Just In
Don't Miss
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- News
అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు
- Movies
‘ఢీ’లో అలాంటి వ్యవహారాలా?.. కంటెస్టెంట్లతో మాస్టర్ల అఫైర్స్.. బయటపెట్టేసిన సుమ
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎమ్‌డబ్ల్యూ బడ్జెట్ బైక్స్ వస్తున్నాయ్ - స్పై వీడియో, ఫుల్ డిటేల్స్
జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ భారత మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండు ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లు 310 ఆర్, జి 310 జిఎస్ మోడళ్లను ఇంకా బిఎస్6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంకా అప్‌డేట్ చేయలేదు. అయితే కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రెండు మోడళ్లు అప్‌డేట్ అవుతాయని, ఈ ఏడాదిలోనే ఎప్పుడైనా దేశీయ మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది.

భారత మార్కెట్లో విడుదల కావటానికి ముందే, ఓ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఈ రెండు బిఎస్6 మోడళ్లు టెస్టింగ్ చేస్తుండా ఓ నెటిజెన్ తన కెమెరాలో చిత్రీకరించాడు. ఈ వీడియోలో ఉత్పత్తి సిద్ధంగా ఉన్న జి 310 ఆర్, జి 310 జిఎస్ మోడళ్లను చూడొచ్చు.
ఈ ఏడాది ఆరంభంలో యూరప్ మార్కెట్లో విడుదలైన మోడళ్ల మాదిరిగానే ఈ రెండు కొత్త మోడళ్లు కూడా సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఎల్‌ఈడి లైటింగ్‌తో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త ఎక్స్‌టెన్షన్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్‌తో మునుపటి బిఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే వాటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తాయి.
MOST READ:వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

బిఎస్6 మోడళ్లలో చేసిన పూర్తి మార్పులు ఇంకా పూర్తిగా వెల్లడి కాకపోయినప్పటికీ, జి 310 ఆర్ మరియు జి 310 జిఎస్ మోడళ్లు మైనర్ డిజైన్ అప్‌గ్రేడ్స్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా గమనిస్తే, మాత్రం మునపటి వెర్షన్లకు త్వరలో విడుదల కాబోయే బిఎస్ మోడళ్లకు పెద్ద వ్యత్యాసాలు లేకపోవచ్చని తెలుస్తోంది.

ఈ రెండు మోటార్ సైకిళ్ళలో బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్‌నే అప్‌గ్రేడ్ చేసి బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా మార్చనున్నారు. ఈ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లలో బిఎమ్‌డబ్ల్యూ పునర్నిర్మించిన బిఎస్6 అపాచీ ఆర్ఆర్ 310 ఇంజిన్‌ను ఉపయోగించుకోవచ్చని సమాచారం.
MOST READ:51 సంవత్సరాల వయసులోనూ సైకిల్ తొక్కుతున్న పోలీస్ కానిస్టేబుల్, కారణం ఏంటో తెలుసా ?

టీవీఎస్ నుండి గ్రహించే ఈ అప్‌డేట్ చేయబడిన ఇంజన్ తక్కువ కంపనాన్ని (వైబ్రేషన్)ని కలిగి ఉంటుంది. బిఎస్4 మోడళ్లలో ఈ వైబ్రేషన్ సమస్య ఎక్కువగా ఉండేది. ఏదేమైనా, ఈ కొత్త ఇంజన్ మునుపటిలా అదే రకమైన శక్తిని మరియు టార్క్ విలువలను ఉత్పత్తి చేయనుంది.

బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 312 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 34 బిహెచ్‌పి శక్తిని, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ అప్‌డేటెడ్ ఇంజన్ కాకుండా, బిఎస్6 మోడళ్లలో స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేయనున్నారు.
MOST READ:కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

ఈ రెండు జర్మన్ మోటార్‌సైకిళ్ళలో ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న (అప్ సైడ్ డౌన్ - యూఎస్‌డి) ఫోర్కులు, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ కలిగి ఉంటాయి. మోటారుసైకిల్‌పై బ్రేకింగ్ విధులను డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌తో కూడిన రెండు చివర్లలో ఉండే డిస్క్ బ్రేక్‌లు నిర్వహిస్తాయి. జి 310 ఆర్ రోడ్ మరియు ట్రాక్ ఉపయోగం కోసం తయారు చేసిన పనితీరు టైర్లతో వస్తుంది, కాగా జి 310 జిఎస్ డ్యూయెల్ పర్పస్ టైర్లను కలిగి ఉండి, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కూడా పోలి ఉంటుందని తెలుస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆప్ ఈ సెగ్మెంట్లోని కెటిఎమ్ డ్యూక్ 390, హోండా సిబి 300R వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇకపోతే బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ ప్రధానంగా రాయల్ ఎన్‌ఫైల్డ్ హిమాలయాన్ మోడల్‌కి పోటీ ఇస్తుంది. సరసమైన ధరలో ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ కోసం చూసే వారికి తక్కువ పవర్ కలిగిన హీరో ఎక్స్‌పల్స్ 200 మంచి ఆప్షన్‌గా ఉంటుంది, అదే ఎక్కువ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారైతే ఫీచర్-ప్యాక్డ్ కెటిఎమ్ అడ్వెంచర్ 390 బైక్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు.
MOST READ:బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఒకప్పుడు బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిళ్లు అత్యధిక పవర్ కలిగిన ఇంజన్‌తో, ఎంతో ప్రీమియం ధరతో లభించేవి. కానీ ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ రాకతో సాధారణ కస్టమర్లకు సైతం ఇవి అందుబాటులోకి వచ్చినట్లు అయింది. తక్కువ ధరలో బిఎమ్‌డబ్ల్యూ బైక్స్ కోరుకునే వారికి ఇవి మంచి ఆప్షన్‌గా నిలుస్తాయి.