విడుదలకు సిద్ధమైన బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్ - జి310ఆర్!

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ గడచిన 2018లో తొలిసారిగా తమ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లయిన జి310ఆర్ మరియు జి310జిఎస్ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి, ఈ రెండు మోటార్‌సైకిళ్లకు మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. అయితే, బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా, కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లను ఇంకా అప్‌డేట్ చేయలేదు. ఈ నెల ఆరంభంలో, జి310ఆర్ మరియు జి310జిఎస్ రెండింటి టెస్టింగ్ చేస్తుండగా, కెమెరాకు చిక్కిన సంగతి తెలిసినదే.

విడుదలకు సిద్ధమైన బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్ - జి310ఆర్!

అయితే, తాజాగా ఇండియన్ఆటోస్‌బ్లాగ్ వచ్చిన చిత్రాల ప్రకారం, జి310ఆర్ బిఎస్6 ఈ నెలలో రెండవ సారి కెమెరా కంట పడింది. చిత్రాలలో చూసినట్లుగా, ఈ మోటార్‌సైకిల్‌ను క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, అతి త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టెస్టింగ్ వాహన మ్యాట్ బ్లాక్ పెయింట్‌లో ఫినిష్ చేయబడి ఉంది. మోటార్‌సైకిల్ ఫ్రేమ్‌ని మాత్రం ఎరుపు రంగులో పెయింట్ చేయబడి ఉంది.

విడుదలకు సిద్ధమైన బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్ - జి310ఆర్!

ఈ ఏడాది ఆరంభంలో యూరప్ మార్కెట్లో విడుదలైన మోడల్ మాదిరిగానే బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎల్‌ఈడి లైటింగ్‌తో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త ఎక్స్‌టెన్షన్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్‌తో మునుపటి బిఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే వాటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇందులోని డిఆర్ఎల్ సెటప్ బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900ఆర్ మోడల్‌ను తలపిస్తుంది.

MOST READ:లాక్‌డౌన్‌లో కారు కడిగిన ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా [వీడియో]

విడుదలకు సిద్ధమైన బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్ - జి310ఆర్!

ఇంజన్ విషయానికి వస్తే, బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 312 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌నే బిఎస్6 వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నారు. బిఎస్4లోని ఇదే ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 34 బిహెచ్‌పి శక్తిని, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ అప్‌డేటెడ్ ఇంజన్ కాకుండా, బిఎస్6 మోడళ్లలో స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

విడుదలకు సిద్ధమైన బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్ - జి310ఆర్!

బిఎస్6 మోడళ్లలో చేసిన పూర్తి మార్పులు ఇంకా పూర్తిగా వెల్లడి కాకపోయినప్పటికీ, జి310ఆర్ మునపటి వెర్షన్‌తో పోల్చుకుంటే మైనర్ డిజైన్ అప్‌గ్రేడ్స్‌తో రానున్నట్లు తెలుస్తోంది. కానీ, ఓవరాల్ డిజైన్ మాత్రం మారదని తెలస్తోంది. ఈ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లలో బిఎమ్‌డబ్ల్యూ రీడిజైన్ చేసిన బిఎస్6 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ఇంజన్‌ను ఉపయోగించుకోవచ్చని సమాచారం.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

విడుదలకు సిద్ధమైన బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్ - జి310ఆర్!

టీవీఎస్ నుండి గ్రహించే ఈ అప్‌డేట్ చేయబడిన ఇంజన్ తక్కువ కంపనాన్ని (వైబ్రేషన్)ని కలిగి ఉంటుంది. బిఎస్4 మోడళ్లలో ఈ వైబ్రేషన్ సమస్య ఎక్కువగా ఉండేది. ఏదేమైనా, ఈ కొత్త ఇంజన్ మునుపటిలా అదే రకమైన శక్తిని మరియు టార్క్ విలువలను ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది.

విడుదలకు సిద్ధమైన బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్ - జి310ఆర్!

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్‌ మోటార్‌సైకిల్ టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్‌లో భాగం కావాలనుకునే వినియోగదారుల కోసం బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ ఉత్తమమైన ఆప్షన్. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ఈ సెగ్మెంట్లోని కెటిఎమ్ డ్యూక్ 390, హోండా సిబి 300ఆర్, టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310, బజాజ్ డొమినార్ 400 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: Indianautosblog

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కార్ డ్రైవ్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

Most Read Articles

English summary
BMW Motorrad launched its most affordable motorcycles in India: the BMW G310 R and G310 GS back in 2018. Since then, both the motorcycles have got a decent response in the market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X