బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ భారత మార్కెట్లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్న తమ బిఎస్6 ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లు జి 310 ఆర్, జి 310 జిఎస్‌‌ల కోసం కంపెనీ అధికారికంగా సెప్టెంబర్ 1, 2020వ తేదీ నుండి అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

అప్‌డేచ్ చేయబడిన జి 310 ఆర్ మరియు జి 310 జిఎస్ బిఎస్6 మోడళ్లను పొందనున్న మొదటి దేశం కూడా భారతదేశమేనని బిఎమ్‌డబ్ల్యూ ప్రకటించింది. అంటే, మరికొద్ది రోజుల్లోనే ఈ మోటార్‌సైకిళ్లు ప్రపంచ మార్కెట్లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ మోటార్‌సైకిళ్ళు భారత మార్కెట్లో బ్రాండ్‌కు గరిష్ట అమ్మకాలను తెచ్చిపెట్టాయి. మొత్తం కంపెనీ వార్షిక అమ్మకాలలో ఈ రెండు మోడళ్లే 85 శాతానికి పైగా ఉన్నట్లు బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ నివేదించింది.

MOST READ: వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

ఈ విషయంపై బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా మాట్లాడుతూ, "బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియా భారతదేశంలో మోటార్‌సైక్లింగ్ ఔత్సాహికులలో చాలా బలమైన స్థానాన్ని నిర్మించింది. బిఎమ్‌డబ్ల్యూ జి 310 బైక్‌లతో, పూర్తిగా భిన్నమైన రీతిలో రైడింగ్‌ను అన్వేషించడానికి వేలాది మంది రైడింగ్ ఔత్సాహికులు బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ప్రీమియం ప్రపంచంలోకి ప్రవేశించారు.ఈ రెండు బైక్‌లు అత్యంత పోటీతత్వ ధరతో నిజమైన బిఎమ్‌డబ్ల్యూ అనుభవాన్ని అందిస్తాయని" అన్నారు.

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

బిఎమ్‌డబ్ల్యూ జి 310 సిరీస్ మోటార్‌సైకిళ్లు పూర్తి ఎల్‌ఈడి లైటింగ్‌తో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త ఎక్స్‌టెన్షన్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్‌తో మునుపటి బిఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే వాటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపించనున్నాయి. అయితే, ఓవరాల్‌గా గమనిస్తే మాత్రం మునపటి వెర్షన్లకు త్వరలో విడుదల కాబోయే బిఎస్ మోడళ్లకు పెద్ద వ్యత్యాసాలు లేకపోవచ్చని తెలుస్తోంది.

MOST READ: కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్6 క్రూయిజర్ విడుదల; ధర, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

ఈ రెండు మోటార్ సైకిళ్ళలో బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్‌నే అప్‌గ్రేడ్ చేసి బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా మార్చనున్నారు. ఈ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లలో బిఎమ్‌డబ్ల్యూ పునర్నిర్మించిన బిఎస్6 అపాచీ ఆర్ఆర్ 310 ఇంజన్‌ను ఉపయోగించుకోవచ్చని సమాచారం.

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 312 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 34 బిహెచ్‌పి శక్తిని, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ అప్‌డేటెడ్ ఇంజన్ కాకుండా, బిఎస్6 మోడళ్లలో స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేయనున్నారు.

MOST READ: స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

ఈ రెండు జర్మన్ మోటార్‌సైకిళ్ళలో ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న (అప్ సైడ్ డౌన్ - యూఎస్‌డి) ఫోర్కులు, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ కలిగి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు చివర్లలో డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

జి 310 ఆర్ రోడ్ మరియు ట్రాక్ ఉపయోగం కోసం తయారు చేసిన పెర్ఫార్మెన్స్ టైర్లతో వస్తుంది, కాగా జి 310 జిఎస్ డ్యూయెల్ పర్పస్ టైర్లను కలిగి ఉండి, ఇది ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ ఈ సెగ్మెంట్లోని కెటిఎమ్ డ్యూక్ 390, హోండా సిబి 300ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇకపోతే బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ ప్రధానంగా రాయల్ ఎన్‌ఫైల్డ్ హిమాలయాన్ మోడల్‌కి పోటీగా నిలుస్తుంది.

MOST READ: భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్‌, జి 310 జిఎస్‌ మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇదివరకు భారత మార్కెట్లో విక్రయించిన బిఎస్4 బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ మోడళ్లను వరుసగా రూ.2.99 లక్షలు మరియు రూ.3.49 లక్షలకు విక్రయించే వారు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త బిఎస్6 మోడళ్ల ధర రూ.30,000 వరకూ తగ్గొచ్చని తెలుస్తోంది. తక్కువ ధరలో బిఎమ్‌డబ్ల్యూ బైక్స్ కోరుకునే వారికి ఇవి మంచి ఆప్షన్‌గా ఉంటాయి.

Most Read Articles

English summary
BMW Motorrad India has announced that the pre-launch bookings for the BMW G 310 R and BMW G 310 GS BS6 models will start from September 1, 2020. The motorcycles can be booked online through an enquiry form or at any authorised dealerships across the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X