అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

జర్మనీకి చెందిన వాహన తయారీ దారు అయిన బిఎమ్‌డబ్ల్యూ సంస్థ కార్లను మాత్రమే కాకుండా, మోటార్ సైకిల్స్ ని కూడా లాంచ్ చేసింది. బిఎమ్‌డబ్ల్యూ సంస్థనుండి విడుదలైన కార్లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అదే విధంగా ఈ మోటార్ సైకిల్స్ కి కూడా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపుగా 10 శాతం వృద్ధిని పొందుతుందు. ఈ మోటార్ సైకిల్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

జర్మనీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ భారతదేశంలో తన ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగాలలో పది శాతం వృద్ధిని ప్రకటించింది. 2019 లో కంపెనీ 2,403 మోటార్‌సైకిళ్లను వినియోగదారులకు పంపిణీ చేసింది. ఇది సంవత్సరానికి పది శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది.

అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

వీటిని గురించి బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రుద్రతేజ్ సింగ్ మాట్లాడుతూ 2019 బిఎమ్‌డబ్ల్యూకి చాలా మంచి సంవత్సరంగా ముగిసింది అన్నారు.

అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

మోట్రాడ్ ప్రపంచం నుంచి వచ్చే కొత్త బ్రాండ్ ని పొందాలనుకునే అభిమానుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడంలో మేము వారి అవసరాలను తీరుస్తున్నాము. కొత్త లాంచ్‌లను ప్రారంభించి ఔత్సాహికులను ఉత్తేజపరుస్తూ ఉన్నాము. మోట్రాడ్ యొక్క కమ్యూనిటీని మరింత దగ్గరగా పెంచుతున్నాము. ఈ మోటార్ వాహనాలు 'జీవితాన్ని ఒక రైడ్ చేయండి' అనే నినాదంతో మరింతగా వ్యాపిస్తున్నాయి.

అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

అమ్మకాలలో 10 శాతం వృద్ధిని పెంచిన మోడల్లు జి 310 ఆర్ మరియు జి 310 జిఎస్ లు. ఈ వాహనాలు వార్షిక అమ్మకాలలో 85 శాతానికి పైగా వృద్ధిని పెంచాయి. ప్రస్తుతం ఈ కంపెనీలో ఆర్ 1250 GS, ఆర్ 1250 GSA, F750 GS మరియు F850 GS వంటి వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న ఇతర మోడళ్లుగా చెప్పవచ్చు.

అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

ఇప్పుడు సంస్థ యొక్క బెస్ట్ సెల్లెర్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి బిఎమ్‌డబ్ల్యూ 'జి 310 ఆర్' రెండు బిఎమ్‌డబ్ల్యూ 'జి 310 జిఎస్'. ఈ వాహనాలు రెండూ కూడా లిక్విడ్ కూల్డ్ 313 సిసి ఇంజిన్లతో పని చేస్తాయి. ఇవి 33.6 బిహెచ్‌పి శక్తి మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటుంది.

అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

బిఎమ్‌డబ్ల్యూ మోటారుసైకిల్ ధర దాదాపు రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.49 లక్షల మధ్య ఉంటుంది. కంపెనీ మొత్తం శ్రేణి మోటార్‌సైకిళ్ల ధర రూ .2.99 లక్షల నుంచి రూ. 29.30 లక్షల మధ్య ఉంటుంది. ఈ వాహనాలు బాగా ఖరీదైనవిగానే చెప్పాలి.

అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియా కూడా 2019 లో పలు మోడళ్లను విడుదల చేసింది. ఒక్క సంవత్సరంలోనే కంపెనీ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్, బిఎమ్‌డబ్ల్యూ 1250 ఆర్‌టి, మరియు సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 850 జిఎస్ వంటి అడ్వెంచర్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.

అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్!

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్స్ పది శాతం పెరుగుదల గురించి ఆలోచనలు:

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు కోరోకునే ఒక ఉత్తమ వాహనంగా చెప్పవచ్చు. ఈ వాహనాలు వినియోగ దారునికి అనుకూలంగా ఉంటాయి. బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన ఈ జంట 310 బైకులు మార్కెట్లోకి విడుదల చేయడం అనేది ఒక మంచి నిర్ణయం. బిఎమ్‌డబ్ల్యూ సరసమైన మోటార్ సైకిల్స్ ని లాంచ్ చేస్తుందని వినియోగ దారులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, January 10, 2020, 11:47 [IST]
English summary
BMW Motorrad Motorcycle Sales Registers 10 Percent Growth In 2019: Details- Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+