బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియా తమ హెరిటేజ్ లైనప్ మోడళ్ల నుంచి ఆర్18 క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్‌ను కంపెనీ సెప్టెంబర్ 19, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

విడుదలకు ముందే, కంపెనీ ఆర్18 మోటార్‌సైకిల్‌ను తమ ఇండియన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసి, కౌంట్‌డౌన్ టైమర్‌ను జోడించింది. బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ ‘స్టాండర్డ్' మరియు ‘ఫస్ట్ ఎడిషన్' అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

స్టాండ్ వేరియంట్‌తో పోలిస్తే ఫస్ట్ ఎడిషన్ మోడల్‌లో పలు కాస్మెటిక్ మార్పులు ఉంటాయి. ఇందులో మోటార్‌సైకిల్‌లోని వివిధ భాగాలను మరింత ప్రీమియం అప్పీల్ కోసం క్రోమ్‌తో ఫినిష్ చేశారు. ట్యాంక్ మరియు ఫెండర్‌లపై పిన్-స్ట్రిప్పింగ్, హిస్టారికల్ ట్యాంక్ యాంబ్లం, లెథర్ బెల్ట్ మరియు లెథర్ గ్లౌవ్స్, సైడ్ ఎయిర్-బాక్స్ కవర్‌లో ఉంచిన ‘ఫస్ట్ ఎడిషన్' బ్యాడ్జ్ మొదలైనవి ఉంటాయి.

MOST READ:భారీగా స్థాయిలో ఉన్న కియా సోనెట్ బుకింగ్స్.. ఇప్పటికి సోనెట్ బుకింగ్స్ ఎంతో తెలుసా ?

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 బాక్సర్ కాన్ఫిగరేషన్‌లో ఎయిర్ / ఆయిల్-కూల్డ్, ట్విన్-సిలిండర్ 1,802 సిసి ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 90 బిహెచ్‌పి శక్తిని మరియు 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 158 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది బ్రాండ్ యొక్క షాఫ్ట్-డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్రూయిజర్ గతంలోని ఐకానిక్ ఆర్5 మోడల్ నుండి ప్రేరణ పొంది, రెట్రో-డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్, స్కల్పటెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, గుండ్రటి రియర్ వ్యూ మిర్రర్స్, పెరిగిన హ్యాండిల్ బార్ మరియు సింగిల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కియా సోనెట్ ఎస్‌యూవీ : ధర & ఇతర వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

మోటారుసైకిల్ 2440 మిమీ పొడవు, 1232 మిమీ ఎత్తు మరియు 964 మిమీ వెడల్పుతో పాటు 1630 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని రైడర్ సీటు ఎత్తు 690 మిమీ వద్ద సెట్ చేయబడింది మరియు దీని మొత్తం బరువు 215 కిలోలుగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 అనేక ఫీచర్లు మరియు ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెడ్ పరికరాలతో లోడ్ చేయబడి ఉంటుంది. ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మోటారు స్లిప్ రెగ్యులేషన్ మొదలైన అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:మీకు తెలుసా.. ఈ సైకిల్ ధర అక్షరాలా రూ. 13.2 లక్షలు.. ఎందుకంటే ?

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

ఇందులోని సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సెంట్రల్ షాక్ స్ట్రట్ సెటప్ ఉంటుంది. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో రెండు 300 మిమీ డిస్క్‌లు మరియు వెనుకవైపు ఒకే ఒక 300 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 ముందు వైపు 19 ఇంచ్ మరియు వెనుక వైపు 16 ఇంచ్ స్పోక్డ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్ టీజర్; సెప్టెంబర్ 19న విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 టీజర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 ఒక గొప్ప పెర్ఫార్మెన్స్ క్రూయిజర్ మోటార్‌సైకిల్. సరదాగా వారాంతాల్లో నడిపేందుకు ఇదొక విలాసవంతమైన బైక్. సుదూర ప్రయాణాలకు సహకరించేందుకు ఇందులో పలు ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ఇది మంచి రిలాక్స్డ్ అండ్ లే-బ్యాక్ రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంటుంది. మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 ధరలు రూ .18 లక్షల నుండి రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా.

MOST READ:ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడ వాటర్ టాక్సీ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

Most Read Articles

English summary
BMW Motorrad India has teased the launch of the R 18 cruiser motorcycle from its Heritage line-up of models. According to the teaser, the BMW R 18 motorcycle will be launched on September 19, 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X