాములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జూన్ నెలలో మొత్తం 7.5 లక్షల నుండి 10 లక్షల మధ్యలో ద్విచక్ర వాహనాలను తయారు చేయవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో పెరిగిన టూవీలర్ డిమాండ్; సప్లయ్ కొరత!

ఈ విషయంపై బజాజ్ ఆటో ఈడి రాకేష్ శర్మ స్పందిస్తూ.. జూన్ నెలలో ఇప్పటి వరకూ 80 శాతం ఉత్పత్తిని చేరుకున్నామని, సెకండ్ హాఫ్‌లో ఇది 90 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. లాక్‌డౌన్ తర్వాత ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగిందని, ఈ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేసేందుకు సప్లయర్లతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.

MOST READ: సైకిల్ ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో పెరిగిన టూవీలర్ డిమాండ్; సప్లయ్ కొరత!

ప్రత్యేకించి గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుండి ఈ డిమాండ్ ఎక్కువగా ఉంటోదని శర్మ చెప్పారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో, మెట్రో నగరాల కన్నా ముందుగా అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే ముందుగా డీలర్‌షిప్ కేంద్రాలను తెరవడంతో ఆయా ప్రాంతాల నుండి డిమాండ్ ఎక్కువైందని, ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందని శర్మ వివరించారు.

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో పెరిగిన టూవీలర్ డిమాండ్; సప్లయ్ కొరత!

టూవీలర్లకు డిమాండ్ విపరీతంగా పెరగటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మనం ఇది వరకటి కథనాల్లో చెప్పుకున్నట్లుగానే కోవిడ్-19 పరిస్థితులు దేశంలో అనేక మార్పులకు నాంది వేశాయి. ప్రజల్లో వైరస్ వ్యాప్తి భయం రోజురోజుకీ అధికమవుతోంది. దేశంలో కేసులు కూడా నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో, కాస్తంత భారమైన స్వంత వాహనాల్లోనే సురక్షితంగా ప్రయాణించాలని కస్టమర్లు భావిస్తున్నారు. కస్టమర్ల ఆలోచనలో వచ్చిన ఈ మార్పే వాహనాల డిమాండ్ పెరుగుదలకు కారణమయ్యింది.

Most Read Articles

English summary
Two-wheeler manufacturers resumed production operations, starting from mid-May 2020 after the government announced the easing of lockdown regulations in the country. Most manufacturers have expectedly registered a massive decline in year-on-year sales during the month of May 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X