Just In
- 11 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 12 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 12 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 14 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్స్ కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల
జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరెండు ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లు జి 310 ఆర్, జి 310 జిఎస్ మోడళ్లలో కంపెనీ బిఎస్6 వెర్షన్లను అతి త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఈ మోడళ్ల కోసం కంపెనీ డీలర్లు అనధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించినట్లు సమాచారం.

సుమారు రూ.50,000 బుకింగ్ అడ్వాన్స్ అమౌంట్‌తో కస్టమర్లు వీటిని బుక్ చేసుకోవచ్చు. బైక్‌దేఖో పేర్కొన్న నివేదిక ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఈ రెండు మోడళ్లు భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా.. ఇప్పటికే బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ రెండు మోడళ్లను భారత రోడ్లపై పరీక్షిస్తుండగా అనేక సార్లు క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సంగతి తెలిసినదే.

ఇదివరకు భారత మార్కెట్లో విక్రయించిన బిఎస్4 బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ మోడళ్లను వరుసగా రూ.2.99 లక్షలు మరియు రూ.3.49 లక్షలకు విక్రయించే వారు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త బిఎస్6 మోడళ్ల ధర రూ.30,000 వరకూ తగ్గొచ్చని తెలుస్తోంది.
MOST READ:కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

ఈ ఏడాది ఆరంభంలో యూరప్ మార్కెట్లో విడుదలైన మోడళ్ల మాదిరిగానే ఈ రెండు కొత్త మోడళ్లు కూడా సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఎల్‌ఈడి లైటింగ్‌తో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త ఎక్స్‌టెన్షన్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్‌తో మునుపటి బిఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే వాటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపించనున్నాయి.

ఓవరాల్‌గా గమనిస్తే, మాత్రం మునపటి వెర్షన్లకు త్వరలో విడుదల కాబోయే బిఎస్ మోడళ్లకు పెద్ద వ్యత్యాసాలు లేకపోవచ్చని తెలుస్తోంది. ఈ రెండు మోటార్ సైకిళ్ళలో బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్‌నే అప్‌గ్రేడ్ చేసి బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా మార్చనున్నారు. ఈ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లలో బిఎమ్‌డబ్ల్యూ పునర్నిర్మించిన బిఎస్6 అపాచీ ఆర్ఆర్ 310 ఇంజన్‌ను ఉపయోగించుకోవచ్చని సమాచారం.
MOST READ:ఫారం 20 సవరణకు నాయకత్వం వహించనున్న కేంద్ర ప్రభుత్వం

బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 312 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 34 బిహెచ్‌పి శక్తిని, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ అప్‌డేటెడ్ ఇంజన్ కాకుండా, బిఎస్6 మోడళ్లలో స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేయనున్నారు.

ఈ రెండు జర్మన్ మోటార్‌సైకిళ్ళలో ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న (అప్ సైడ్ డౌన్ - యూఎస్‌డి) ఫోర్కులు, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ కలిగి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు చివర్లలో డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.
జి 310 ఆర్ రోడ్ మరియు ట్రాక్ ఉపయోగం కోసం తయారు చేసిన పెర్ఫార్మెన్స్ టైర్లతో వస్తుంది, కాగా జి 310 జిఎస్ డ్యూయెల్ పర్పస్ టైర్లను కలిగి ఉండి, ఇది ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ ఈ సెగ్మెంట్లోని కెటిఎమ్ డ్యూక్ 390, హోండా సిబి 300ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇకపోతే బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ ప్రధానంగా రాయల్ ఎన్‌ఫైల్డ్ హిమాలయాన్ మోడల్‌కి పోటీగా నిలుస్తుంది.
MOST READ:మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఒకప్పుడు బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిళ్లు అత్యధిక పవర్ కలిగిన ఇంజన్‌తో, ఎంతో ప్రీమియం ధరతో లభించేవి. కానీ ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ రాకతో సాధారణ కస్టమర్లకు సైతం ఇవి అందుబాటులోకి వచ్చినట్లు అయింది. తక్కువ ధరలో బిఎమ్‌డబ్ల్యూ బైక్స్ కోరుకునే వారికి ఇవి మంచి ఆప్షన్‌గా ఉంటాయి.