Just In
- 11 hrs ago
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- 11 hrs ago
సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?
- 13 hrs ago
2020 ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్షిప్ విజేతగా హేమంత్ ముద్దప్ప
- 14 hrs ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
Don't Miss
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Movies
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్టోబర్ 8న బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ బైక్స్ లాంచ్; వివరాలు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్, భారత మార్కెట్లో తమ కొత్త ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లు జి 310 ఆర్, జి 310 జిఎస్లలో బిఎస్6 వెర్షన్లను విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 8, 2020వ తేదీన ఈ రెండు మోడళ్లను భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇప్పటికే ఈ రెండు మోడళ్ల కోసం సెప్టెంబర్ 1, 2020వ తేదీ నుండి అధికారికంగా బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది. కస్టమర్లు ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఏదైనా బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ అధీకృత డీలర్‌షిప్‌ను కానీ సందర్శించి రూ.50,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించి ఈ మోటార్‌సైకిళ్లను బుక్ చేసుకోవచ్చు.

ఈ రెండు మోడళ్లను మార్కెట్లో విడుదల చేయటానికి ముందే, వాటి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియా వీటి కోసం తక్కువ ఈఎమ్ఐ ఫైనాన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫైనాన్స్ పథకాన్ని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తోంది మరియు ఈఎమ్ఐని బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ఫైనాన్స్ స్కీమ్ కింద లెక్కిస్తారు - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:గుడ్ న్యూస్.. థార్ యాక్సెసరీస్ ప్యాక్ వెల్లడించిన మహీంద్రా

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ తక్కువ ఈఎమ్ఐ స్కీమ్‌తో పాటుగా తమ అన్ని మోటార్‌సైకిళ్లతో అందించే వారంటీ మరియు రోడ్-సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీలను కూడా ప్రకటించింది. ఈ మోటార్‌సైకిళ్లపై అపరిమిత కిలోమీటర్ల పరిధిలో మూడేళ్లపాటు స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది.

వినియోగదారులు కావాలనుకుంటే నాల్గవ మరియు ఐదవ సంవత్సరానికి పొడిగించిన వారంటీని కూడా కొనుగోలు చేయవచ్చు. బ్రేక్‌డౌన్ మరియు టోయింగ్ వంటి పరిస్థితులలో అదనపు మద్దతు కోసం వినియోగదారులకు రోడ్-సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) ప్యాకేజీని కూడా అందించడం జరుగుతోంది.
MOST READ:టయోటా హిలక్స్ వుడ్ స్కేల్ మోడల్.. ఇది నిజంగా సూపర్ గురూ..!

బిఎమ్‌డబ్ల్యూ జి 310 సిరీస్ మోటార్‌సైకిళ్లు పూర్తి ఎల్ఈడి లైటింగ్‌తో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త ఎక్స్‌టెన్షన్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్‌తో మునుపటి బిఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే వాటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపించనున్నాయి. అయితే, ఓవరాల్‌గా గమనిస్తే మాత్రం మునపటి వెర్షన్లకు త్వరలో విడుదల కాబోయే బిఎస్6 మోడళ్లకు పెద్ద వ్యత్యాసాలు లేకపోవచ్చని తెలుస్తోంది.

ఈ రెండు మోటార్ సైకిళ్ళలో బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్‌నే అప్‌గ్రేడ్ చేసి బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా మార్చనున్నారు. ఈ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లలో బిఎమ్‌డబ్ల్యూ పునర్నిర్మించిన బిఎస్6 అపాచీ ఆర్ఆర్ 310 ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.
MOST READ:పేద దేశానికీ సహాయం చేయడానికి 36 రోజులు సైక్లింగ్ చేసిన యువకుడు.. ఇంతకీ ఏంటో ఈ కథ తెలుసా ?

బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 312 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 34 బిహెచ్పి శక్తిని, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ అప్డేటెడ్ ఇంజన్ కాకుండా, బిఎస్6 మోడళ్లలో స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేయనున్నారు.

ఈ రెండు జర్మన్ మోటార్‌సైకిళ్ళలో ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న (అప్ సైడ్ డౌన్ - యూఎస్‌డి) ఫోర్కులు, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ కలిగి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు చివర్లలో డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.
MOST READ:సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన కొత్త కార్లు.. ఇవే

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ మోటార్‌సైకిళ్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మోడల్‌ను రోడ్ మరియు ట్రాక్ ఉపయోగం కోసం తయారు చేసిన పెర్ఫార్మెన్స్ టైర్లతో వస్తుంది. ఇకపోతే, బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ డ్యూయెల్ పర్పస్ టైర్లను కలిగి ఉండి, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ ఈ సెగ్మెంట్లోని కెటిఎమ్ డ్యూక్ 390, హోండా సిబి 300ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇకపోతే బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ ప్రధానంగా రాయల్ ఎన్ఫైల్డ్ హిమాలయాన్ మోడల్‌కి పోటీగా నిలుస్తుంది.