నమ్మండి, ఇది నిజంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్!

ఏదైనా కారు లేదా మోటారుసైకిల్ కొనుగోలు చేసే వారిలో చాలా మందికి, వారికి నచ్చిన వాహనాన్ని తమ అభిరుచికి అనుగుణంగా మోడిఫై చేసుకోవాలనుకునే కోరిక ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునే వారు, కంపెనీ అందిచే మోడల్‌కు భిన్నంగా, తమ అభిరుచికి దగ్గరగా వాహనాలను కస్టమైజ్ చేసుకుంటుంటారు. తాజాగా ఓ కస్టమర్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐకానిక్ మోటార్‌సైకిల్ క్లాసిక్ 350ను బాబర్ స్టైల్‌లో కస్టమైజ్ చేయించుకున్నారు.

నమ్మండి, ఇది నిజంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్!

రెడ్డి కస్టమ్స్ అనే బైక్ మోడిఫికేషన్ కంపెనీ విడుదల చేసిన బిఎస్4 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్‌ను నియో-రెట్రో బాబర్‌గా మార్చింది. ఈ మోడిఫైడ్ మోటార్‌సైకిల్‌కు ‘గ్యాంగ్‌స్టర్' అనే పేరును పెట్టారు. ఈ మోటార్‌సైకిల్‌ను మొదటిసారిగా చూసేవారు, అది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అని గుర్తించలేరు, అంత అద్భుతంగా దీనిని మోడిఫై చేశారు.

ఈ మోడిఫైడ్ గ్యాంగ్‌స్టర్ క్లాసిక్ 350 మోటార్‍సైకిల్‌లో సిల్వర్ యాక్సెంట్స్‌తో పాటుగా డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ ఆరెంజ్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌ను సింగిల్-పీస్ సీట్ లేఅవుట్‌తో డిజైన్ చేశారు. మరింత అగ్రెసివ్‌గా కనిపించేందుకు ఫ్యూయెల్ ట్యాంక్‌కు ఇరువైపులా స్టయిలిష్ కౌల్స్‌ను జోడించారు. ఎగ్జాస్ట్ (సైలెన్సర్) కూడా కత్తరించినట్లుగా చిన్నగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ మోడిఫైడ్ భాగాల్లో ఇంజన్, ఫ్రేమ్ మినహా మిగిలిన అన్ని భాగాలను కస్టమైజ్ చేశారు.

నమ్మండి, ఇది నిజంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్!

ఈ మోడిఫైడ్ గ్యాంగ్‌స్టర్ 350 మోటార్‌సైకిల్‌లో హెడ్‌లైట్, టెయిల్ లైట్, టర్న్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఎల్‌ఈడిలే ఉంటాయి. ఇదులో స్పోక్డ్ వీల్స్ మరియు డ్యూయల్ పర్పస్ టైర్లను ఉపయోగించారు. వెనుక అమర్చిన టైర్ స్టాక్ మోటార్‌సైకిల్‌పై ఉన్నదానికంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది.అయితే, హ్యాండిల్‌బార్లు, స్విచ్-గేర్, మిర్రర్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ సస్పెన్షన్ మరియు ఇంజన్ భాగాలను అసలు క్లాసిక్ 350 నుండి అలాగే కొనసాగించారు.

ఇంజన్ విషయానికి వస్తే, రెగ్యులర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్‌లో 346 సిసి సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ట్విన్-స్పార్క్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 19.8 బిహెచ్‌పి శక్తిని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు కొన్న క్రిస్టియానో ​​రొనాల్డో : ఈ కారు ధర 83 కోట్లు

నమ్మండి, ఇది నిజంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బిఎస్6 కంప్లైంట్ వెర్షన్‌ను భారత మార్కెట్లో రూ.1.65 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంటోంది. క్లాసిక్ 350 బిఎస్6 అదే 346 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌తో లభిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న 650సిసి మోటార్‌సైకిల్స్ అయిన ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లను కూడా బిఎస్6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది.

నమ్మండి, ఇది నిజంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్!

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ఒకేరకమైన 649 సిసి ఎయిర్ మరియు ఆయిల్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి శక్తిని మరియు 52 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్-క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా

నమ్మండి, ఇది నిజంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్!

మోడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బైక్ మోడిఫికేషన్ ప్రక్రియ ఎల్లప్పుడూ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే, ఇలాంటి అద్భుతమైన మోడిఫైడ్ అవుట్‌పుట్ చూసిన తర్వాత దానికి పెట్టిన ఖర్చు చాలా చిన్నదే అనిపిస్తుంది. పై విషయంలో మోడిఫైడ్ క్లాసిక్ 350 గ్యాంగ్‌స్టర్ మోటార్‌సైకిల్ ఖచ్చితంగా అద్భుతంగా కనిపిస్తుందనే చెప్పాలి, ఇది నిజంగా క్రౌడ్ నుండి వేరుగా ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

Most Read Articles

English summary
As per the images seen here, Reddy Customs has taken a BS4 Classic 350 and modified it into a neo-retro bobber. This motorcycle has been named ‘Gangster'. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X